చంద్రులిద్ద‌రూ క‌లుస్తామ‌నే సందేశ‌మా!

కేసీఆర్‌.. చంద్ర‌బాబునాయుడు ఇద్ద‌రి మ‌ధ్య పచ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది. మ‌రీ ఎక్కువ చెప్పాలంటే.. నిప్పు ఉప్పుల్లా చిట‌ప‌ట‌లాడుతుంటారు. ఇద్ద‌రూ స‌మ‌కాలికులు.. ఒకేగూటి ప‌క్షులే అయినా.. రాజ‌కీయం.. అధికారం.. ఇద్ద‌రి మ‌ధ్య దూరాన్ని పెంచింది. 2009లో మ‌హాకూట‌మితో క‌ల‌సి బ‌రిలోకి దిగినా.. ఓట‌మి చ‌విచూడ‌టంతో మ‌ళ్లీ దూరం పెరిగింది. ఆ త‌రువాత‌.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో చంద్రులిద్ద‌రూ శ‌త్రువులుగా మారారు. ఓటుకు నోటు కేసులో త‌లెత్తిన వివాదం కేసుల వ‌ర‌కూ చేరింది. ఇద్ద‌రినీ బ‌ద్ధ శ‌త్రువులుగా మార్చేసింది. కేంద్రంలో వున్న ఎన్‌డీఏతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే.. కేసీఆర్ కూడా స్నేహంగానే మెలిగాడు.
వీలు చిక్కిన‌ప్పుడల్లా మోదీపై ప్ర‌శంస‌లు కురిపిస్తూ.. నేత‌ను ఖుషీ చేస్తూ వ‌చ్చారు. కానీ.. ఎంతైనా రాజ‌కీయాలు క‌దా.. మోదీతో ఇద్ద‌రు సీఎంలు ఒకేసారి వైరం పెంచుకున్నారు. అది క్ర‌మంగా బీజేపీ అంటే.. ఆమ‌డ‌దూరం జ‌రిగేంత వ‌ర‌కూ చేరింది. ఒక బ‌ల‌మైన శ‌త్రువును ఎదుర్కోవాలంటే.. బ‌లం కావాలి. దానికి మూడో కూట‌మి అనే రాజ‌కీయశ‌క్తిని తానే వ్యూహ‌క‌ర్త‌గా ఉంటానంటూ కేసీఆర్ ప్ర‌క‌టించారు. అంతేనా. బెంగాల్‌, ఒడిష్సా, తాజాగా త‌మిళ‌నాడు ప‌ర్య‌టించారు. డీఎంకే అధినేత క‌రుణానిధిని క‌లిశారు. రైతుబంధు ప‌థ‌కానికి తెలంగాణ రావాల్సిందిగా ఆహ్వానం ప‌లుకుతూ.. మూడో కూట‌మిపై చ‌ర్చించారు. డీఎంకే కూడా బీజేపీ వ్య‌తిరేక పార్టీ కావ‌టంతో..
మ‌నం..మ‌నం బాయి బాయి అన్న‌ట్లుగా చ‌క్రం తిప్పారు. ప‌నిలో ప‌నిగా.. ఏపీ సీఎం ను కూడా గుర్తుచేశారు. చంద్ర‌బాబునాయుడు త‌న‌కు మంచిమిత్రుడ‌నే విష‌యాన్ని క‌రుణానిధి వ‌ద్ద ప్ర‌స్తావించారు. మూడో కూట‌మి ఏర్పాటులో అవ‌స‌ర‌మైతే బాబుతో కూడా మాట్లాడాత‌నంటూ స్ప‌ష్టంచేశారు. అదే జ‌రిగి… ఇద్ద‌రు చంద్రులు క‌లిస్తే.. కొత్త రాజ‌కీయాల‌కు తెర‌లేపిన‌ట్లే. ఎందుకంటే.. 2009 నాటి ప‌రిస్థితులు ఇప్పుడు లేవు. పైగా.. కాంగ్రెస్ పార్టీ కూడా టీడీపీతో వైరాన్ని కోరుకోవ‌ట్లేదు. అవ‌స‌ర‌మైతే దోస్తీ చేయాల‌ని ఉబ‌లాట‌ప‌డుతుంది. ఇటువంటి స‌మ‌యంలో కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా బాబును స్నేహితుడు అంటూ పొగ‌డ‌టం వెనుక మ‌రో విష‌యం కూడా దాగుంది. తెలంగాణ‌లో టీడీపీ, కాంగ్రెస్ క‌లిసి బ‌రిలోకి దిగే అవ‌కాశాలున్నాయంటూ ఇటీవ‌ల రేవంత్‌రెడ్డి ప్ర‌క‌టించారు. టీడీపీలో ఉన్న కొంద‌రు సీనియ‌ర్లు కూడా ఇదే విష‌యాన్ని బాబు ద్రుష్టికి తీసుకెళ్లారు. దీనిపై బాబు పెద‌వి విప్ప‌క‌పోయినా..
అవ‌స‌రాన్ని బ‌ట్టి పొత్తు ఉంటుంద‌నే సంకేతాలు మాత్రం బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అదే జ‌రిగితే.. తెలంగాణ‌లో టీఆర్ ఎస్ పార్టీకు ఊహించ‌ని ఎదురుదెబ్బ త‌గిలే అవ‌కాశం ఉంది. అందుకే.. ముంద‌స్తుగా కేసీఆర్ చంద్ర‌బాబుతో  స్నేహంగా ఉండ‌టం వ‌ల్ల ఇటు రాష్ట్రంలో.. అటు కేంద్రంలోనూ త‌న‌కు బ‌లం పెరుగుతుంద‌ని భావించ‌వ‌చ్చు. అందుకే.. స‌రైన స‌మ‌యంలో బాబుతో చెల‌మి గురించి ప్ర‌స్తావించారు. ఇద్ద‌రికీ కామ‌న్ శ‌త్రువు రాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్‌, కేంద్రంలో మోదీ కావ‌టంతో.. చంద్రుల మ‌ధ్య స్నేహం మ‌ళ్లీ చిగురిస్తుంద‌నేది విశ్లేష‌కుల అంచ‌నా. 

1 Comment

  1. The way he supported Geva Gowda in Karnataka elections, who has no chance of coming to power independently does not inspire confidence. CBN’s only agenda is defeat of BJP, which failed to implement promises made in act and parliament. CBN’s only agenda is development of A.P and he has no proclaimed National ambitions unlike KCR.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.