ఏపీలో ఉప ఎన్నికలు వస్తాయా…

ఏపీకి హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ రాజీనామా లేఖల ఆమోదంపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్ నిర్ణయం తీసుకోనున్నారు. అందుకే వారిని ఈనెల 29న  తమ కార్యాలయానికి రావాల్సిందిగా వర్తమానం పంపారు. స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను వ్యక్తిగతంగా కలిసి తమ వాదన వినిపించనున్నారు వైకాపా ఎంపీలు. రాజీనామాల ఆమోదంపై స్పీకర్‌ ఆహ్వానిస్తే ఎప్పుడైనా సిద్ధమని వైసీపీ ఎంపీలు మరో లేఖ ఇచ్చిన సంగతి తెలిసిందే. జూన్ 1న సుమిత్రాతో భేటీ కావాలని ఈ నెల 19న స్పీకర్‌ కార్యాలయం నుంచి వైసీపీ ఎంపీలకు లేఖ వచ్చింది. ఆ తర్వాత తిరిగి మార్పులు, చేర్పులు చేశారు. జూన్ 1కు బదులు ఈనెల 29నే వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ వైసీపీ ఎంపీలకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఉప ఎన్నికలు
వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్ రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. స్పీకర్ ఫార్మెట్ లో రూపొందించిన రాజీనామాలను నేరుగా తీసుకెళ్లి స్పీకర్ సుమిత్రా మహాజన్ కి అందించారు. తమ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నందున తాము పార్లమెంట్ లో కొనసాగలేమని తేల్చేశారు. ఇప్పుడు వారి రాజీనామాలు ఆమోదం పొందితే ఆ మేరకు నాలుగు చోట్ల ఉప ఎన్నికలు వచ్చే వీలుంది. అందుకే ముందుగా ఎన్నికలకు సిద్దంగా ఉండాలని వైకాపా అధినేత జగన్, ఇటు టీడీపీ అధినేత, సిఎం చంద్రబాబునాయుడులు తమ క్యాడర్ కు ఆదేశాలిచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన అన్ని ఎన్నికల్లోను ఆ పార్టీదే విజయం. కాబట్టి ఈ ఎన్నికలను ధీటుగానే ఎదుర్కుంటామని చెబుతోంది టీడీపీ. నంద్యాల ఉప ఎన్నికలను గుర్తు చేస్తున్నారు. ఈ సారి అలా జరగదని భావిస్తోంది వైకాపా.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.