చంద్రబాబు వాళ్ల గురించి మొదటిసారి బాధపడ్డారట

ఏపీ సీఎం చంద్రబాబు.. ఎప్పుడెలా ఉంటారో.. ఎవరితో ఎలా వ్యవహరిస్తారో ఊహించడం కష్టం. ఆయన పైకి ఎంత గంభీరంగా కనిపిస్తారో.. లోపల అంత దయా గుణం కలిగి ఉంటారు. పార్టీ కోసం పాటు పడే వారిని అభినందించే చంద్రబాబు.. తప్పు చేసిన వారికి తన ప్రతాపం చూపిస్తుంటారు. ఎప్పుడూ కఠినంగా కనిపించే చంద్రబాబుకు అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. అయితే అవన్నీ ఆయన తన సన్నిహితుల వద్దే ప్రదర్శిస్తుంటారట. ఇటీవల కొందరు పార్టీ నేతల గురించి సన్నిహితుల దగ్గర ప్రస్తావన వచ్చిన సమయంలో.. చంద్రబాబు బాగా బాధపడ్డారట. ‘‘వాళ్లు చేస్తున్న పనులకు.. తొలిసారి నా నిర్ణయం తప్పేమోనని అనిపిస్తోంది’’ అని వాళ్ల దగ్గర వాపోయారట. ఇంతకీ ఎవరా నేతలు..? చంద్రబాబును బాధపెట్టేలా వాళ్లేం చేశారు…?

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి, మరోసారి అధికారం చేపట్టాలని భావిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దాని కోసం పగలనకా.. రేయనకా.. కష్టపడుతున్నారు. విభజన హామీల విషయంలో కేంద్రం మోసం చేసినా.. అన్ని పార్టీలు ఒక్కడే టార్గెట్ చేసినా.. వాళ్లకు ధీటుగా నిలబడ్డారు. దానికి కారణం ఆయన వెనుక ఉన్న బలగం చూసి. కానీ ఈ మధ్య చంద్రబాబు వెనకున్న బలగం బలహీనంగా మారిపోతుందట. టీడీపీకి వెన్నంటి ఉండే వాళ్లలో అనవసర విషయాల్లో తలదూర్చి విమర్శలపాలవుతున్న నేతలు చాలా మందే ఉన్నారు. అలాంటి వారందరికీ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు.. ఇంకొంత మందిని మాత్రం ఏమీ అనలేని పరిస్థితి తెచ్చుకున్నారట.

వారే.. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కొందరు ఎమ్మెల్యేలు. వచ్చిన వాళ్లు వచ్చినట్లు ఉండకుండా.. టీడీపీ సీనియర్ నేతలతో గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నారట. లేని పోని విభేదాలు సృష్టించి పార్టీలో అలజడికి కారణమవుతున్నారట. పరిస్థితి చేయిదాటిపోతుందేమోనని భయపడిన చంద్రబాబు.. అలాంటి నేతలను పిలిచి మాట్లాడారట. దీనికి సదరు నేతలు ‘‘మేము బాగానే ఉన్నాం సార్.. మీ వాళ్లే కావాలని రెచ్చగొడుతున్నారు. అయినా ఇలాంటి పరిస్థితి ఉంటుందని మేము ముందే చెప్పా కదా’’ అని బదులిచ్చారట. దీనికి అవాక్కవడం చంద్రబాబు వంతైందట. ఆ నేతలు వెళ్లిపోయిన తర్వాత ‘‘వీళ్లను పార్టీలో చేర్చుకుని తప్పు చేశా’’ అని సన్నిహితుల వద్ద బాధ పడ్డారట చంద్రబాబు. ఇదండీ అసలు సంగతి. చంద్రబాబు బాధకు కారణమైన ఆ నేతలెవరో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.