ఆయ‌న‌కు నువ్వు పంగ‌నామాలు పెట్ట‌లేదా మోడీ

ఈరోజు ఏపీలో జ‌రిగిన మోడీ టూర్ తీవ్ర రాజ‌కీయ వేడిని ర‌గిల్చింది. చ‌రిత్ర‌లో ఏ ప్ర‌ధాని ఎదుర్కోనంత వ్య‌తిరేక‌త‌ను అవమాన్ని మోడీ ఏపీలో ఎదుర్కొన్నారు. చంద్ర‌బాబు త‌ప్పుల గురించి ఎవ‌రైనా చెబితే జ‌నాలు వింటారేమో గాని మోడీ చెబితే వినే ప‌రిస్థితిలో తెలుగు వారే కాదు, దేశంలో ఏ రాష్ట్ర ప్ర‌జ‌లూ లేరు. ఎందుకంటే ఆయ‌న చేసిన ప‌నుల దుష్ఫ‌లితాలు జ‌నాలు ఇంకా అనుభ‌విస్తూనే ఉన్నారు. ఈరోజు మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌పై చంద్ర‌బాబు చాలా ఘాటుగా స్పందించారు.
ఇత‌రుల గురించి మాట్లాడే ముందు నీ ఇల్లు చ‌క్క‌దిద్దుకో మోడీ అంటూ మొద‌లుపెట్టిన చంద్ర‌బాబు… అవును లోకేష్‌కి తండ్రి అని గ‌ర్వంగా చెప్ప‌కుంటాను. నువ్వు నీకు భార్య ఉంద‌ని బ‌హిరంగంగా చెప్పుకోలేక‌పోతున్నావు. త‌ల్లిని ఒక చోట‌, పెళ్లాన్ని ఒక‌చోట పెట్టిన వాడివి నువ్వు అంటూ ఘాటుగా స్పందించారు చంద్ర‌బాబు. పీఎం ప‌ద‌వి కోసం నీ భార్య పేరు వాడావు గాని… అంత‌వ‌ర‌కు ఆమె ఎక్క‌డుందో ఏమైందో ఎపుడైనా ఆలోచించావా? పోనీ ఆమె పేరు వాడిన పాపానికి అయినా ఆమెను ఒక‌సారి క‌లిశావా? అంటూ చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు.
ఇక నీ విధేయ‌త‌, నీ నిజాయితీ … నీ గురువు అద్వానీకి పంగ‌నామాలు పెట్టిన‌పుడే అర్థ‌మైంద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. అద్వానీని మోదీ ఏం చేశారో దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు. గోద్రా కేసులో మోదీని కాపాడి పార్టీలో పైకి తీసుకొచ్చిన అద్వానీనే మోడీ మోసం చేశారంటే.. ఇక మీరు ఏపీని మోసం చేయ‌డంలోనే పెద్ద వింతేం లేద‌ని వ్యాఖ్యానించారు. అంత‌పెద్దాయ‌న‌, గురువు న‌మ‌స్కారం పెడితే ప్ర‌తిన‌మ‌స్కారం పెట్టే సంస్కారం లేని నువ్వు నాకు నీతులు చెబుతున్నావా అంటూ చంద్ర‌బాబు రిటార్ట్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ దేశంలో భాగమే.. పెత్తనం కుద‌ర‌దు. అయ్యో కాంగ్రెస్‌ బిడ్డ‌ను బ‌తికించ‌డానికి తల్లిని చంపిందని మీరే చెప్పారు. ఆరోజు కాంగ్రెస్ త‌ల్లిని ఐసీయూలో పెట్టింది… నిజంగా త‌ల్లిని చంపేసింది మీరే. మీరు ద‌గా చేశారు కాబ‌ట్టే ప్రజలంతా రోడ్డు మీద‌కి వ‌చ్చారు. మీ ఎదురుదాడి నా మీద కాదు 5 కోట్ల ఆంధ్రుల మీద చేస్తున్నారు. మేం అడిగింది నాకు ఆస్తులు ఇవ్వ‌మ‌ని కాదు, విభజన హామీలు అమలు చేయమంటున్నాం, ప్రత్యేక హోదా అడుగుతున్నాం. ఎందుకు మాట్లాడరు’.
అమ‌రావ‌తికి డ‌బ్బులు ఏదీ ?
ప్ర‌త్యేక హోదా ఏదీ ?
పోల‌వ‌రం పెండింగ్ నిధులు ఏవీ?
క‌డ‌ప స్టీలు ఏదీ?
రైల్వే జోను ఏదీ?
అంటూ… మీరు ఇవి ఇవ్వ‌నంత కాలం ఏపీకి ద్రోహే అని విమ‌ర్శించారు. *నరేంద్ర మోదీ మారాడు అనుకుని, సాయం చేస్తాడని 2014లో పొత్తు పెట్టుకున్నాం. మోదీతో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవు. 2014 ఎన్నికల్లో 14 సీట్లు ఇస్తే బీజేపి గెలిచింది నాలుగు సీట్లు. జీఎస్టీ, నోట్ల ర‌ద్దును విఫ‌ల ప్రయోగం కింద మార్చిన ప్ర‌ధాని ఓ తుగ్ల‌క్ అంటూ దుయ్య‌బ‌ట్టారు. బ్యాంకులు దివాళా తీశాయి. దొంగ‌లు కోట్లు దోచుకుని విదేశాల‌కు చెక్కేశారు. అందుకే మిమ్మ‌ల్ని దింప‌డం ఏపీకి మాత్ర‌మే కాదు, దేశానికే అవ‌స‌రం అంటూ చంద్ర‌బాబు గ‌ర్జించారు. ఏపీ మనోభావాలు దెబ్బతీశారు.. మా పొట్ట కొట్టారు. నాది యూటర్న్ కాదు.. రైట్ టర్న్. మీరు రాష్ట్రానికి అన్యాయం చేశారు కాబ‌ట్టే ఎదురు తిరిగాను. మా గ‌డ్డ‌పైకి వ‌చ్చి మాకే 3 ల‌క్ష‌ల కోట్లు ఇచ్చామ‌ని అబద్ధాలు చెబుతారా? అంటూ ముఖ్య‌మంత్రి మండిప‌డ్డారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.