చంద్రబాబునే సీనియర్ మోస్టు రాజకీయ నాయకుడా….?

దేశంలో అందరికంటే తాను సీనియర్ రాజకీయ నాయకుడిని అని ఇటీవల కాలంలో ఏపీ సిఎం చంద్రబాబునాయుడు తరచుగా చెప్పే మాట. హస్తినలో రెండు రోజులు మాట్లాడినా అదే మాట చెప్పారాయన. ఈ సంగతి తెలిసిన ఓ ఔత్సాహికుడు సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. దాన్ని యధాతథంగా ఇస్తోంది నమస్తే ఆంధ్రా
చంద్రబాబు పుట్టింది –  1950, వయసు – 68, రాజకీయ అనుభవం – 40 ఏళ్ళు  
బాబు సీనియర్, అందులో అనుమానం లేదు.. “నేనే సీనియర్” అనడం వేరు, “సీనియర్స్ లో నేనూ ఒకడ్ని” అనడం వేరు.. 
అసలు ఇలా ఎందుకు చెప్పుకుంటున్నారు? చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది?
ఇలా మాటి మాటికీ నేనే సీనియర్ ని అని చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందా అనేది ఆసక్తికరం.  
దేశంలో సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు – నిజాలు
ముఖ్యమంత్రులు 
జ్యోతిబసు – పశ్చిమ బెంగాల్ – 23 ఏళ్ళు 4 నెలలు
పవన్ కుమార్ – సిక్కిం – 23 ఏళ్ళు 3 నెలలు* (28 April 2018 న జ్యోతిబసు ని దాటేస్తారు)
గగోంగ్ అపాంగ్ – 22 ఏళ్ళు 8 నెలలు 
లాల్ తణ్హావాలా – మిజోరాం – 21 ఏళ్ళు 5 నెలలు 
వీరభద్ర సింగ్ – హిమాచల్ ప్రదేశ్ – 21 ఏళ్ళు 
మాణిక్ సర్కార్ – త్రిపుర – 19 ఏళ్ళు 11 నెలలు 
ప్రకాష్ సింగ్ బాదల్ – పంజాబ్ – 18 ఏళ్ళు 11 నెలలు  
కరుణానిధి – తమిళనాడు – 18 ఏళ్ళు 9 నెలలు 
యస్వంత్ సింగ్ పర్మార్ – హిమాచల్ ప్రదేశ్ – 18 ఏళ్ళు 3 నెలలు
నవీన్ పట్నాయక్ – ఒడిశా – 18 ఏళ్ళు 1 నెల*
మోహన్లాల్ సుఖాడియా – రాజస్థాన్ – 17 ఏళ్ళు 6 నెలలు 
సేనయంగ్బా చుబాతోషి జమీర్ – నాగాలాండ్ – 15 ఏళ్ళు 5 నెలలు
షీలా దీక్షిత్ – ఢిల్లీ – 15 ఏళ్ళు 1 నెల 
తరుణ్ గొగోయ్ – అస్సాం – 15 ఏళ్ళు
చంద్రబాబు నాయుడు – దాదాపు 13 ఏళ్ళు*
లోక్ సభ ఎంపీలు 
ఇంద్రజిత్ గుప్త (సిపిఐ)- పశ్చిమ బంగా – 11 సార్లు – 1960 -2001 వరకూ (77-80 వరకూ తప్ప)
వాజపేయి(బీజేపీ), సోమనాథ్ ఛటర్జీ(సిపిఎం), పీఎం సయీద్ (కాంగ్రెస్) – 10 సార్లు 
గిరిధర్ గమాంగ్,ఖగాపతి ప్రధాని, మాధవరావు సింధియా, కమల్ నాథ్* (కాంగ్రెస్) జార్జ్ ఫెర్నాండేజ్(జనతాదళ్), – 9 సార్లు 
సుమిత్ర మహాజన్ (బీజేపీ) – 8 సార్లు
ఎమ్మెల్యే లు 
కరుణానిధి – తమిళనాడు – 13 సార్లు – 1957 నుంచి – 60 ఏళ్ళుగా ఎమ్మెల్యే 
Late. Hoping స్టోన్ లింగ్డో – 11 సార్లు ఎమ్మెల్యే (1 సారి ఎంపీ) – 1957 నుంచి 
గణపతి రావు దేశముఖ్ – 11 సార్లు – 54 ఏళ్లుగా ఎమ్మెల్యే  
కే ఎం మణి – కేరళ – 10 సార్లు – 50 ఏళ్లుగా ఎమ్మెల్యే 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.