మోడీకి చంద్రబాబు దెబ్బ పడిందా…?

దేశంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర కామెంట్లు చేశారు. ప్రదాని మోడీ ప్రతిష్ట దెబ్బతింటోందని సిఎం అన్నారట. మంత్రివర్గ సమావేశంలోను ఈ అంశం ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీనే ముందుగా బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడింది. ఇప్పుడు బీహారులో నితీష్ కుమార్ కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సిట్టింగ్ స్థానాలు కోల్పోవడం మోడీపై ప్రజలలో ఆదరణ తగ్గింది అనేందుకు నిదర్శనం. మొత్తంగా మోడీ పతనానికి మనమే పునాది వేశామని చంద్రబాబు అన్నారనే ప్రచారం జరుగుతోంది. మహానాడు బాగా జరిగిందని..మన వాణి బాగా వినిపించామనే ఆనందంలో ఉన్నారు టీడీపీ నేతలు. వైకాపా, జనసేన, బీజేపీ మిగతా పార్టీలు ఏకమైనా టీడీపీని ఏం చేయలేరనే ఆలోచనలో ఉన్నారు టీడీపీ నేతలు. మరోవైపు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అంశాన్ని టీడీపీ సీరియస్ గానే పరిశీలిస్తోంది.

రఘవీరారెడ్డి వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ టీడీపీ. అలాంటి పార్టీ తమతో కలిసిపోతే ఇబ్బందిలేదని చెబుతున్నారు రఘవీరారెడ్డి. హైకమాండ్ నుంచి వచ్చిన సంకేతాలే ఇందుకు కారణమంటున్నారు. మొత్తంగా రాహుల్ గాంధీ, సోనియాగాంధీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కర్నాటకలో బీజేపీ అధికారంలోకి రాకుండా నివారించడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. అదే సంగతిని ప్రస్తావించారు చంద్రబాబు.

ఏపీకి హోదా విషయంలో, నిధులు ఇచ్చే అంశంలో బీజేపీ వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. అందుకే బీజేపీకి…ముఖ్యంగా మోడీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా బాబు మాట్లాడుతున్నారు. ఆ సంగతి ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రచారం జరుపుకుంటోందని చంద్రబాబు అంటున్నారు. గుజరాత్ లోని డొలేరో కు లక్ష కోట్ల రూపాయలను పంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైందని ఆరోపించారు చంద్రబాబు. వాస్తవంగా అక్కడకు తరలించింది 3 వేల కోట్ల లోపే అని నిర్థారణ అయింది. అదీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే కొంత మంజూరు చేసిన అంశాన్ని బయట పెట్టింది బీజేపీ. చంద్రబాబు పేరు చెబితేనే ఇప్పుడు బీజేపీ వెన్నులో వణుకుపుడుతుందంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.