వేద‌న‌లో చంద్ర‌బాబు !

రాష్ట్ర విభ‌జ‌న‌, కేంద్ర ప్ర‌భుత్వం చేసిన అన్యాయం వ‌ల్ల ఎంతో వెనుక‌ప‌డిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను నిరంత‌ర శ్రామికుడిలా మారి త‌న శ‌క్తి మేర ముందుకు న‌డిపిస్తున్న చంద్ర‌బాబు తీవ్ర వేద‌న‌లో ప‌డిపోయారు. చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌టం అంటే ఒక భ‌రోసా. ముఖ్యంగా వాణిజ్య రంగాన్ని ప‌రుగులు పెట్టించే బాబు అతి క్లిష్ట స‌మ‌యంలో ఆర్థిక లోటు భ‌యంక‌రంగా ఉన్న స‌మ‌యంలో ప‌గ్గాలు చేప‌ట్టారు. నిజానికి అధికారం రావ‌డం చాలామందికి అదృష్టంగా క‌నిపించినా చంద్ర‌బాబుకు కాదు… అంత లోటు ఉన్న రాష్ట్ర ప్ర‌భుత్వం న‌డ‌ప‌డం కంటే ప్ర‌తిప‌క్షంలో కూర్చోవ‌డ‌మే సుఖం. కానీ బాబు ఏనాడూ వెర‌వ‌డు. అభివృద్ధి చంద్ర‌బాబుకు ఒక అల‌వాటు.
ప్ర‌కృతి హుదూద్ పేరిట సృష్టించిన ప్ర‌కోపాన్ని కూడా అధిగ‌మించి విశాఖ‌ప‌ట్నం మ‌రింత సుంద‌రంగా మార్చిన చంద్ర‌బాబుకు ఆ ప్రాంతంలో మావోయిస్టులు ఒక శాస‌న‌స‌భ్యున్ని కిరాత‌కంగా హ‌త్య చేయ‌డం తీవ్రంగా క‌ల‌చివేసింది. రెట్టింపు ఉత్సాహంతో రాష్ట్రానికి మ‌రిన్ని కంపెనీలు తేవ‌డం కోసం అమెరికాకు బ‌య‌లుదేరిన చంద్ర‌బాబుకు అక్క‌డ దిగ‌క ముందే షాక్ లాంటి వార్త తెలిసింది. దుబాయ నుంచి న్యూయార్క్ ఫ్లైట్లో బ‌య‌లుదేరిన వెంట‌నే ఆయ‌న‌కు ఈ వార్త అందడంతో ఆయ‌న‌లో క‌న్నీళ్లు తిరిగాయ‌ని ఆయ‌న‌తో పాటు ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఒక ప్ర‌ముఖ అధికారి తెలిపారు. కేంద్రం నుంచి ప్ర‌తిప‌క్షాల నుంచి ఏ స‌హ‌కారం లేక‌పోయినా ఏదో విధంగా ముందుకు దూసుకెళ్తున్న ఏపీ… బాబు అమెరికా టూరుతో మ‌రిన్ని కంపెనీల‌ను సొంతంగా ద‌క్కించుకుంటుంద‌నుకుంటని పెట్టుకున్న ఆయ‌న అభిమానులు, ఏపీ ప్ర‌జ‌ల ఆశ‌లు చ‌ల్ల‌బ‌డ్డాయి.

ఈ ఘ‌ట‌న‌తో చంద్ర‌బాబు త‌న ప‌ర్య‌ట‌న‌ను కుదించుకుని ముందుగా ఇండియాకు తిరిగి రానున్న‌ట్లు తెలుస్తోంది. దీనివ‌ల్ల‌ ప‌ర్య‌ట‌న ఉద్దేశం పూర్తి స్థాయిలో నెర‌వేరే అవ‌కాశం లేక‌పోవ‌చ్చు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.