కొత్త‌ది- చంద్ర‌బాబు`30 ఈయ‌ర్స్ విజ‌న్` !

లోటు బ‌డ్జెట్ తో మిగిలిన అవ‌శేషాంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన చంద్ర‌బాబు….త‌న 40 ఏళ్ల సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వంతో కొత్త‌గా ఏర్ప‌డిన రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో ప‌రుగులు పెట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. దేశంలోని మిగ‌తా రాష్ట్రాల‌కు దీటుగా ఏపీని నిలబెట్ట‌డంలో చంద్రబాబు ఎన‌లేని కృషి చేస్తున్నార‌న్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు విదేశీ దిగ్గ‌జ కంపెనీలు ముందుకువ‌స్తున్నాయంటే అందుకు చంద్ర‌బాబు చ‌రిష్మానే కార‌ణం. ఇక హైద‌రాబాద్ త‌ర‌హాలో ఇరుకు రాజ‌ధాని కాకుండా….విశాల‌మైన రాజ‌ధానిని భావిత‌రాల‌కు అందించాల‌నే ఉద్దేశంతో చంద్ర‌బాబు చేప‌ట్టిన భూసేక‌ర‌ణ చ‌రిత్ర‌లో నిలిచిపోతుంది. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుతూనే….గ్రీన్ జోన్ లో ఉండేలా అమ‌రావ‌తి నిర్మాణం చేప‌ట్టేందుకు చంద్ర‌బాబు చూపుతున్న చొర‌వ ప్ర‌శంస‌నీయం. ప‌చ్చ‌ని చెట్ల మ‌ధ్య రాజ‌ధాని ప్ర‌జ‌లు నివ‌సించాల‌ని….త‌ద్వారా రాబోయే రోజుల్లో అధికం కాబోతోన్న గ్లోబ‌ల్ వార్మింగ్ ను త‌ట్టుకోవ‌చ్చ‌ని విజ‌న్ తో ఆలోచించిన నాయ‌కుడు చంద్ర‌బాబు. ఇపుడు అమ‌రావ‌తి త‌ర‌హాలోనే రాష్ట్రం మొత్తాన్ని ప‌చ్చ‌ద‌నంతో నింపాల‌ని చంద్ర‌బాబు ఆకాంక్షిస్తున్నారు. అందుకే, ఇళ్లలో చెట్లు పెంచాల‌నే కాన్సెప్ట్ కు భిన్నంగా…చెట్ల మ‌ధ్య‌లోనే ఇళ్లు నిర్మించాల‌నే బృహ‌త్త‌ర కాన్సెప్ట్ కు చంద్ర‌బాబు తెర‌తీశారు. తిరుప‌తిలో చెట్ల మ‌ధ్య‌లో ఇళ్లు ఉండేలా ప్ర‌జ‌లు చ‌ర్య‌లు తీసుకొని చెట్ల పెంప‌కాన్ని ప్రోత్స‌హించాల‌ని…ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన పుణ్య‌క్షేత్రం తిరుప‌తిని నంద‌న‌వ‌నంలా తీర్చిదిద్దాల‌ని ఉద్దేశ్యంతో తిరుప‌తిలో న‌గ‌ర‌వ‌నం కార్య‌క్ర‌మానికి చంద్ర‌బాబు అంకురార్ప‌ణ చేశారు. శ్రీ‌వారు కొలువైన తిరుప‌తిలో ఈ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు.
ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని కుదిపేస్తోన్న స‌మ‌స్య‌ల్లో గ్లోబ‌ల్ వార్మింగ్ ఒక‌టి. న‌గ‌రీక‌ర‌ణ‌, ఆధునీక‌ర‌ణ‌…వంటి అనేక కార‌ణాల‌తో చెట్ల‌ను, అడవుల‌ను విప‌రీతంగా న‌రికివేయడం….మొక్క‌ల పెంప‌కం త‌గ్గిపోవ‌డం….వాహ‌నాల వాడ‌కం పెర‌గ‌డం…వంటి కార‌ణాల‌తో భూమి వేడెక్కుతోంద‌ని ప‌ర్యావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త‌లు గ‌గ్గోలు పెడుతోన్న సంగ‌తి తెలిసిందే. గ్లోబల్ వార్మింగ్ వల్ల రాబోయే 30 ఏళ్ల‌లో ఎండ‌లు మ‌రింత పెరుగుతాయ‌ని వారు అంచ‌నా వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మొక్క‌ల పెంప‌కం ఆవ‌శ్య‌క‌త‌ను చంద్ర‌బాబు గుర్తించారు. రానున్న 30ఏళ్ల‌లో రాబోయే ఉప‌ద్ర‌వాన్ని ప‌సిగ‌ట్టారు. అందుకే, దానిని ఎదుర్కొనేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక రూపొందించారు. అందులో భాగంగానే ఇళ్ల మ‌ధ్య‌లోనే చెట్లు అనే కాన్సెప్ట్ ను ప్ర‌వేశ‌పెట్టారు. ఇళ్ల ద‌గ్గ‌ర‌, ఇళ్ల‌లో మొక్క‌ల‌పెంప‌కంతోపాటు….చెట్ల మ‌ధ్య‌లో ఇళ్ల‌ను నిర్మించ‌డం ద్వారా….గ్లోబ‌ల్ వార్మింగ్ ముప్పును ఎదుర్కోవ‌చ్చ‌ని చంద్ర‌బాబు విజ‌న్ తో ఆలోచించారు. ముందుచూపుతో ప‌చ్చ‌దనం మ‌ధ్య‌లో అమ‌రావ‌తి నిర్మాణం చేప‌ట్టిన చంద్ర‌బాబు గ్లోబ‌ల్ వార్మింగ్ ను ఎదుర్కొనేందుకు తాజాగా చేప‌ట్టిన న‌గ‌ర‌వనం కార్య‌క్ర‌మం ప‌క్క రాష్ట్రాల‌కు స్ఫూర్తి ప్ర‌దాయకం. అందుకే, ఇక‌పై చంద్ర‌బాబుకు 40 ఈయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ లీడ‌ర్ అనే బిరుదుతో పాటు….30ఈయ‌ర్స్ విజ‌న్ ఉన్ననాయ‌కుడు అని కీర్తించ‌డం స‌బ‌బ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
నేడు తిరుప‌తిలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు పాల్గొన్నారు. దేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా తిరుపతి నిలవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఇళ్లలో చెట్లు పెంచ‌డంతో పాటుగా చెట్ల మధ్యనే ఇళ్లు ఉండేలా ప్రజలు చర్యలు తీసుకోవాలని సూచించారు. చెట్ల పెంప‌కంపై ప్ర‌తి ఒక్క‌రు అవ‌గాహ‌న పెంపొందించుకొని ….మొక్క‌లు నాటాల‌ని ఆకాంక్షించారు. గ‌తంలో చేప‌ట్టిన వ‌నం-మ‌నం కార్య‌క్ర‌మంతో పాటు స్వ‌చ్ఛందంగా మొక్క‌ల పెంప‌కానికి ప్ర‌జ‌లు ముందుకు రావాల‌ని కోరారు. రూ.23 కోట్లతో ఏర్పాటుచేసిన నగరవనంతో పాటు తిరుప‌తిలోని డిజిటల్ డోర్ నంబర్ల వ్యవస్థను సీఎం ప్రారంభించారు. కపిలతీర్థం నుంచి అలిపిరి వరకూ రూ.23 కోట్లతో నగరవనాన్ని చంద్రబాబు ప్రారంభించారు. డిజిటల్ డోర్ నంబర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవల్లో మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త వ‌స్తుంద‌ని చంద్ర‌బాబు అభిప్రాయ‌ప‌డ్డారు. తిరుపతిని ఎడ్యుకేషన్‌, మెడికల్‌ హబ్‌గా, చిత్తూరును ఇండస్ట్రియల్ హబ్ గా  తీర్చిదిద్దుతామని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నామనీ, ఏపీలో దాదాపు 5 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని అన్నారు. నిరుద్యోగులు, యువతను ఆదుకొని వారికి ఉపాధి కల్పించేందుకు `ముఖ్యమంత్రి యువనేస్తం పథకం`ప్ర‌వేశ‌పెట్టామ‌ని చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.