చంద్రబాబు పాలనను మెచ్చుకుంటున్న ప్రముఖులు…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన పై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుంచి తాజాగా మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు వరకు అదే మాట చెప్పారు. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ తిరుపతి వచ్చిన సందర్భంగానే కాదు… అమరావతి రాజధానికి వచ్చినప్పుడు చంద్రబాబు పాలన తీరును మెచ్చుకున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఇబ్బంది ఉండదని చెప్పారు. లెఫ్టనెంట్ గవర్నర్ కిరణ్ బేడీ చంద్రబాబు తీరుకు ముచ్చటపడిపోయారు. మినిమమ్ గవర్నమెంట్ మాగ్జిమమ్ గవర్నెస్ పథకం చాలా బాగుందని కితాబునిచ్చారు. 1100 కాల్ నెంబర్ ద్వారా ఫిర్యాదులు తీసుకోవడం పరిష్కారం చూపడం చాలా బాగుందన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి ఆమె ట్వీట్ చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. 
కేంద్ర మంత్రి ఉమా భారతి, బీహార్ డిప్యూటీ సి.ఎం సుశీల్ మోడీ చంద్రబాబు పాలనను మెచ్చుకున్నారు. కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ఇలానే చంద్రబాబు పాలనకు కితాబునిచ్చిన సంగతి తెలిసిందే. నోబెల్ బహుమతి సాధించే మొట్టమొదటి ఆంధ్రుడికి వందకోట్లరూపాయలు బహుమానంగా ఇస్తామని సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనను హరిత విప్లవానికి నాంది పలికిన ఎంఎస్ స్వామినాథన్ ప్రశంసించారు. పరిశోధనల్లో శాస్త్రవేత్తలను ప్రోత్సహించడానికి చంద్రబాబు ఇచ్చిన ప్రకటన స్ఫూర్తి నింపుతుందన్నారు. 
ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన ఇంత అద్భుతంగా చేయవచ్చనా… అమరావతి రాజధాని శంఖుస్థాపన పై కాలిఫోర్నియా నగర మేయర్ బిల్ హారిజన్ అన్న సంగతి తెలిసిందే. పకృతి విలయాలపై చంద్రబాబు తీసుకుంటున్న చర్యలను తమిళ పత్రికలు ప్రశంసించాయి. ఇండియాలో చంద్రబాబు అనే సీఎం ఉండేవారు. ఆయన ఐటీ రంగాన్ని ఎంతో ప్రోత్సహించి ఎందరో యూత్ కి మంచి లైఫ్ ఇచ్చారని పాకిస్తాన్ మీడియాలో జరిగిన చర్చాగోష్టిలో అక్కడి మేథావులు అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు చైనా ఉప ప్రధానమంత్రి వాంగ్ యింగ్ ప్రశంసలు కురిపించి ఆయన పనితీరును మెచ్చుకున్నారు.
దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక నేత బాలల హక్కుల పరిరక్షణ కోసం రోడ్డు పైకి రావడం ఇదే మొదటిసారని నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి మెచ్చుకున్నారు. భార‌త యాత్ర‌కు తాను సంకల్పించిన‌ప్పుడు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశాన‌ని గుర్తు చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడే మొదట స్పందించారని నోబెల్ శాంతి పుర‌స్కార‌ గ్రహీత కైలాశ్ స‌త్యార్థి గతంలోనే చెప్పారు. 
ఏపీలో పెట్టుబ‌డులు పెట్ట‌ేందుకు ఎంతో మంది ముందుకు వ‌స్తున్నారని ప్రభుత్వం పనితీరు బాగుంటే ఎవరైనా వస్తారన్నారు మరోవైపు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు. బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్న గవర్నర్‌ విద్యాసాగర్‌రావు మరోవైపు చందబ్రాబు తీరును మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ముఖ్యమంత్రి బాగా పనిచేస్తున్నారని కితాబునిచ్చారు. చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు కూడా ఎంతో బాగా పని చేస్తున్నారు అని ప్రస్తావించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని విద్యాసాగర్‌రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారి తీసాయి…

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.