చంద్రబాబు కౌంటర్స్‌కి కేసీఆర్ దిమ్మతిరిగిందేమో!

ఢిల్లీ నుంచి వచ్చిన కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే.. ఏదన్నా చెబుతాడేమో! లేక ఊహించని ప్రకటన చేస్తాడేమో అని నమ్మారు ఆయనకు ఓటేసిన ప్రజలు. కానీ ఊహించని రీతిలో నోటికేదొస్తే అది మాట్లాడి ప్రజలకు ఆశ్చర్యచకితులను చేశారు గులాబీ బాస్. ఆయానికిలా మాట్లాడటం అలవాటే అయినా రెండోసారి ముఖ్యమంత్రి పీఠమెక్కాకనైనా మారతాడేమోనని అనుకున్నారంతా. కానీ తీరా చూస్తే మళ్ళీ పాత తంతే. మీడియా ముందు చంద్రబాబును అనరాని మాటలంటూ తనకు విజ్ఞత లేదని తానే నిరూపించుకున్నారు కెసీఆర్.

ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాల్సిన ఒక్క మాటకూడా ఆయన మాట్లాడలేదు. తన మాటలతో ముఖ్యమంత్రి సీటుకున్న విలువే తీసేశారు. ఆయన మాట్లాడిన మాటల్లో రాష్ట్రాన్ని పాలించే వ్యక్తికి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా కనిపించలేదంటే అతిశయోక్తి కాదేమో! ఏదో మత్తులో చంద్రబాబుపై ఇష్టారీతిలో విరుచుకు పడితే ఆయనూరుకుంటారా చెప్పండి. వెంటనే ఈ రోజు కేసీఆర్‌కు రిటర్న్ కౌంటర్లు వేశారు బాబు. అదీ ఓ పద్ధతి ప్రకారంగా మాట్లాడి.. కేసీఆర్‌లా చెత్త పదాలు, చెత్త భాష అస్సలు వాడకుండా.

చంద్రబాబు మాటలను కేసీఆర్ మాటలతో పోల్చిచూస్తే.. కేసీఆర్ సిగ్గుతో తల దించుకోవాల్సిందే. తెలంగాణ సీఎం కేసీఆర్ తనపై ప్రయోగించిన భాషను చంద్రబాబు ఖండిస్తూ.. మీరు నోరుందని పారేసుకుంటే తాము కూడా అలా నోరు పారేసుకోవటం హుందాతనం అనిపించుకోదన్నారు. సీఎం సీటులో ఉన్న వ్యక్తికి కొన్ని విలువలుంటాయని, అధికారంలో ఉండే వ్యక్తులు హుందాగా మాట్లాడాలన్నారు. ఆయనలా అసభ్యంగా మాట్లాడరాదని విమర్శించారు బాబు. 

కేసీఆర్ వచ్చింది టీడీపీ నుంచి కాదా?  టీడీపీ నుంచి కాదా రాజకీయ జీవితం ఇవ్వలేదా? లేకుంటే ఆయన ఎక్కడ నుంచి ఊడిపడ్డారంటూ కేసీఆర్‌ని పద్దతిగా కడిగిపారేశారు చంద్రబాబు. ఉద్యమం ప్రారంభించి కాంగ్రెస్‌తో జట్టుకట్టారు. 2009లో సీట్లు ఇవ్వనంటే పరిగెడుతూ వచ్చి ఎన్ని సీట్లంటే అన్ని సీట్లు తీసుకున్నారు, తెలంగాణ ఇస్తే.. కాంగ్రెస్‌లో కలిపేస్తా అన్న కేసీఆర్ ఆ తర్వాత ఏం చేశారు? అప్పుడేమో జన్మభూమి గురించి ఊరూరూ పోయి.. భట్రాజులా పొగిడి ఇప్పుడేం మాట్లాడుతున్నారు? ఇడియట్స్ అంటూ పద్ధతి లేకుండా నోరు జారుతున్నారంటూ కేసీఆర్ గత చరిత్రను చాలా పద్దతిగా కళ్లముందుంచారు బాబు. దీంతో.. తనను నోటికొచ్చినట్లు తిట్టినా పల్లెత్తు మాటనకుండానే కేసీఆర్ దిమ్మతిరిగేలా  చంద్రబాబు విమర్శలు గుప్పించటం ఆయనలోకి రాజకీయ నేర్పరికి మచ్చుతునక అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజమే కదా! చంద్రబాబుకున్న ఓపిక, ముందుచూపు, మార్గదర్శకత, సానుభూతి తనం అందరిలో ఉంటాయా చెప్పండి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.