ఆంధ్రప్రదేశ్ కు షాక్ ఇచ్చిన కేంద్రం

         ఆంధ్రప్రదేశ్ ను బీజీపీ ప్రభుత్వం అణగతొక్కే పని చేస్తోందనే విమర్శలున్నాయి. ఎపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలు, పోలవరం, ప్రత్యేక ప్యాకేజి, వైజాగ్ కు రైల్వే జోన్, కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వంటి విషయాల్లో ఏపీకి అన్యాయం జరుగుతోంది. అంతే కాదు..బడ్జెట్ లోను చిన్న రాష్ట్రాల కంటే హీనంగా చూస్తోంది కేంద్రం. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ తీరును తెలుగు తమ్ముళ్లు తప్పుపడుతున్నారు. మేము నిధులు ఇస్తున్నా..ఏపీ ప్రభుత్వం సరిగా లెక్కలు చెప్పడం లేదని..కొన్ని ఇబ్బందులు వస్తున్నాయనేది మరోవైపు బీజేపీ నేతల కామెంట్లు. విషయం ఏదైనా ఇప్పుడు కేంద్రం మరోసారి ఏపీకి మొండి చేయి చూపింది.  
          కేంద్ర ప్రభుత్వం అహ్మదాబాద్, నాగ్పూర్, లక్నో, చెన్నై ( అదనపు పనులు) పూణే, నోయిడా-గ్రేటర్, నోయిడా, ఢిల్లీల కోసం తొమ్మిది కొత్త మెట్రో ప్రాజెక్టులను మంజూరు చేసింది. 180 కిమీ పొడవు ఉన్న అన్ని మెట్రోలకి, రూ. 49 వేల కోట్ల ఖర్చు అవ్వనుంది. ఈ జాబితాలో విశాఖపట్నం లేదా విజయవాడ నగరాలు ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ ఆరెండు లేవు. మాకు మెట్రో రైలు ప్రాజెక్టులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో అడుగుతోంది. విజయవాడ మెట్రో కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు సి.ఎం చంద్రబాబునాయుడు కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రం ఎప్పుడూ వాటిని తిరస్కరిస్తూ వస్తుంది. కానీ ఇప్పుడు లైట్ మెట్రో మీద అధ్యయనం జరుపుతుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందో లేదో అనే చర్చ సాగుతోంది. 
చిన్న చూపు ఎందుకు…
          రైల్వే యూనివర్సిటీని వైజాగ్ లో ఏర్పాటు చేయాలని చంద్రబాబు అనేక సార్లు అడిగారు. కానీ గుజరాత్ లోని వడోదరకు దాన్ని తరలించారు. విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాలనేది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. కానీ దాన్ని పట్టించుకోవడం లేదు. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో వైజాగ్ ఒకటి. సముద్రపు ఒడ్డున ఉందా నగరం. విదేశీ పర్యాటకులు ఎక్కువగానే వస్తుంటారు. నాగపూర్ కంటే ఎక్కువ జనసాంద్రత కలిగి ఉన్న ప్రాంతం వైజాగ్. కానీ నాగపూర్ కి మెట్రో ని ఇచ్చేసింది కేంద్రం. కానీ ఏపీని పట్టించుకోలేదు. చైన్నైలో మెట్రో రైలు అంతగా సక్సెస్ కాలేదు. కానీ చైన్నైలో మెట్రో రైలు దూరాన్ని పెంచేందుకు నిధులు ఇవ్వనుంది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 9 మెట్రోల్లో, దక్షిణ భారత దేశంలో చెన్నై ఒక్కటే ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం మెట్రో రైలు ప్రాజెక్టులు విజయవాడ, విశాఖపట్నంలకు ఇవ్వాల్సి ఉంది. కానీ బిజెపి ఇందుకు ఎందుకు వ్యతిరేకిస్తోందో అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల నివేదికలను కేంద్రానికి పంపింది. అయినా సరే ఏపీ అంటే అలుసుగా తీసుకుంటోంది కేంద్రం.  
 

1 Comment

  1. BJP need not contest in for things elections, if the railway zone is not sanctioned. Andhra voters r not ready to listen any stories about special package or some other nonsense. Even if there is an alliance with TDP people will show their anger and frustration
    Towards BJPs cunningness and antiandhra attitude.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.