కుమారస్వామికి బంపర్ ఆఫర్

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడింది. ఫలితంగా జేడీఎస్ కు బంపర్ ఆఫర్ ప్రకటించింది హస్తం పార్టీ. సిఎం సీటు మీరే తీసుకోండి. మాకు డిప్యూటీ సిఎం ఇవ్వండని ప్రతిపాదన చేసింది. ఇందుకు కుమారస్వామి వర్గం సమ్మతించింది. గులాం నబి ఆజాద్ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతలు జేడీఎస్ అధ్యక్షుడు దేవగౌడను కలిశారు. వారి మధ్య ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత ఎవరికివారే తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరకు వచ్చి ఆగింది. బీజేపీకి 104, కాంగ్రెస్ కు 77, జేడీఎస్-41, ఇతరులు-02 సీట్లను గెలుచుకున్నసంగతి తెలిసిందే. మరోవైపు బీజేపీ కోర్ కమిటీ సమావేశమై సీఎం అభ్యర్థిగా  మాజీ సీఎం యడ్యూరప్పను ఎంపిక చేయనుంది. 
భారతీయ జనతా పార్టీకి అధికారం దక్కకూడదనేది కాంగ్రెస్ ఆలోచన. అందుకే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. వాస్తవానికి కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు 112 సీట్లు కావాలి. తొలిగా ఆ దిశగా వెళుతున్నట్లు అనిపించినా ఆ తర్వాత వెనక్కు తగ్గింది. ప్రస్తుతం ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కంటే దాదాపు 6 సీట్లు వెనుకబడి ఉంది. ఫలితంగా రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. 
బెంగళూరులో జేడీఎస్, కాంగ్రెస్ నేతలు సమావేశం కావడం ఉత్కంఠను పెంచుతున్నాయి. ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కాంగ్రెస్ చెప్పడంతో జేడీఎస్ తమకు వచ్చిన అవకాశాన్ని వదులుకునేందుకు సిద్దంగా లేదు. ఇంకోవైపు కాంగ్రెస్, జేడీఎస్ నేతలను చీల్చే దిశగా బీజేపీ పావులు కదుపుతున్నట్లు సమాచారం వస్తోంది. ఆరు నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునే పని చేయనుంది. అధికారాన్ని అంత తేలికగా బీజేపీ వదులుకోదు. అందుకే ఏ పని చేసినా సిఎం సీటును ఆ పార్టీ తీసుకుంటుందంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.