అప్పుడైనా.. ఇప్పుడైనా.. ఎప్పుడైనా బాబు హవానే వేరులే!

ఒకప్పుడు అంటే (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు కొనసాగించిన హవా అందరికీ తెలిసిందే. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడితే.. ఆంధ్రప్రదేశ్‌లో అందరికీ షాక్ ఇస్తూ చంద్రబాబు పసుపు జెండా ఎగురవేశారు. అంతేకాదండోయ్.. సిఎం కుర్చీలో కూర్చొని ఆయన చేసిన హవా అంతా ఇంతా కాదు. రాష్ట్రానికి నిధులు లేకున్నా ఆశించిన దానికి మించి అభివృద్ధి పనులు చేశారు. ఎంత చేసినా విమర్శించేవారు ఉంటారు లెండి! అది వేరు విషయం. ఇక ఇప్పుడు తెలంగాణా ఎన్నికల బరిలో దిగి ప్రచార కార్యక్రమాల్లో అయన చేస్తున్న హవా చూసి.. ప్రధాన ప్రతిపక్షం టీఆర్‌ఎస్ దిక్కుతోచని స్థితిలో పడిపోయిందనే చెప్పుకోవచ్చు. తెలంగాణలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.

ఖ‌మ్మంలో నిర్వ‌హించిన మ‌హాకూట‌మి స‌భ‌కు హాజరైన చంద్ర‌బాబు.. తెలంగాణా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. అక్క‌డే ‘జై తెలంగాణా’ అనే నినాదం కూడా ఇచ్చి తన ప్రత్యేకత చాటుకుంటూ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకున్నారు. ఆ త‌ర్వాత హైద‌రాబాద్ న‌డిబొడ్డున అమీర్‌పేట‌లో జరిగిన మ‌హాకూట‌మి స‌భలోనూ బాబు జోరు మాములుగా లేదు. కేసీఆర్‌కు ముచ్చెమటలు పట్టేలా ఇక్కడి యువ‌త‌, ఉద్యోగులు చంద్ర‌బాబుకు పెద్దఎత్తున బ్ర‌హ్మ‌ర‌థం పట్టడం, వీ లవ్‌ చంద్రబాబు.. వీ మిస్‌ చంద్రబాబు.. మేము ఇక్కడ ఈ పొసిషన్‌లో ఉండటానికి కారణం ఆయనే అంటూ.. భారీ ఎత్తున ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించ‌డం సంచ‌ల‌నంగా మారింది. సభలోని నేతలు తమ ప్రసంగాల్లో చంద్రబాబు పేరును ప్రస్తావించినప్పుడల్లా యువకులు, కార్యకర్తలు ఉత్సాహంగా కేరింతలు కొట్టడం చూస్తుంటే.. బాబు రేంజ్ ఏంటో అర్థమైపోతుంది.

ఇక.. కార్యకర్తలను చూస్తుంటే తనకు పాత రోజులు గుర్తొస్తున్నాయంటూ చంద్రబాబు తన ప్రసంగాన్ని ప్రారంభించటం.. ప్రసంగం ముగిసే వరకు వాళ్లను ఉత్తేజపరుస్తూ మాట్లాడటం, కార్యకర్తలను ఆయన తమ్ముళ్లూ అంటూ సంభోధించటం సభను మరింత రసవత్తరం చేసింది. ఉత్సాహంగా కేరింతలు కొడుతూ సభను ఎంజాయ్ చేశారంతా. అదే కేసీఆర్ చేస్తున్న ప్రజా ఆశీర్వాద సభలో కొన్ని చోట్ల కుర్చీలు ఖాళీగా ఉండటం అందరూ గమనించారు. దీని బట్టే అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు హవా ఏంటో! హైదరాబాద్‌పై ఆయన ప్రభావం ఏంటో! ఎవరేమన్నా ప్రజాకూటమికి బాబు వల్లే అంతులేని బలం వచ్చిందని అంటున్నారు జనం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.