చంద్రబాబు అఖిల పక్ష డ్రామా

ప్రత్యేక హోదా విషయమై అఖిలపక్ష సమావేశం జరపాలని అనేక పార్టీలు కోరాయి. ఏనాడు దాని సంగతి పట్టించుకోని ఏపీ ప్రభుత్వం అఖిల సమావేశం పెట్టింది. రాష్ట్రంలోని ఒక్కో రాజకీయ పార్టీ, సంఘం నుంచి ఇద్దరు ప్రతినిధులు చొప్పున ఈ సమావేశానికి రావాలని ఆహ్వానించారు. వారే కాదు.. ప్రజా సంఘాలను పిలిచారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన పోరాటానికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్లమెంట్‌లో అవిశ్వాసంపై చర్చ జరిగేటప్పుడే మరోవైపు అఖిల పక్ష సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలూ ఏకతాటిపై ఉన్నాయనే సంకేతాలు పంపేందుకే ఈ పని చేస్తున్నారు చంద్రబాబు. ఇన్నాళ్లు చిత్తశుద్ది లేకుండా అన్ని పార్టీలు ఏక కంఠంతో అఖిల పక్షం ఏర్పాటు చేయాలని కోరినా పట్టించుకోలేదు చంద్రబాబు. 
బాబును నమ్మలేం… వైకాపా
అంతా అయిపోయాక ఇప్పుడు అఖిల పక్షం అంటూ చంద్రబాబు కొత్త డ్రామాకు తెరదీశారు. ఫలితంగా చాలా పార్టీలు చంద్రబాబును నమ్మడం లేదు. అఖిలపక్ష సమావేశం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త కుట్రకు తెరలేపారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. చంద్రబాబు నైతికత లేని ముఖ్యమంత్రి అని, ఆయన మాటలను నమ్మలేమని ఆ పార్టీ దూరంగా ఉంది. తాము ఇప్పటికే ఒక స్పష్టమైన వైఖరితో ముందుకు వెళుతున్నాం. ప్రత్యేక హోదాపై ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు మాట మార్చిన వైనాన్ని వారు గుర్తు చేశారు. తమ ఎమ్.పీలతో పాటు టీడీపీ ఎమ్.పీలు కూడా రాజీనామా చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.
దూరంగా జనసేన
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి జనసేన పార్టీ దూరంగా ఉంది. అఖిలపక్ష సమావేశం పెట్టినా ఉపయోగం లేదని చెప్పిందా పార్టీ. హోదాపై చంద్రబాబు మాటలకు, చేతలకు పొంతన లేదని జనసేన అభిప్రాయపడింది. అందుకే ఆ సమావేశానికి తాము వెళ్లలేమని చెప్పింది. హోదాపై ప్రభుత్వం సరిగా వ్యవహరించని కారణంగా సమావేశానికి వెళ్ళటం లేదని జనసేన పేర్కొంది.
రాష్ట్రంలో చాలా సంఘటనలు జరిగినా అఖిల పక్షం వేయని చంద్రబాబు ఇప్పుడు మరో డ్రామాకు తెరలేపారని కమ్యూనిస్టులు అంటున్నారు.  
 

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.