చంద్రబాబు దెబ్బతో బీజేపీలో కల్లోలం

ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దెబ్బకు బీజేపీలో కల్లోలం మొదలైంది. ఏపీకి విభజన నిధులు ఇవ్వడం లేదు. హోదా ఇవ్వడం లేదు. అంతా గుజరాత్ కు తలరిస్తున్నారని మహానాడు వేదికగా ఆరోపించారు చంద్రబాబు. దీనికి బీజేపీనేతలు ఖండనల మీద ఖండనలు ఇస్తున్నారు. గుజరాత్ లోని దొలేరా నగరాన్ని కేంద్రం నిర్మిస్తోందని చంద్రబాబు చెప్పారు. అందుకు 98 వేల కోట్ల రూపాయల వ్యయం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం డబ్బు అంతా గుజరాత్ కు తీసుకు వెళుతున్నారని చంద్రబాబు చేసిన వాదన. దీన్ని ఆ పార్టీ ఎంపీ జివిఎల్ నరసింహారావు ఖండించారు. చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారన్నారు. అంతే కాదు…గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని పేరుతో ప్రధానమైన తెలుగు పత్రికలలో పెద్ద ప్రచార ప్రకటన విడుదల చేశారు. అసలు ధొలేరా పారిశ్రామిక పెట్టుబడి అభివృద్ధి ప్రాంత ఆవిష్కరణ పేరుతో ప్రకటనలు వచ్చాయి.

తెలుగు వారికి ఎవరికీ తెలయని ఈ ప్రాజెక్టు వివరాలను గుజరాత్ ప్రభుత్వం అందరికీ చెప్పింది. కేంద్రం కేవలం మూడువేల కోట్లే ఇస్తోందని, ఇప్పటికి 1293 కోట్లే ఇచ్చిన సంగతి తెలిపింది. అంతేకాదు…కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాజెక్టు వచ్చిన విషయం ప్రస్తావించింది. ఫలితంగా గుజరాత్ మీడియాకే కాదు..తెలుగు రాష్ట్రాల మీడియాకు బాగానే గిట్టుబాటు అయింది. చంద్రబాబు అంత పెద్ద ఎత్తున ప్రచారం చేయకపోతే ఇలాంటి ఖండనలు వచ్చేవి కాదు. హోదా విషయంలో ఏం చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది బీజేపీ. ఇలాంటి సమయంలో గుజరాత్ దెబ్బ అన్ని రకాలుగా ఇబ్బందేనని చెప్పాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.