ఊహ‌కు అంద‌ని చంద్ర‌బాబు వ్యూహం?

ఎప్పుడూ లేనిది.. టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు అస‌హ‌నం పెరుగుతుంది. భావోద్వేగాల విష‌యంలో సంయ‌నంగా ఉండే నేత మాట‌లు అదుపుత‌ప్పుతున్నారు. ఎన్న‌డూ మాట‌మార్చారంటూ విమ‌ర్శ‌లు చ‌విచూడ‌ని నాయ‌కుడు.. త‌ర‌చూ మాట త‌డ‌బడుతుంది. ప‌రిపాల‌న ద‌క్షుడిగా.. లక్ష్యం ప‌ట్ల  స్ప‌ష్ట‌త ఉన్న వ్య‌క్తిగా ఆయ‌న‌కు గుర్తింపు ఉంది. కానీ.. హోదా విష‌యంలో కేంద్రం మెలిక‌పెట్ట‌డం.. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లు.. అంత‌కుమించి.. కుమారుడు లోకేష్‌బాబుపై అవినీతి ముద్ర‌లు.. నాయ‌కుడిగానే కాకుండా తండ్రిగా కూడా.. కాస్త ఇబ్బంది తెచ్చిపెట్టాయి. సాధార‌ణంగా ఒత్తిడి ఎక్కువైన‌పుడు చురుగ్గా ఆలోచించే బాబు బుర్ర‌లో ఎందుకీ గంద‌ర‌గోళం అనేది ఇప్ప‌టికీ ప్ర‌శ్నార్ధ‌క‌మే. ఎందుకంటే.. ప‌దేళ్లు వ‌రుస‌గా ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌పుడు పార్టీ , నేత‌ల ప‌రిస్థితిని క‌ళ్లారా చూశాడు. అధికార పార్టీల ధాటికి నేల‌కొరిగిన నేత‌లు, కార్య‌క‌ర్త‌ల ర‌క్తాన్ని ప్ర‌త్య‌క్షంగా చ‌వి చూశారు.  ఇప్పుడున్న ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో టీడీపీ అధికారం కోల్పోయినా.. ప‌రిస్థితులు గ‌తంతో పోల్చితే చాలా దారుణంగా ఉంటాయ‌నేది ముందుగానే ప‌సిగ‌ట్టారు. అందుకే.. ఎలాగైనా.. 2019లో అధికారం టీడీపీ చేతుల్లోనే ఉండాల‌నే నిర్ణ‌యాన్ని 2014 గెలుపు స‌మ‌యంలోనే తీసుకున్నారు. రాజకీయంగా ఎంతో చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ గ‌తానికి భిన్నంగా మారారు. అయితే ఇప్పుడున్న భిన్న వాతావ‌ర‌ణంలో మూడోఫ్రంట్ కోసం ఎవ‌రితో క‌ల‌సి న‌డుస్తార‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రోవైపు తెలంగాణ సీఎం చంద్ర‌శేఖ‌ర్ ఇప్ప‌టికే మ‌మ‌తాబెన‌ర్జీను క‌ల‌సి వ‌చ్చారు. బీజేపీ, కాంగ్రెస్ వ్య‌తిరేక పార్టీల నేత‌ల‌ను క‌ల‌వ‌బోతున్నారు. మ‌రి అటువంటిది ఈయ‌నేమిటీ.. ఏం స్పందించ‌ట్లేద‌నేది తెలుగు త‌మ్ముళ్ల ఆవేద‌న‌. కానీ.. బాబు ఎత్తుగ‌డ‌లు చాలా భిన్నంగా ఉంటాయి.. వైవిధ్యంగా కూడా ఉంటాయ‌నే న‌మ్మ‌కం కూడా పార్టీ శ్రేణుల్లో ఉన్నాయి. మ‌రొక‌రైతే.. ఎన్డీఏ ముందు మోక‌రిల్లే వారే.. కానీ.. చంద్ర‌బాబు.. కొండ‌ను ఢీకొంటున్నారంటే.. త‌ప్ప‌కుండా ఏదో ప్ర‌తివ్యూహం ఉండే ఉంటుంద‌నే న‌మ్మ‌కము టీడీపీ మ‌రింత బ‌ల‌ప‌డేంద‌ుకు ఔష‌దం అనాల్సిందే. జాతీయ‌స్థాయిలో కూట‌మి ఏర్పాటు చేసినా కో-క‌న్వీన‌ర్‌గా చంద్ర‌బాబుకు పెద్ద‌పీట వేస్తారు. కూట‌మి వేరైనా.. ప‌రోక్షంగా మ‌ద్ద‌తు ఇచ్చేందుకు కాంగ్రెస్ చేయి చాపింది. బీజేపీపై జాతీయ‌స్థాయిలో వ్య‌తిరేక‌త ఎంత ఉంద‌నేది రాబోయే క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో తేలిపోతుంది. అక్క‌డ బీజేపీ గెలిస్తే.. ఎత్తులు మ‌రోర‌కంగా ఉంటాయి. పోనీ.. కాంగ్రెస్ విజ‌యం సాధిస్తే.. ఇక ప్రాంతీయ పార్టీల‌కు పండుగ వచ్చిన‌ట్లే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.