వినాయక చవితి కానుకనిచ్చిన ‘ఎన్టీఆర్’ యూనిట్

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, దివంగత నేత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతున్న చిత్రం ‘‘ఎన్టీఆర్’’. ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ నిర్మించి, నటిస్తున్న ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ తన తండ్రి పాత్రను పోషిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్.. బసవతారకమ్మ పాత్రలో నటిస్తోంది. వీరితో పాటు కైకాల సత్యనారాయణ, ప్రకాశ్‌రాజ్‌, వీకే నరేశ్‌, జిష్షు సేన్‌గుప్తా, మురళీశర్మ తదితరులు నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఎంతో ఆసక్తికి రేకెత్తిస్తున్న ‘ఎన్టీఆర్’పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఆ మధ్య స్వాతంత్ర్య దినోత్సవ (ఆగస్టు 15) కానుకగా ‘ఎన్టీఆర్’ ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో బాలకృష్ణను చూసిన వారందరూ అచ్చు ఎన్టీఆర్‌లా ఉన్నడే అని ఆశ్చర్యపోయారు. అంతేకాదు, ఈ ఒక్క పిక్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది.

గురువారం వినాయక చవితి సందర్భంగా బుధవారం చిత్ర బృందం సినిమాకు సంబంధించిన మరో లుక్‌ను విడుదల చేసింది. అయితే, ఇది మాత్రం ఎన్టీఆర్‌ది కాదు.. ఆయన అల్లుడిది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తర్వాత అంతటి ప్రాధాన్యం కలిగిన పాత్ర అంటే చంద్రబాబుదే అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఈ పాత్రను టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా చేస్తున్నాడని కొద్దిరోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడు చిత్ర బృందం విడుదల చేసిన పిక్ చూస్తే అదే నిజం అని తేలిపోయింది. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఈ సినిమాలోని రానా లుక్‌ను చిత్ర‌బృందం రివీల్ చేసింది. ‘దూర‌దృష్టి క‌లిగిన నాయ‌కుడి పాత్ర‌లో రానా’ అంటూ ఈ లుక్‌ను విడుద‌ల చేశారు. అలాగే ప్రేక్ష‌కుల‌కు వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు కూడా తెలియ‌జేశారు. ఇది చూసిన సినీ అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంతేకాదు, సోషల్ మీడియాలో షేర్లు చేస్తూ తెగ ఖుషీ అయిపోతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.