రెడ్లకు చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యత

టీడీపీలో చేరిన చాలా రోజుల తర్వాత రంగంలోకి వచ్చారు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి. ఇటు జగన్, అటు పవన్, మరోవైపు కాంగ్రెస్ నేతలు సిఎం చంద్రబాబు పై విరుచుకుపడుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు పెద్ద పీట వేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రెడ్లను అసలు పట్టించుకోవడం లేదనే వాదన వచ్చింది. అందుకే నల్లారి తెరపైకి వచ్చారు. ఆ మాటలను ఖండించారు. అసలు ఏం తెలుసునని అలా మాట్లాడుతున్నారు. రెడ్డి సామాజికవర్గానికి చంద్రబాబు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. పార్టీ ఫిరాయించిన వారిలో నలుగురికి చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారు. వారిలో ముగ్గురు రెడ్లు ఉన్నారు. రాష్ట్ర మంత్రులు ఆదినారాయణరెడ్డి, అఖిలప్రియ, అమరనాథరెడ్డి, చీఫ్‌విప్‌ మేడా మల్లికార్జునరెడ్డిలకు పదవులు ఇచ్చిన సంగతిని రెడ్లు మరవకూడదన్నారు. 
వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు అసత్యాలు ప్రచారం చేసినా ఎవరూ నమ్మరన్నారు. కాపులు, రెడ్లకు చంద్రబాబు ఎక్కువగానే ప్రయార్టీ ఇస్తున్నారని చెప్పారు. బీసీలను తక్కువ చూడటం లేదని ప్రస్తావించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కన్నా చంద్రబాబునే రెడ్లకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారని చెప్పడం హాట్ టాపికైంది. 2018 ముగిసే వరకు కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన చేయడం లేదట. జాతకాలను బాగానే నమ్మే కిరణ్ కుమార్ రెడ్డి అప్పటి వరకు క్రియాశీల రాజకీయాలకు దూరంగానే ఉంటారని తెలుస్తోంది. పుస్తకం రాయడం పూర్తి చేసిన కిరణ్ కుమార్ రెడ్డి తాజా రాజకీయాలను బాగా గమనిస్తున్నారట. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్నారని సమాచారం. తన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు కిరణ్. అందుకే రెడ్ల విషయంలో చంద్రబాబు ఎలా చేస్తుంది ఉదాహారణలతో వివరించారు. మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోను టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. ఎంపీగా పోటీ చేసేందుకు కిరణ్ కుమార్ రెడ్డి సుముఖంగా ఉన్నారట. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.