Editor Picks

మోడీ-ఆయిల్ కుంభకోణం –

కుటుంబరావు గారు, ఈ రోజు కేంద్రం మీద బయట పెట్టిన మొట్ట మొదటి అవినీతి ఆరోపణకి  పూర్తి వివరాలు,సాక్ష్యాలు. ఈ  ఒప్పందంలో  ఉన్న ఒక రష్యన్  మంత్రి ప్రస్తుతం జెయిల్ లో ఉన్నాడు. Essar OIL-Roseneft-Trafigura-UCP deal – 82 వేల కోట్ల కాష్ డీల్ – 20 వేల కోట్ల పన్ను ఎగవేత […]

Editor Picks

లండన్ లో ఘనంగా “టాక్  బోనాల జాతర” వేడుకలు 

ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ  సంప్రదాయ నృత్యాలు మథుర, కోయా మరియు లంబడా లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్  (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో  బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ  వేడుకలకు యుకే నలుమూలల నుండి సుమారు 800 కి  పైగా ప్రవాస కుటుంబ సభ్యులు  హాజరయ్యారు.  ఈ వేడుకలకు స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా మరియు ఫస్ట్ సెక్రటరీ అఫ్ ఇండియన్ హైకమిషన్ అనిమా భరద్వాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్వదేశం లో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా  పూజలు నిర్వహించి, లండన్ వీదుల్లో తొట్టెల ఊరేగింపు లష్కర్ బోనాలకు ఏ మాత్రం తీసిపోకుండా  ప్రవాస బిడ్డలనే కాకుండాస్తానికులని కూడా ముగ్దులని చేసింది. బోనాల ఊరేగింపు తరువాత ఏర్పాటు చేసిన  కార్యక్రమాన్ని ముఖ్య అతిథులతో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సంస్థ ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం స్వాగతోపన్యాసంచేయగా, కార్యదర్శి రవి రేతినేని కార్యక్రమానికి వక్త గా వ్యవహరించారు. భారత సంతతికి చెందిన స్థానికి ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ, యూకే లో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని, వీరి స్ఫూర్తిచాలా గొప్పదని తెలిపారు. విదేశాల్లో ఉన్నపటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్తున్నా తీరు చాలా గొప్పగా ఉందని, లండన్ వీధుల్లో బోనాల తొట్టెలఊరేగింపు చూసి చాలా గర్వపడుతున్నానని, టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని ప్రశంసించారు. స్థానికంగా ఎటువంటి సహాయం కావాలన్న నన్నుసంప్రదించవచ్చని, లండన్ నగరం భిన్న సంస్కృతుల ప్రజలు నివసించే నగరమని, మనమంతా ఐకమత్యంగా ఉండి పరస్పర సంప్రదాయాలని సంస్కృతిని గౌరవించుకుంటూముందుకు వెళ్లాలని తెలిపారు.  తెలంగాణ రాష్ట్ర ప్రగతిని గమనిస్తున్నామని, ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలో దేశానికే ఆదర్శంగా ఉన్నట్టు తెలుకున్నామని, వారి ప్రతిపథకం వినూత్నంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఉన్నాయని, ప్రజలంతా అమ్మవారి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. స్తానిక ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర పండుగ “బోనాల” వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించడమే కాకుండా, సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి,ముఖ్యంగా లండన్ వీధుల్లో నిర్వహించిన తొట్టెల ఊరేగింపు లో పాల్గొనడం చాలా సంతోషం గా ఉందని తెలిపారు. అమ్మవారికి బోనం సమర్పించడానికి పెద్ద ఎత్తున మహిళలు బోనంనెత్తిన ఎత్తుకొని లండన్ వీధుల్లో రావడం చూస్తుంటే, ఒక మహిళగా ఎంతో గర్వంగా అనిపించిందని, తెలంగాణ సంస్కృతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా టాక్ సంస్థ చేపడుతున్నకార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. టాక్ సంస్థ కేవలం ఇలాంటి వేడుకలకు పరిమితం కాకుండా ఇంకెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, ఇటీవల మహిళా దినోత్సవం రోజు, స్థానికంగా మహిళా – శిశు సంరక్షణ కోసం పని చేస్తున్న సంస్థలకి విరాళాలిచ్చి ప్రోత్సహించడం చాలా […]

Editor Picks

హైద‌రాబాద్‌లో  ఎమ్మెల్యేలు వ‌ర్సెస్ ఎమ్మెల్సీలు…

ముందస్తు ఎన్నికలకు సై అంటూ సీఎం కేసీఆర్ సంకేతాలు ఇవ్వడంతో అధికార పక్షమైన టీఆర్ఎస్‌లో టిక్కెట్ల లొల్లి షురూ అయింది. ఓవైపు సిట్టింగ్‌లు తమకే టిక్కెట్ గ్యారంటీ అన్న ధీమాతో ఉన్నారు. మరోవైపు గత ఎన్నికల్లో టిక్కెట్ రాకపోవడంతో ఎమ్మెల్సీలుగా ఛాన్స్ కొట్టేసిన నేతలు ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో […]

తాజా వార్తలు

మోత్కుప‌ల్లిని… ప‌క్క‌నేవున్నాగానీ… ప‌ట్టించుకోరు!

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పిలుపుతో  రాజకీయాల్లోకి వ‌చ్చి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఘ‌న‌త ద‌క్కించుకున్నారు. ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అయితే ఇప్ప‌డు సీన్ రివ‌ర్స‌య్యింది. గ‌త‌కొంత‌కాలంగా  చంద్ర‌బాబు… మోత్కుప‌ల్లిని అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌నే టాక్‌వినిపిస్తోంది! ఆమ‌ధ్య […]

ఆంధ్రప్రదేశ్

గెలిస్తే తండ్రుల ఖ్యాతి.. ఓడితే కొడుకుల అప‌ఖ్యాతి!

ఇదేం లెక్క‌.. వింత‌గా ఉందే అని ఆశ్చ‌ర్య‌పోకండీ.. ఎందుకంటే ఇది రాజ‌కీయం. ఇక్క‌డ‌న్నీ ఇలాంటి లెక్క‌లే ఉంటాయి. ముఖ్యంగా జాతీయ రాజ‌కీయాల‌ను సైతం ప్ర‌భావితం చేయ‌గ‌ల స‌మ‌ర్థులున్న తెలుగు రాష్ట్రాల్లో ప‌రిస్థితులు ఇలాగే ఉన్నాయి. ఇప్ప‌టికే ఏపీ, తెలంగాణాల్లో సీనియ‌ర్ నేత‌లంతా వృద్ధాప్యానికి వ‌చ్చేశారు. వారిలో ఇద్ద‌రు చంద్రులూ […]

Editor Picks

తెలంగాణ‌లో ఊహించ‌ని ప‌రిణామాలు!

తెలంగాణ‌లో తాజాగా చోటుచేసుకుంటున్న కొన్ని ప‌రిణామాలు.. రాజ‌కీయంగా ముడిప‌డ్డాయి. ఇది స‌ర్కారు ప్రోద్బ‌ల‌మా.. గులాబీ పార్టీ అధినేత ఆత్మ‌విశ్వాస‌మా అనేది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌. వాటిలో ఒక‌టి.. క‌త్తి మ‌హేష్ ను హైద‌రాబాద్ నుంచి బ‌హిష్క‌రిస్తూ పోలీసులు ఆదేశాలు జారీచేశారు. మ‌రోసారి ఇక్క‌డ కాలుమోపాల‌న్నా.. పోలీసుల‌కు ముంద‌స్తు స‌మాచారం […]

తాజా వార్తలు

నేతల తీరుతో కేసీఆర్‌కు కొత్త తలనొప్పి

తెలంగాణలో మరోసారి అధికారంలోకి రావాలనుకుంటోంది తెలంగాణ రాష్ట్ర సమితి. అందుకోసం ఎప్పటి నుంచో ప్రణాళికలు రూపొందించుకుంటోంది. గత ఎన్నికల సమయానికీ, ఇప్పటికీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. టీడీపీ సంగతి పక్కన పెడితే.. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ బాగా బలపడింది. అంతేకాదు అంతకుముందు ఎన్నికల్లో కేసీఆర్‌తో కలిసి […]

ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు వద్దంటే.. కేసీఆర్ కావాలంటున్నాడు

లోక్‌సభకు, అసెంబ్లీకి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదనను చాలా రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది రాజ్యాంగవిరుద్ధమని, ఆచరణ సాధ్యం కాదని అంటున్నాయి. జమిలీ ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలతో లా కమిషన్‌ శనివారం నాడు సంప్రదింపులు మొదలుపెట్టింది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ప్రక్రియలో తొలిరోజున- ప్రధాన […]

తాజా వార్తలు

రేవంత్‌ రెడ్డి వెనుక భారీ కుట్ర..!

కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.. రాజకీయ ఆరంగేట్రం చేసిన కొద్ది రోజుల్లోనే కీలక నేతగా ఎదిగిన రేవంత్.. చంద్రబాబుకు నమ్మిన బంటుగా మారిపోయాడు. విభజనకు ముందు చంద్రబాబు నీడలో ఉన్న ఆయన.. అనంతరం తెలంగాణలో టీడీపీకి పెద్ద దిక్కు అయ్యాడు. అధికార టీఆర్ఎస్‌పై పోరాంటం చేసి టీడీపీలో ఓ […]

తాజా వార్తలు

రేవంత్ రెడ్డి దృష్టి అటు వైపు మళ్లిందట

తెలంగాణలో ఉన్న పవర్‌ఫుల్ లీడర్లలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఒకరు. ఆయన ప్రసంగాలకు, ఇతర పార్టీ నేతలకు ఇచ్చే కౌంటర్లకు చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. అంతేకాదు పార్టీలకతీతంగా ఆయనను అభిమానించేవారు చాలా మందే ఉన్నారు. తెలుగుదేశంలో అనతి కాలంలోనే కీలక నేతగా ఎదిగిన రేవంత్.. అధినేతకు […]