ఈ సారి బాబు కుప్పం నుంచి కాదా..?

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్నారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన ఆయన కాంగ్రెస్‌ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవి కట్టబెట్టింది. ఫలితంగా అతి చిన్న వయసులోనే మంత్రి పదవి చేపట్టిన నేతగా రికార్డులకెక్కారు. తర్వాత టీడీపీ చేరి, ఎన్టీఆర్ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. మొదటి రెండు పర్యాయాలు చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. 1989 నుంచి కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఈ నియోజకవర్గం ఎంచుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ టీడీపీనే గెలుచుకుంటూ వచ్చింది. ప్రస్తుతం ఆ నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటల్లో ఒకటిగా చెప్పుకుంటారు.

తాజాగా నియోజకవర్గం విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదట. వరుసగా ఆరు సార్లు తనను గెలిపించిన కుప్పం నియోజకవర్గ ప్రజలను చంద్రబాబు వదిలి పెట్టబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఎక్కడ చూసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు.. దీని వెనుక మరో కోణాన్ని కూడా బయటకు వదిలారు. అదేమిటంటే.. చంద్రబాబు ఈ నియోజకవర్గం వదిలిపెట్టడానికి బలమైన కారణాలే ఉన్నాయట. ఈ నియోజకవర్గం నుంచి ఎవరో ఒక నేతను నిలబెట్టి, కోస్తాంధ్రలో టీడీపీ బలహీనంగా ఉన్న నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయబోతున్నారట. అంతేకాదు రాయలసీమ నుంచి గెలిచిన వాళ్లే ఎక్కువగా సీఎం పదవిని చేపట్టారనే అపవాదును ఈ విధంగా పోగొట్టినట్లు అవుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారట. అయితే, ఆయన పోటీ చేసే నియోజకవర్గాన్ని మాత్రం ఇంకా ఎంపిక చేయలేదనే టాక్ వినిపిస్తోంది.

ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ, ఏపీ రాజకీయాల్లో మాత్రం కలకలం సృష్టిస్తోంది. అసలు కుప్పం నియోజకవర్గం విషయానికొస్తే.. చంద్రబాబు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పటి నుంచి 2014 ఎన్నికల వరకు వరుసగా ఆరు సార్లు అక్కడ విజయం సాధించారు. వాస్తవానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కుప్పం నియోజకవర్గంలో ఆ పార్టీ ఓటమి ఎరుగదు. పార్టీ పెట్టిన తర్వాత మొత్తం ఎనిమిది సార్లు ఎన్నికలు జరగగా, అన్నింటిలోనూ టీడీపీ అభ్యర్ధులే గెలిచారు. మొదటి రెండు సార్లు రంగస్వామి నాయుడు, చివరి ఆరు సార్లు చంద్రబాబు నాయుడు గెలుపొందారు. ఇదిలా ఉండగా, ఈ వార్త గురించి టీడీపీ వర్గాలు ఇప్పటి వరకు స్పందించలేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.