చంద్రబాబుకు మరో అంతర్జాతీయ గౌరవం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ముందు చూపు ఉన్న నేత. ఇది ఎన్నో విషయాల్లో నిరూపణ అయింది కూడా. ప్రస్తుతం హైదరాబాద్‌ ఇంత స్థాయిలో అభివృద్ధి సాధించిందంటే చంద్రబాబు చేసిన పనులే కారణం. అలాగే ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును పొందాయి. తాజాగా ఏపీలో చేపట్టిన ఓ కార్యక్రమంలో మరోసారి ఆయన కీర్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. తద్వారా ఆయనకు అరుదైన గౌరవం దక్కనుంది. రాష్ట్రంలో పచ్చదనం నింపడంతోపాటు ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించేలా ఆహార ఉత్పత్తులు ఉండేవిధంగా చర్యలు తీసుకుంటోంది. ప్రజలంతా ఆరోగ్యంగా జీవించడానికి ప్రకృతి సాగును ప్రోత్సహిస్తోంది. ప్రస్తుత పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే మనుగడ ఉండదని 2018ని ప్రకృతి వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించింది. విషపూరితమైన కృత్రిమ ఎరువులు, క్రిమి సంహారక మందులకు దూరంగా సాగుకు కృషి చేస్తున్నారు. సహజసిద్ధ వ్యవసాయం ద్వారా సాధించిన ఆహారోత్పత్తులు మనల్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించేలా చేస్తాయి.

అంతేకాదు, ప్రకృతి వ్యవసాయానికి మళ్లకపోతే మరో 200 ఏళ్లకు భూసారం పూర్తీగా దెబ్బతింటుందని యునైటెడ్ నేషన్స్ సంస్థ హెచ్చరించింది. 2050 నాటికి తీవ్ర నీటి కొరత ఏర్పడుతుంది. ఎరువులు, పురుగుమందులు అధికంగా వినియోగిస్తే పర్యావరణం, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. అత్యాధునిక వ్యవసాయ పద్ధతులతో చాలా జీవరాసులు అంతరించిపోతున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఈ విషయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అటు భూసారం దెబ్బతినకుండా, రైతు ఆర్ధికంగా బలోపేతం అయ్యేందుకు, ఇటు ప్రజారోగ్యం కాపాడేందుకు వ్యూహాత్మకంగా పెట్టుబడి లేని సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్, ప్రపంచ బ్యాంకు నిపుణులు, ఐడీహెచ్ – టీఎంజీ పరిశోధనావేత్తలు వంటి అనేక మంది దీనికి మద్దతు పలుకుతున్నారు. దీంతో ఈ పద్దతిని రాష్ట్రానికి తీసుకువచ్చి ప్రశంసలు పొందుతున్నారు.

ఇదే విషయాన్ని కొద్ది రోజుల క్రితం న్యూయార్క్ టైమ్స్ పత్రిక “జీరో బడ్జెట్ ఫార్మింగ్” అంశంపై ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌పై న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో రాష్ట్రంలో ప్రకృతి సేద్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొంటున్న చొరవకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ విషయంలో మార్గ దర్శనం చేయాలని ఐక్యరాజ్యసమితి నుంచి సీఎంకు బుధవారం ఆహ్వానం అందింది. వచ్చే నెల 24న న్యూయార్క్‌లో నిర్వహిస్తున్న ‘ఆర్థిక సుస్థిరత, వ్యవసాయంలో సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై నిర్వహించే సదస్సులో కీలకోపన్యాసం చేయాలని సీఎం చంద్రబాబుని ఆహ్వానించింది. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయరంగంలో ఏపీ ముందుకు వెళ్తున్న తీరును ఐరాస ప్రశంసించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.