చంద్రబాబు వల్లనే ఏటిఎంలో డబ్బులు రావడం లేదట

వైకాపా అధినేత జగన్మోహనరెడ్డి చేసే విమర్శలు ఒక్కోసారి ఊహకు అందవు. ఎవరికి తెలియని చాలా విషయాలు చెబుతుంటాడు. అవి నిజమా కాదా అనేది జనాలు ఎవరికి వారే బుర్రగొక్కుంటారు. టీడీపీ అధినేత, సిఎం చంద్రబాబు పై ఆయన చేసే ఆరోపణలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. తాజాగా జగన్ చేసిన విమర్శ ఏంటంటే..ఏటిఎంలలో డబ్బులు రాకపోవడానికి కారణం చంద్రబాబునట. రాష్ట్రాన్ని దోచుకుంటున్న జగన్ పెద్ద నోట్లను తీసుకుని విదేశాలకు వెళుతున్నారట. అక్కడ దాచి పెట్టుకుని తిరిగి వస్తున్నారని ఆరోపిస్తున్నారు. 
 
ఎటిఎంలలో డబ్బు రాకపోవడానికి , ముఖ్యమంత్రి చంద్రబాబుకు లింక్ లేదు. కానీ విపక్ష నేత జగన్ చేసిన ఆరోపణ ప్రకారం ఎటిఎమ్ లలో డబ్బును చంద్రబాబు వర్గం దోచేసిందనేది ఆరోపణ. అసలు ఏమన్నారంటే…’మీరంతా ఏటీఎంల్లోకి వెళ్లి బటన్‌ నొక్కండి. డబ్బు రాదు. రూ.2 వేలు, 500 నోట్లు రావడం లేదు. ఎక్కడికి పోయిందా డబ్బంతా? ఆ డబ్బంతా చంద్రబాబు దోచేశాడు. కొంత సింగపూర్, దుబాయ్‌లో పెట్టుకున్నాడు. ఎన్నికల్లో కాస్త మనందరికీ పంచే కార్యక్రమం చేస్తాడు. అందుకే ఓటు వేసేప్పుడు మాత్రం మీరంతా ఆలోచించండి. డబ్బులు తీసుకోండి. కానీ మనస్సాక్షి ప్రకారం ఓటేయండి. మోసం చేసేవాళ్లను, అబద్ధాలు చెప్పేవాళ్లను బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి తేవాలి. 
అల్లుడుతో జాగ్రత్త
అప్పుడే చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ వస్తుందని జగన్ అంటున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా జిల్లా అల్లుడు అన్న విషయాన్ని ప్రస్తావించాడు జగన్. జిల్లాలో తనను కలిసిన ప్రజలు ఇలా చెప్పారంటూ ప్రస్తావించారు. మా అల్లుడుగారు (చంద్రబాబు) ఇక్కడికి ఇల్లరికం వచ్చారన్నా. ఎన్టీఆర్‌ ఇల్లు, పార్టీనే కాదు.. చివరకు రాష్ట్రాన్నే దోచుకుతిన్నారని చెబుతున్నారు. ఇలాంటి మోసాలు చేసే, అబద్ధాలు చెప్పే వ్యక్తిని పొరపాటున క్షమిస్తే నష్టపోయేది మీరేనంటూ చెప్పారట. అదే విషయాన్ని తన ప్రసంగాల్లో చెబుతున్నాడు జగన్. తానేమీ చెయ్యకపోయినా అన్నీ చేసినట్టు బుకాయిస్తాడు. అన్నీ ఇచ్చానని, ప్రజలు కేరింతలు కొడుతున్నారని ఎల్లో మీడియాలో రాయిస్తాడని జగన్ చెబుతున్నాడు.  
బోల్తాపడ్డ జగన్
నంద్యాల ఉప ఎన్నికల సమయంలో చంద్రబాబు పై వ్యక్తిగతంగా మాటల దాడి చేశారు జగన్. చంద్రబాబును చంపేయాలని, ఉరి తీయాలని ప్రస్తావించారు. అదే చివరకు బాబుకు మరింతగా కలిసొచ్చింది. రోజా చేసిన నిర్వాహకం టీడీపీకి వరంగా మారింది. అఖిల ప్రియ పద్దతిగా డ్రెస్సులు వేసుకున్నా..చుడీదార్ లు ఎందుకు అని ప్రశ్నించింది. బికినీల్లో రోజా ఉంటే తప్పు లేదు. కానీ అఖిల ప్రియ చుడీదార్లలో తిరిగితే తప్పు అంటా అంటూ టీడీపీ ప్రచారం చేసింది. ఫలితంగా రోజాకు చివాట్లు తప్పలేదు. 
ఇప్పుడు జగన్ తిరిగి బాబు పై వ్యక్తిగత దాడికి దిగుతున్నారు. టీడీపీ ప్రభుత్వం కంటే ఎక్కువగా చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల పైనే ఆరోపణలు గుప్పిస్తున్నాడు. అదే సమయంలో జనసేన బీజేపీ మాటల దాడి చేస్తున్నాయి. తాము హోదా కోసం పోరాడుతుంటే..వైకాపా బీజేపీతో కుమ్మక్కై రాకుండా చేస్తుందని ఆరోపిస్తున్నారు చంద్రబాబు. నాలుగేళ్ల పాటు ఆ పార్టీతో కలిసి ఉండి చంద్రబాబు ఇలా మాట్లాడతారాఅంటూ విపక్షాలు మండిపడుతున్నారు. ఫలితంగా ప్రజలకు వాస్తవం తెలిసొస్తోంది.  
కన్నబాబు జంప్ 
విశాఖ జిల్లా యలమంచిలి మాజీ ఎమ్మెల్యే ,ప్రస్తుతం టిడిపిలో ఉన్న ఉప్పలపాటి రమణమూర్తి రాజు( కన్నబాబు ) వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయనతో పలు దఫాలుగా చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. ఫలితంగా ఆయన మే 5న వైకాపా తీర్థం పుచ్చుకోనున్నారు. 2004, 2009 ఎన్నికల్లో ఎలమంచిలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు కన్నబాబు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం తనకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. అదే సమయంలో చంద్రబాబు, లోకేష్ లు అవినీతి పనులు చేస్తున్నారు. జగన్ తప్పుడు పనులు చేస్తున్నారని ఆరోపిస్తున్న వాళ్లు అంత కంటే ఎక్కువగా అక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారాయన. పార్టీ మారేటప్పుడు ఉన్న పార్టీని తిట్టక కొత్త పార్టీని ఎలాగు తిట్టలేరు. కన్నబాబుది అదే తీరు అంటున్నారు జనాలు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.