చేతనైంది చేసుకోండి.. ఏపీకి అడ్డొస్తే…

స్వరం పెంచారు చంద్రబాబు. మరింత దూకుడుగా వెళుతున్నారు. ఇక మీకు చేతనైంది చేసుకోపోండనే తీరులో వ్యవహరిస్తున్నారు. ఫలితంగా బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జాతీయ స్థాయిలో విపక్షాలన్నింటినీ ఏకం చేసే పని చేస్తున్నారు బాబు. ఫలితంగా ఏం జరగబోతుందనే చర్చ సాగుతోంది. అందుకే హోదా ఇవ్వనందుకు నిరసనగా, ఏపీకి అన్యాయానికి వ్యతిరేకంగా ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకు భయపడుతోంది బీజేపీ. దాన్ని వరుసగా వాయిదా వేస్తు వస్తోంది. ఇవాళ అదే పని చేసింది. 
మరోవైపు పోలవరం, పీఎంవో వ్యవహారాలపై ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో వాడీవేడి చర్చ జరిగింది.  పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని బీజేపీ చెబుతోంది. దీనిపై సీఎం చంద్రబాబు ఘాటుగానే స్పందించారు. పురావాసంపై జనసేన అధినేత పవన్‌ ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే భాజపా ఎందుకు తప్పుపట్టలేదని అడిగారు. పోలవరంపై కుట్ర జరుగుతోంది. పీఎంవో చుట్టూ తిరిగే విజయసాయి రెడ్డి తనను బోనులో పెట్టిస్తానంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంపీలు పీఎంను కలవొచ్చు. ఇందులో తప్పు లేదని బీజేపీ నేత అభ్యంతరం చెప్పారు. కానీ చంద్రబాబు ఆగలేదు. అవినీతిపరులకు ప్రధాని కార్యాలయం గస్తీ కాస్తుందా? అని చంద్రబాబు మండిపడ్డారు. అవినీతిపరులతో పీఎంవోలో కాపురం పెట్టుకున్నా తమకేం నష్టంలేదన్నారు. 
అవినీతి కేసుల్లో ఉన్న వ్యక్తి సీబీఐ మాజీ డైరెక్టర్‌ను కలిస్తే కేసులు పెట్టారనే విషయాన్ని సీఎం ప్రస్తావించారు. తాను, తన కుటుంబం ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు బాబు. పవ koన్ కల్యాణ్ నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. ప్రత్యేక హోదా, పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఐదు కోట్ల మంది ఆంధ్రప్రజలే తనకు హైకమాండ్‌ అని ముఖ్యమంత్రి అన్నారు. ఇచ్చేవాడికి తీసుకునేవాడు లోకువ అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రజల డిమాండ్ ను పట్టించుకోక పోతే పోరాటం ఉధృతమవుతుందని హెచ్చరించారు. 
ఏపీ వ్యాప్తంగా హోదా నిరసన జ్వాలలు మిన్నంటాయి. ప్రధాన రహదారులన్నీ బోసిపోయాయి. ఎక్కడవక్కడే వాహనాలు ఆగాయి. ఇదే స్ఫూర్తి ఇక ముందు ప్రదర్శిస్తే కేంద్రం దిగిరాక తప్పదు. 

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.