తాజా వార్తలు

అమెరికాలో తెలుగు మువ్వలు! కూచిపూడి నృత్య సౌరభాలు!!

మెంఫిస్ మే 19: శారీరకంగాను మానసికంగాను ఏ కారణంగా నైనా వెనుకబడిన వారి ఎదుగుదలకి చేయూత నిచ్చే ధార్మిక సంస్థ(Empowering people with intellectual and developmental disabilities to achieve their full potential) టేనస్సీ రాష్ట్రం, మెంఫిస్ పట్టణంలోని “దిఆర్క్ మిడ్-సౌత్”. 1950లో ప్రారంభమైన ఈ సంస్థ (http://thearcmidsouth.org/) ప్రతి సంవత్సరం కొన్ని వందలమందిని వివిధ రంగాల్లో,ఎన్నో రకాల వృత్తి, విద్యల్లో శిక్షణ నివ్వడం ద్వారా పరోక్షంగా ఎన్నో కుటుంబాలకి బాసటగా నిలుస్తోంది. ది ఆర్క్ ఆధ్వర్యంలో శనివారం,మే 19న 4వ ఇంటర్నేషనల్ టీ అండ్ ఫాషన్ షో మెంఫిస్ క్రోక్ సెంటర్లో వైభవంగా జరిగింది. మెంఫిస్ కూచిపూడి కళాక్షేత్రం – ఇండియన్బాలే థియేటర్ గత రెండు సంవత్సరాలుగా “ది ఆర్క్ మిడ్-సౌత్” వారి కార్యక్రమాల్లో, సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొని తమవంతుసహాయ సహకారాలు అందిస్తోంది. టేనస్సీ ప్రభుత్వ గుర్తింపు పొందిన స్పిరిట్యుయల్ ఫౌండేషన్ (Spiritual Foundation) వారి ఆధ్వర్యంలోమెంఫిస్ పట్టణంలో ఇండియన్ బాలే థియేటర్ (Indian Ballet Theater since 1982) కూచిపూడి నృత్య శిక్షణా తరగతులు నిర్వహిస్తారు.అమెరికాలో ఎందరో భారతీయుల్ని, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల చిన్నారులకి కూచిపూడి నృత్యంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నసంస్థ డాక్టర్ రమణ మరియు శ్రీమతి చంద్ర ప్రభ వాసిలి ఆద్వర్యంలోని ఈ కూచిపూడి కళాక్షేత్రం. “డాన్సింగ్ బెల్స్ అఫ్ ఇండియా”గాపదుగురికి తెలిసిన “తెలుగు చిన్నారు  – తెలుగు మువ్వలు” శాన్వి కుంటమల్ల, సహస్ర తోట మరియు నిధి నిహారిక చెన్నం సంప్రదాయకూచిపూడి నృత్యం అత్యంత రమణీయంగా ప్రదర్శించారు. డాక్టర్ రమణ మరియు శ్రీమతి చంద్ర ప్రభ ప్రదర్శించిన”ఆనందతాండవమాడే శివుడు” ఫాషన్ షోకి వచ్చిన ఆహ్వానితుల్ని ఉర్రుతలూగించింది. మెంఫిస్ ఇండియన్ బాలే థియేటర్ కళాకారులుసెయింట్ లూయిస్ పట్టణంలో గత ఏడాది తానా ఉత్సవాల్లో, చికాగో పట్టణంలో నాట్స్ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు సంబరాల్లోసాంప్రదాయ కూచిపూడి నృత్యాల్ని ప్రదర్శించి ప్రేక్షకుల మెప్పు పొందారు. అమెరికా తెలుగు అసోసియేషన్ మరియు తెలంగాణఅమెరికా తెలుగు అసోసియేషన్ సంయుక్తంగా మే 31-జూన్ 2 వరకు టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ పట్టణంలో నిర్వహిస్తున్న “అమెరికన్ తెలుగుకన్వెన్షన్ (American Telugu Convention-Irving Convention Center, Dallas, TX)”లో కూడా కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఇండియన్ బాలేథియేటర్ డైరెక్టర్ శ్రీమతి చంద్ర ప్రభ వాసిలి తెలిపారు.   

తాజా వార్తలు

క్యాలిఫోర్నియా లో అత్యంత ఘనంగా మనబడి స్నాతకోత్సవం

క్యాలిఫోర్నియా : సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవాలు, శుక్రవారం మే 18న  క్యాలిఫోర్నియాలో ఘనంగా ప్రారంభమైనాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తో కలిసి మనబడి నిర్వహించిన జూనియర్ మరియు సీనియర్ సర్టిఫికేట్ పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన 300 మందికి పైగా విద్యార్ధినీ విద్యారులకు, మిల్పిటాస్ లోని ఇండియన్ కమ్యూనిటీ సెంటర్‌లో తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు […]

Editor Picks

ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ కర్ణాటక  విజయ్ దివస్ సంబరాలు 

ఎడిసన్ , న్యూ జెర్సీ :  ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గణ విజయం సాధించడంతో , ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ, ఎడిసన్ , న్యూ జెర్సీలో విజయ్ దివస్ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు మరియు బీజేపీ […]

ఆంధ్రప్రదేశ్

అమెరికాలో కమలానికి తెలుగుసెగ

ఒకసారి ఒక జాతికి ద్రోహం చేస్తే , ఒక జాతిని వంచిస్తే.. ఆ పాపం ఎప్పటికీ వెన్నాడుతూనే ఉంటుంది ఒకసారి వంచనకు పాల్పడిన తరువాత… రాష్ట్రం దాటి వెళ్లినా, దేశం దాటి వెళ్లినా, ఖండాలను దాటి వెళ్లినా… ఆ పాపం నుంచి తప్పించుకోజాలరు. ఆ విషయం ఇప్పుడు బీజేపీ […]

ఆంధ్రప్రదేశ్

అద్భుతమైన క్షణాలను మిస్ అయిన పవన్ కల్యాణ్

జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నేడు మధురమైన క్షణాలను మిస్ అయ్యారు. ఆదివారం మాతృదినోత్సవం అన్న సంగతి అందరికీ తెలిసిందే. మాతృ దినోత్సవం సందర్భంగా మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు వాళ్ల అమ్మగారైన అంజనాదేవి దగ్గర ఆశీస్సులు పొందారు. కోట్లాదిమంది అభిమానించే మెగాస్టార్ అయినా.. అమ్మ అంజనాదేవికి […]

Editor Picks

హెచ్‌1బీ టాప్ ల‌బ్ధిదారులు మ‌నోళ్లే

భార‌త టెకీలు అమెరికా గ‌డ్డ‌పై త‌మ స‌త్తా చాటుకుంటున్నారు.  నైపుణ్యాల ప‌రంగా టాప్‌లో ఉన్న మ‌నోళ్లు వీసాల విష‌యంలోనూ ప్ర‌త్యేక‌త‌ను సాధించుకున్నారు. 2016లో అమెరికా ప్రభుత్వం జారీచేసిన మొత్తం హెచ్-1బీ వీసాల్లో 74.2 శాతం వీసాలు భారతీయ ఐటీ నిపుణులే దక్కించుకున్నారు. 2017లో ఈ సంఖ్య మరింత పెరిగి […]

Editor Picks

అమెరికాలోమహానాడు సన్నాహక సమావేశం

ఎన్నారై  తెలుగుదేశం డల్లాస్ విభాగం ఆద్వర్యం లో  ది 06/05/2018 ఆదివారం సాయంత్రం ప్లానోలో గల తబలా ఇండియన్  రెస్టారెంట్ లో మహానాడు సన్నాహక  సమావేశాన్ని నిర్వహించారు. డల్లాస్ నగరములో  మొదటిసారిగా నందమూరి తారకరామారావు 95వ జన్మదినాన్ని పురస్కరించుకొని , అమెరికాలో  భారీగా మహానాడు చెయ్యాలి అని నిర్ణయించారు.  […]

Editor Picks

రాజస్థాన్ రాయల్స్ కు ఎంపికైన తెలుగు క్రికెటర్ కార్తీక్ సాగర్

ఐపిఎల్ తొలి విజేత రాజస్థాన్ రాయల్స్. 2008లో జరిగిన పైనల్ లో చైన్నై సూపర్  కింక్స్ ను ఓడించి తన తడాఖా చూపింది. అలాంటి జట్టుకు ఐపిఎల్-11 సీజన్ కు ఎంపికయ్యారు తెలుగువాడైన కార్తీక్ సాగర్ గట్టిపల్లి. అమెరికా టెక్సాస్ లోని డల్లాస్ కు చెందిన కార్తీక్ అండర్-19 […]

Editor Picks

ధర్మదీక్షకు అమెరికా లోని న్యూ జెర్సీ రాష్ట్రంలో సంఘీభావం

ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ధర్మదీక్షకు సంఘీభావంగా అమెరికా లోని న్యూ జెర్సీ రాష్ట్రం లోని న్యూ బ్రున్స్విక్  నగరంలో  పలువురు తెలుగు దేశం నాయకులు నిరసనలు చేపట్టారు. శని వారం స్థానిక న్యూ జెర్సీ తెదేపా  ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరిగాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లడుతూ  కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అన్యాయం చేసిందని ఆవేదన […]

Editor Picks

అమెరికా లోని ఛార్లెట్ లో ధర్మ పోరాట దీక్ష

కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి చేసిన అన్యాయానికి నిరసనగా, చంద్రబాబు నాయుడు గారి ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా చార్లెట్ నగరంలోని ప్రవాసాంధ్రులు శుక్రవారం నాడు ఉపవాస దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రవాస వ్యవహారాల మంత్రి కొల్లు రవీంద్ర, పెనమలూరు శాసనసభ్యుడు బోడె ప్రసాద్, ఉత్తర […]