వర్మ సినిమాలో చంద్రబాబును చూశారా..?

తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు జీవితంలోని లక్ష్మీ పార్వతి ఎపిసోడ్‌ను తీసుకుని ఈ సినిమాను రూపొందించబోతున్నాడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ఎంట్రీ ఏ విధంగా జరిగింది..? ఆమెను ఎన్టీఆర్ పెళ్లి చేసుకోడానికి కారణాలేంటి..? ఎన్టీఆర్.. కుటుంబం కంటే ఆమెకెందుకు ప్రాధాన్యతనిచ్చారు..? వంటి తదితర విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు వర్మ వివరించాడు. ఈ సినిమాకు సంబంధించిన రెండు పాటలు ‘వెన్నుపోటు’, ‘ఎందుకు’ ఇప్పటికే విడుదలయ్యాయి. ఈ పాటల్లోనే సినిమా ఎలా ఉండబోతుంది అనే దానిపై హింట్ ఇచ్చాడు ఆర్జీవీ. ముఖ్యంగా ‘వెన్నుపోటు’ అంటూ సాగే పాటను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసినట్లు రూపొందించాడు. అలాగే రెండో పాట ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను విమర్శిస్తూ వ్యంగ్యంగా సాగుతుంది.

పాటలు విడుదలైనా.. ఫస్ట్‌లుక్‌ విడుదలైనా ఈ సినిమా మాత్రం రిలీజ్ కాదని చాలా మంది అనుకున్నారు. వర్మ.. హైలైట్ అవ్వడానికే దీనిని తెరపైకి తెచ్చారన్న కామెంట్లు కూడా వినిపించాయి. అయితే, అలాంటి వాటన్నింటికి శుక్రవారం పుల్‌స్టాప్ పెట్టేలా చేశాడు. మొదట ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో లక్ష్మీ పార్వతి పాత్రను పోషించబోతున్నదెవరో చెప్పేశాడు ఆర్జీవీ. ఆ పాత్రలో యజ్ఞా శెట్టి నటిస్తున్నారు. ఆమె గతంలో వర్మ దర్శకత్వలో వచ్చిన ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమాలో వీరప్పన్ భార్య ముత్తులక్ష్మీ పాత్ర పోషించారు. అలాగే చంద్రబాబు పాత్రధారిని కూడా పరిచయం చేశాడు. ఆయన పాత్రలో హీరో శ్రీ తేజ్ నటిస్తున్నారంటూ ట్వీట్ చేసి మరీ వెల్లడించారు. ఈ పాత్రకు సంబంధించి నాలుగైదు ఫొటోలను విడుదల చేసిన వర్మ.. ఒక్కో ఫొటోకు ఒక్కో క్యాప్షన్ ఇచ్చాడు. అయితే, ఈ పోస్టుల్లో అతను చంద్రబాబు పాత్రను పోషిస్తున్నాడని చెప్పకపోవడం విశేషం. ఈ సినిమాకు ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నేత నిర్మాతగా వ్యవహరిస్తుండడంతో తర్వాత పెద్ద దుమారం రేగింది. ఈ సినిమాను వైసీపీ కావాలని వర్మతో తీయిస్తుందని అధికార తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.