న్యూజెర్సీ బ‌హిరంగ స‌భ‌కు చంద్ర‌బాబు!

దాదాపు.. 11 ఏళ్ల‌త‌రువాత‌.. అగ్ర‌రాజ్యం అమెరికా న‌డిబొడ్డున‌.. న్యూజెర్సీలో తెలుగుదేశం పార్టీ జెండాలు ప‌సుపు క‌ళ‌ను తీసుకు రానున్నాయి. ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్ర‌వాసాంధ్రులు నిర్వ‌హించ‌నున్న స‌భ‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు ప్ర‌సంగించ‌నున్నారు. దీంతో దాదాపు. అమెరికా, కెన‌డా త‌దిత‌ర దేశాల్లోని తెలుగుదేశం నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు.. పెద్ద ఎత్తున స‌భ‌ను విజ‌య‌వంతం చేసేందుకు స‌మాయ‌త్త‌మ‌య్యారు. నెల‌రోజుల ముందునుంచే బ‌హిరంగ స‌భ‌కు సంబంధించిన ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మ‌య్యారు. దీనిలో ఏపీ ఎన్ ఆర్‌టీ కీల‌క భూమిక పోషించ‌నుంది. 2007 త‌రువాత 2018లో త‌లపెట్టిన స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని ఏపీ ఎన్ ఆర్ టీ చీఫ్ కో-ఆర్డినేట‌ర్ బుచ్చి రామ్‌ప్ర‌సాద్ పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు సెప్టెంబ‌రు 23-27 వ‌ర‌కూ అమెరికాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఐక్య‌రాజ్య‌స‌మితిలో జ‌ర‌గ‌బోయే వ్య‌వ‌సాయ స‌ద‌స్సులో పాల్గొనేందుకు ఆయ‌న డాల‌ర్ దేశం వెళ్ల‌బోతున్నారు.
దీనిలో భాగంగా చంద్ర‌బాబు న్యూజెర్సీలోని ఎన్‌జేఐటీ(న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ)లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటుచేసిన భారీబ‌హిరంగ స‌భ‌లో దిశానిర్దేశం చేస్తార‌ని బుచ్చి రామ్‌ప్ర‌సాద్ తెలిపారు. ఎన్ ఆర్ ఐల‌కు కూడా ఓటుహ‌క్కు ఇవ్వ‌టంపై కూడా చంద్ర‌బాబు ప‌లు సూచ‌న‌లు చేస్తార‌న్నారు. అటు బోస్ట‌న్ నుంచి వ‌ర్జీనియా వ‌ర‌కూ సుమారు 5000 మంది వ‌ర‌కూ అభిమానులు త‌ర‌లి వ‌స్తార‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు త‌లిపారు. స‌భ‌లో చంద్ర‌బాబు ప్ర‌వాసాంధ్రుల గురించి మాట్లాడ‌టమే గాకుండా దిశానిర్దేశం చేస్తార‌న్నారు. ఎన్నిక‌ల‌కు తొమ్మిది నెల‌ల ముందుగానే బాబు రావ‌టం చాలా ఆనందంగా ఉంద‌న్నారు. అమెరికా, కెన‌డాల నుంచి కూడా భారీగా తెలుగు అభిమానులు వ‌స్తార‌న్నారు. ప్ర‌తిష్ఠాత్మ‌కంగా త‌ల‌పెట్టిన భారీ స‌భ‌కు తెలుగుదేశం అభిమానులు, నాయ‌కులు పెద్ద ఎత్తున హాజ‌రై స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.