ఇలా ధైర్యం చేయాలంటే చంద్రబాబు తర్వాతే ఎవరైనా..!

ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది.. ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి.. మరోవైపు పార్టీని బలోపేతం చేయాలి.. ఒకే నిర్ణయంతో రెండూ సాధ్యమవుతాయా..? అంటే అవుతాయి. కాకపోతే ఆ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయి వుండాలి. అక్కడ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడే ఉండాలి. తాజాగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తుండగా, టీడీపీ గ్రాఫ్ కూడా ఆమాంతం పెరిగిపోయింది. అదేనండీ.. అన్నిరకాల పింఛన్లు రెట్టింపు, ఏప్రిల్‌ నుంచి వైద్యానికి 5 లక్షలు, పాడి పశువుకు 30 వేల బీమా, డ్వాక్రా మహిళలకు మరో 10వేలు, ఆటోలు, ట్రాక్టర్లపై పన్నులన్నీ రద్దు, ఇంటింటికీ స్మార్ట్‌ ఫోన్‌ పంపిణీ వంటి కొత్త పథకాలు ప్రకటించి ఏపీ ప్రజల మనసు దోచేశారు ఏపీ ముఖ్యమంత్రి. దీంతో ఇప్పటి వరకు టీడీపీని వ్యతిరేకించిన వారు కూడా సైకిల్ పార్టీకి జై అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకే ఓటు వేస్తామంటున్నారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రతిపక్ష పార్టీలకు ఫ్యూజులు ఎగిరిపోయాయి అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో అసలు చంద్రబాబులా ఎవరైనా ఇలా ధైర్యం చేయగలరా.? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాలు స్వప్రయోజనం కోసమే అయినా.. దీని వల్ల ఎంత మంది ప్రజలకు లబ్ధి చేకూరుతుంది అనేది కూడా ముఖ్యమైనదే. ప్రస్తుతం రాష్ట్రంలో పింఛను తీసుకునే వారు దాదాపు 54 లక్షల మంది. గతంలో రూ.200 ఉన్న వృద్ధాప్య పింఛనును ఒకేసారి వెయ్యి చేసిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు దానిని ఏ కంగా రూ.2వేలకు పెంచారు. అలాగే ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులకు ఇస్తున్న రూ.1500ని రూ.3వేలకు పెంచారు. కిడ్నీ రోగులకు ఇస్తున్న రూ.2500ను 3500కు పెంచారు. దీని ద్వారా ఆయా లబ్దిదారులకు పెద్ద కొడుకుగా నిలిచారు. దీనితో పాటు రాష్ట్రంలో ఉన్న పాడి పరిశ్రమలకు చేదోడు వాడోదుగా నిలిచేందుకు పాడి పశువుకు 30 వేల బీమా కూడా అందించనున్నారు. అలాగే ఏప్రిల్‌ నుంచి వైద్యానికి 5 లక్షలు ఇవ్వాలనే ఆలోచనకు మంచి మార్కులు పడుతున్నాయి. ఎంతో మంది సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో చంద్రబాబు ఆలోచన చాలా మందికి ప్రాణదానం చేస్తుంది. అలాగే డ్వాక్రా మహిళలకు మరో రూ. 10 వేలు, ఇంటింటికీ ఫోన్ కూడా ఆయనకు ప్లస్ అవబోతున్నాయి. వీటి వల్ల ఖజానాకు భారం పడినా ప్రజల సంక్షేమం ముఖ్యమైనదని టీడీపీ వాళ్లు అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.