జ‌గ‌న్ ఎందుకు సైలెంట‌య్యారో చెప్పిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోమారు ఘాటుగా స్పందించారు. అమ‌రావ‌తిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయంపై గళమెత్తితే దేశ ద్రోహులమయ్యామా అని ప్రధాని మోడీని నిలదీశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి ఏపీకి ప్రత్యేక హోదా తెస్తానని వైసీపీ అధినేత జగన్‌ వ్యాఖ్యానించడంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని ప్రశ్నించని జగన్‌.. ‘హోదా’ను వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్‌తో కలిసి హోదా సాధిస్తారట అని ఎద్దేవా చేశారు. జగన్ తన పాదయాత్ర ముగింపు సభలో ప్రత్యేక హోదా గురించి ఎందుకు ప్రస్తావించ లేదని ప్రశ్నించిన బాబు.. ప్రత్యేక హోదాను అడిగితే మోడీకి కోపం వస్తుందనే జగన్ సైలెంట్ అయ్యారని ఆరోపించారు. మూడేళ్లు మంచిగా కన్పించిన ఏపీ ఇప్పుడు చెడ్డది ఎలా అయిందన్నారు.
మోడీ నాపై అవినీతిపరులను రేసు కుక్కల్లా ఉసిగొల్పారని చంద్ర‌బాబు మండిప‌డ్డారు. డెమొక్రసీ కంపల్షన్.. సెక్యులర్ కంపల్షనుతో పార్టీలు ఏకం అయ్యే అవకాశం ఉందన్నారు. అన్ని పార్టీలను ఏకం చేస్తున్నాననే నాపై మోడీకి కోపం అని చంద్రబాబు అన్నారు. మాయవతి, అఖిలేష్ జాతీయ స్థాయిలో కలిసి రావడానికి సిద్దంగా ఉన్నారని అమరావతిలో పేర్కొన్నారు. ఈవీఎంలపై చాలా కాలంగా పోరాడుతున్నామని చెప్పారు. బీజేపీ నేతలు ఏమైనా చేసే సమర్ధులని ఎద్దేవ చేశారు. ఎన్నికల ముందున్నాయి కాబట్టే ఈబీసీ రిజర్వేషన్లు అని వెల్లడించారు. కాపు, ముస్లిం రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం ఎలా లాక్కొంటుందని నిలదీశారు. ఎన్ఐఏను విమర్శించిన మోడీ… ఇప్పుడు ఈ విధంగా చేయడం వెనుకున్న ఆంతర్యమేంటీ అని ప్రశ్నించారు.
జ‌గన్ పాదయాత్ర చేసి హైదరాబాద్ వెళ్లారే తప్ప.. అమరావతికి రాలేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. సీబీఐ కోర్టు వస్తేనైనా అమరావతికి వైసీపీ అధినేత జగన్ వస్తారేమోనని ఎద్దేవా చేశారు. ఏపీ గురించి లేనిపోని ప్రేమ ఒలకపోసేవారు అమరావతికి చుట్టపు చూపుగా వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి జగన్ ఇక అమరావతికి వస్తారని బాబు అన్నారు. తన కుటుంబ సభ్యులు తనను హైదరాబాద్‌కు రమ్మన్నా వెళ్లడం లేదని.. అమరావతిలోనే ఉంటానని చెప్పానని తెలిపారు.  రాజధానిని మార్చేస్తామంటూ కొందరు ఏదేదో చెబుతున్నారన్న బాబు.. ప్రజలు బాగుపడితే వైసీపీకి నచ్చదని అన్నారు. కేంద్రానికి.. రాష్ట్రానికి పరిధులుంటాయని ఆయన అన్నారు. ఎన్‌ఐఏ జోక్యం చేసుకోవడం  ఏపీకి మాత్రమే సంబంధించిన అంశం కాదని.. అన్ని రాష్ట్రాలకూ సంబంధించిన వ్యవహారం అని అన్నారు. జాతీయ స్థాయిలో దీనిపై చర్చ పెడతామన్న బాబు.. రాష్ట్రంలో జరిగిన ఘటనపై పోలీసు కేసు పెట్టడానికే నిరాకరించిన జగన్‌కు కేంద్రం షెల్టర్ ఇస్తోందన్నారు. ఏపీలో జరిగిన ఘటనలపై ఇక్కడ కేసులు పెట్టకుండా.. పాకిస్తాన్‌లో పెడతారా..? బాబు ప్రశ్నించారు. ట్రిపుల్ తలాఖ్.. రాఫెల్.. సీబీఐ ఎపిసోడ్ వంటి అంశాలపైనా జగన్‌ స్పందించలేదని ఆయన గుర్తు చేశారు. జగన్ పై దాడి కేసును ఎన్ఐఏకు అప్పగిండంపై కోర్టులో పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. అధికారం లేకుండా కేంద్రంలోని పెద్దలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని బాబు మండిపడ్డారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.