తెలంగాణ‌ను కాస్త ప‌ట్టించుకో బాబు !

చంద్ర‌బాబు ఆంధ్రా ముఖ్య‌మంత్రి. తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు. తెలంగాణ‌లో ఎన్నిక‌లు ఉన్నాయి. కాంగ్రెస్‌తో పొత్తు చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఇది ఏ పార్టీకి అయినా ఎంతో కీలకం. కానీ ఒక‌ట్రెండు సార్లు తెలంగాణ నేత‌ల‌కు క‌నిపించిన చంద్ర‌బాబు. త‌న మానాన తాను త‌న ప‌నులు చేసుకుపోతున్నాడు. రాష్ట్రంలో తిర‌గ‌డ‌మో, రాష్ట్రం గురించి త‌ప్ప తెలంగాణ ఎన్నిక‌ల్లో వేలు పెట్ట‌డానికి ట్రై చేయ‌ట్లేదు.
అయితే, ఇక్క‌డ రాజ‌కీయ ప‌రిస్థితులు మాత్రం దానికి రివ‌ర్స్‌లో ఉన్నాయి. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, మ‌రో మంత్రి హ‌రీష్‌రావు… ఇంకా టీఆర్ఎస్ వంగ మాగ‌దులు అంద‌రూ పొద్దున లేస్తే దైవ నామ పారాయ‌ణం చేసిన‌ట్టు చంద్ర‌బాబును త‌ల‌వ‌కుండా, ఆయ‌న గురించి మాట్లాడ‌కుండా, విమ‌ర్శ‌లు చేయ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు.
సీమాంధ్రుల‌ను మ‌చ్చిక చేసుకోవ‌డానికి తీవ్ర తంటాలు ప‌డుతున్న కేటీఆర్ కేసీఆర్‌, హ‌రీష్‌ లు చంద్ర‌బాబును తిట్ట‌డంతో తెలంగాణ ఫ్యాన్స్‌ను, జ‌గ‌న్ ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకోవ‌డానికి శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు. అస‌లు ఇంత కీల‌క స‌మ‌యంలోనే పార్టీ రాష్ట్ర శాఖ‌కి పూర్తి స్వేచ్ఛ‌ను మీ ప‌ని మీరు చేసుకుపోండి అని చంద్ర‌బాబు చెబుతుంటే… మహాకూట‌మి గెలిస్తే చంద్ర‌బాబు పాలిస్తాడ‌ని కేటీఆర్ తెగ ప్ర‌చారం చేస్తున్నారు. క‌నీసం రాహుల్ తెలంగాణ‌ను ప‌ట్టించుక‌న్నంత‌యినా చంద్ర‌బాబు ప‌ట్టించుకోవ‌డం లేదు. కానీ పొద్దున లేస్తే అదేప‌నిగా చంద్ర‌బాబును తిడుతున్న‌ది టీఆర్ఎస్ ఫ్యామిలీ.
వీళ్ల‌కు స‌మాధానం చెప్ప‌డానికి అయినా చంద్ర‌బాబు తెలంగాణ‌ను ప‌ట్టించుకుంటారో లేదో మ‌రి. తాజాగా ఎన్నిక‌ల ప్ర‌చారానికి ర‌మ్మ‌ని పార్టీ నేత‌లు చంద్రబాబుకు ఆహ్వానం పంపారు. దానికి ఇంకా చంద్ర‌బాబు నుంచి పార్టీ నుంచి స్పంద‌న రాలేదు. తెలంగాణ‌కు ఒక శాఖ ఉంది. స‌మ‌ర్థులు ఉన్నారు. వారు న‌డుపుతారు. అలాగే రేపు అధికారం వ‌చ్చినా ఇక్క‌డ‌కు లోకేషూ రాడు, బాబూ రాడు… సెంటిమెంట్ ర‌గిలించ‌డానికి కేసీఆర్ గేమ్ అంతే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.