బాబు మాస్టర్ ప్లాన్, విపక్షాలకు ఇక చుక్కలే…

టీడీపీ ప్రణాళిక బద్దంగా వెళుతోంది. మిత్రులు ఎవరో, శత్రువులు ఎవరో అర్థం చేసుకుంది. ఎవరితో ఎంత వరకు ఉండాలో సిఎం చంద్రబాబుకు తెలిసినట్లు మరెవరికీ తెలియదు. గుజరాత్ లో అల్లర్లు జరిగినప్పుడు అప్పుడు సిఎంగా ఉన్న మోడీని ఉరితీయాలని చెప్పింది చంద్రబాబునే. ఆ తర్వాత మోడీ లాంటి ప్రధాని దొరకడం అదృష్టమని చెప్పింది అదే చంద్రబాబు. ఇప్పుడు మోడీని నమ్మి నిలువునా మోస పోయామని చెబుతోంది చంద్రబాబునే. అందుకే చంద్రబాబు ఎప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడతారో ఏం చేస్తారో విపక్షాలకే కాదు.. ఆ పార్టీ నేతలకు అంతు చిక్కడం లేదు. నాలుగేళ్ల పాటు మోడీ భజన చేసిన చంద్రబాబు ఇప్పుడు బీజేపీ, ముఖ్యంగా మోడీ, అమిత్ షాలపై నిప్పులు చెరుగుతున్నారు. 
విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ‘నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలు’ చేస్తుందని చెబుతున్నారు. న్యాయం చేస్తుందని నాలుగేళ్లు ఓపిక పట్టాను. ఇక ఆగలేక బయటకు వచ్చినట్లు చెబుతున్నారు. కనీసం ఎంపీలతోనైనా రాజీనామా చేయించక లేకపోతున్నారు చంద్రబాబు. మొన్నటి వరకు హోదా ఎందుకు అన్న చంద్రబాబు ఇప్పుడు అదే మనకు సంజీవిని అంటున్నారు. విపక్షాలు పోరాటం చేసినప్పుడు ఎద్దేవా చేసిన చంద్రబాబు ఇప్పుడు అదే పోరాటం చేయాలంటున్నారు. 
హోదా కోసం బంద్ చేస్తే వద్దంటున్నారు బాబు. విద్యార్థులపై కేసులు పెట్టిస్తామని బెదిరించారు. అదే చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు బంద్ లు చాలానే చేశారు. తాను చేసిందే కరెక్టు. అదే పని మిగతా వారు చేస్తే తప్పు అంటున్నారు. ఫలితంగా చంద్రబాబు ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు బీజేపీ, వైకాపా, జనసేనలే టార్గెట్ గా పావులు కదుపుతున్నారు. ఆ మూడు పార్టీలు ఏకమయ్యాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు. టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఏపీలోని అన్ని జిల్లాల్లో ధర్మపోరాటానికి తెదేపా రంగం సిద్ధం చేసింది. తిరుపతిలో జరిగిన ధర్మపోరాట సభ తరహాలోనే మరో 12చోట్ల భారీ సభలు నిర్వహించనుంది టీడీపీ. విశాఖలో ఈనెల 20న సభ నిర్వహించేందుకు సిద్దమవుతోంది. వచ్చే ఏడాది జనవరిలో అమరావతిలో చివరి సభను జరిపేందుకు కసరత్తు చేస్తోంది. 
జగన్ జైలుకు వెళ్లడట
అంతే కాదు… నియోజకవర్గాల్లో టీడీపీని గెలిపించేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాలని సీఎం నేతలకు చెప్పారు. జగన్‌, గాలి జనార్దన్‌రెడ్డి కేసులు నీరుగారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నయవంచన చేస్తుందని చంద్రబాబు అన్నారు. అసలు జగన్ ను కేసుల నుంచి బీజేపీ బయట పడేస్తుందనే ప్రస్తావన తేవడంతో అలానే జరుగుతుందనే వాదనకు బలం చేకూరినట్లు అయింది. జగన్ జైలుకు వెళతాడని చెప్పే నేతలు ఇక మీదట ఆ మాటలు అనరేమో. బీజేపీతో ఆ పార్టీ కుమ్మక్కు అయింది. అందుకే జగన్ ను కేసుల నుంచి బయట పడేస్తుందనే ప్రచారం చేయనుంది టీడీపీ. వ్యూహాత్మకంగానే ఇలాంటి ప్రచారం చేయనుంది టీడీపీ. ఫలితంగా ప్రజల్లో ఆ పార్టీలకు వ్యతిరేక భావన తెచ్చేందుకు పావులు కదుపుతోంది. 

1 Comment

 1. దెబ్బ కొడుతున్నపుడు మన రియాక్షన్ ఒకరకంగా ఉంటుంది. అన్నం పెడుతున్నప్పుడు మనిషి రియాక్షన్ మరోరకంగా ఉంటుంది. ఇది సహజన్యాయం. సాయం చేస్తున్నపుడు, మోసం చేస్తున్నపుడు కేంద్రం పైన మన ప్రవర్తన ఒకే రకంగా ఉండాలని అనుకోవడం సహజ ధర్మం కాదేమో?
  సిద్ధాంత పరంగా వి భేదించ డం అనేది మన రాజకీ యాలలో నేడు లేదు.
  అందుకే చంద్రబాబు గారి ప్రవర్తన మన రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు, వారి పార్టీకి కలిగే రాజకీయ లాభాలను బట్టి
  మారడంలో ఆశ్చర్యం లేదు. అది సహజాతి సహజం.

  గోద్రా అల్లర్ల సమయంలో మోడీని వ్యతిరేకించడం అనేది సెక్యులర్ సిద్ధాంతపరమైనది.
  నేడు కేంద్రం చేసిన మోసానికి మోడీని వ్యతిరేకించడం,రాష్ట్రప్రయోజనాలకు సంబంధించిన వ్యవహారం.
  అలాగే హోదా,ప్యాకేజి అనేవి రెండు రకాల పాలసీలు. ఒకటి లేదు రెండోది ఇస్తామని చేపినపుడు నమ్మి,రెండో దాని ఆహ్వానించాలి. ఆమాట కూడా మోసమే అని తేలిన తర్వాత హోదాని భుజం పై వేసుకోవాలి. ఎందుకంటే , చట్టబద్ధత అనేది హోదాకే ఉంది కాబట్టి , కేంద్రం తో పోరాడుతున్నపుడు హోదానే భుజాన వేసుకోవలసిన అవసరం ఉంది.
  చంద్రబాబు స్థానంలో ఎవరున్నా ఇలా చేయవలసిందే !

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.