పవన్ కల్యాణ్ అనుచరులపై చంద్రబాబు ఆరా

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుచరులు కొందరు టీడీపీ సర్కార్ లో ఉన్నారు. పవన్ రికమండేషన్ తో కొందరికి టిక్కెట్లు ఇచ్చారనే వాదనుంది. అంతేకాదు.. మంత్రితో పాటు.. మరికొన్ని నామినేటెడ్ పదవులు వచ్చేందుకు పవన్ కారణమంటారు. చంద్రబాబు, పవన్ మధ్య సయోధ్య నెరిపిన నేతల పరిస్థితి ఇప్పుడు ముందు గొయ్యి వెనుక నుయ్యిలా ఉంది. అఖిల పక్ష సమావేశాలకు కనీసం ఒక్క ప్రతినిధినైనా తీసుకురాలేకపోయారని చంద్రబాబు అడుగుతున్నారట. ఫలితంగా కాపు సామాజిక వర్గ నేతలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. పవన్ కల్యాణ్ ఇప్పుడు రివర్స్ గేర్ లో వెళుతున్నారు. యూటర్న్ తీసుకున్న చంద్రబాబులా.. పవన్ కల్యాణ్ అదే పని చేశారు. హోదా అంటే అదేమైనా సంజీవినా అన్నారు చంద్రబాబు. చంద్రబాబును పొగిడిన పవన్ నేడు ఆయన అవినీతి పరుడంటున్నారు. లోకేష్ అంత కంటే ఎక్కువేనని విమర్శిస్తున్నారు. ఇవన్నీ టీడీపీ అధినేత చంద్రబాబును చికాకు గురి చేస్తున్నాయట.
గుంటూరులో జరిగిన జనసేన సభలో 40 మంది వరకు టీడీపీ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని పవన్ కల్యాణ్ అన్నారు. ఫలితంగా వారెవరు.. ఏం చేస్తున్నారు. కొంపదీసి సమాచారం ఏమైనా లీక్ చేస్తున్నారనే విషయంపై  ఆరా తీస్తున్నారు. దీంతో టీడీపీలో ఉన్న నేతలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మంత్రి పదవుల కోసం పవన్ ను ఆశ్రయించిన నేతలు కొందరు జనసేనలోకి దూకాలని చూస్తున్నారు. సంబంధాలు ఉంటే సరే. అవి పూర్తిగా తెగిపోయాయి. అందుకే పవన్ పార్టీలోకి జంప్ చేయడం లేక వైకాపాలోకి వెళ్లడమా అని ఆలోచిస్తున్నారు. హోదా విషయంలో టీడీపీ గట్టిగా పోరాడుతున్నా.. ప్రజల నుంచి అనుకున్నంత మేర మైలేజ్ రావడం లేదు. ఇలాంటి సమయంలో పవన్ అనుచరులు బయటకు వెళితే ఇబ్బందినే. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.