బోయ‌పాటి వీర విహారం… చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌ విషాదం!

బోయ‌పాటి సినిమాలు అంటే యాక్ష‌న్ సీన్స్ ట్రేడ్‌మార్క్ వంటివి. కానీ… మ‌నం చేసిన ప‌నులు జ‌నానికి న‌చ్చుతున్నాయ‌ని తెలిశాక జాగ్ర‌త్త ప‌డాలి. లేదా స‌హ‌జంగా ఉండాలి. కానీ… మ‌నం చేసిన‌వ‌న్నీ న‌చ్చుతున్నాయ‌ని చేసుకుంటూ పోతే… రిజ‌ల్ట్ ఎంత వైల్డ్‌గా ఉంటుందో *విన‌య‌విధేయ‌రామ* సినిమా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్‌. ముందు నుంచి హై ఓల్టేజ్ యాక్ష‌న్ సీన్స్ డైరెక్ట్ చేసిన బోయ‌పాటి లెడెంజ్ వంటి సినిమాతో పీక్స్ చూశాడు… ఆ త‌ర్వాత ఆ స్థాయిలో బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వ‌క‌పోయినా ప‌ర్వాలేద‌నిపించాడు. కానీ.. ఎపుడైతే ఆయ‌న జ‌య జాన‌కి నాయ‌క సినిమా తీశాడో… అందులో హంస‌ల‌దీవి ఫైట్ ఒక‌టి జ‌నానికి బాగా న‌చ్చింది. ముగ్గురు మ‌నుషులు వంద‌లాది విల‌న్ల‌ను వేటాడుతారు. అందులో త‌ల లేపేసే సీన్ హైలెట్‌గా ఉంటుంది. ఆ ఫైట్‌కి యూట్యూబులో పెద్ద సంఖ్య‌లో వ్యూస్ వ‌చ్చాయి. దీంతో జ‌నాలు ఇట్లా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారా అని అనుకున్నాడు బోయ‌పాటి. అంతే… వీవీఆర్ లో క‌న‌ప‌డిన ప్ర‌తి త‌ల‌ను లేపేసుకుంటూ వెళ్లాడు. రాంచ‌ర‌ణ్ కెరీర్‌లో తుఫాన్ రికార్డుల‌ను చెరిపేసిన రాడ్ సినిమా ఇది అని జ‌నంలో టాక్‌.

పాము మ‌నిషిని క‌రిస్తే పాము చ‌నిపోవ‌డం
క‌త్తితో ఒకేసారి రెండు త‌ల‌లు న‌రికితే అవి ఎగురుతుండ‌గానే రాబంధులు ఎత్తుకెళ్ల‌డం
అర్జెంట్‌గా వెళ్ల‌డానికి ఎవ‌రూ అడ్డుకోక‌పోయినా ఎయిర్‌పోర్ట్ అద్దాలు ప‌గ‌ల‌గొట్టి వెళ్ల‌డం
అన్న ఫోన్ చేశాడ‌ని… నేరుగా బ్రిడ్జి మీద నుంచి రైలుపై దూకేసి ప్ర‌యాణించ‌డం…

ఇదీ బోయ‌పాటి చేసిన విల‌య‌తాండ‌వం. ఏమి బోయ‌పాటి … మాకేమ‌న్నా మెడ‌కాయ మీద త‌ల‌కాయ లేద‌నుకున్నావా ఇలా త‌ల‌కాయ లేపేసే సీన్లు పెట్ట‌డానికి అంటూ జ‌నం హాహాకారాలు చేస్తున్నారు. రంగ‌స్థ‌లం వంటి సాఫ్ట్ జాన‌ర్‌లోకి వెళ్లి రాం డెవ‌ల‌ప్ అవుతున్నాడు అనుకుంటే మ‌రీ ఇంత ఘోరంగా ఎలా త‌యారయ్యాడు? ఈ సినిమాలో ఏ క‌థ చెబితే రాం ఒప్పుకున్నాడో అర్థం కావ‌డం లేదు. అన‌వ‌స‌ర అతి, రౌద్రంతో ర‌గిలిపోయి దుమ్ముకొట్టుకుపోతున్న యాక్ష‌న్ సీన్ల‌ను మిన‌హాయిస్తే… ఈ సినిమాలో ఏం లేదు. మ‌రీ అభిమానులు ఈ స్థాయిలో డిజ‌ప్పాయింట్ చేయ‌డం ఒకెత్తు అయితే… బోయ‌పాటికి ఈ సినిమా రిజ‌ల్ట్ ఒక గుణ‌పాఠం కానుంది. రాంచ‌ర‌ణ్ మ‌రో రంగ‌స్థ‌లం వంటి సినిమాను ఎదుర్కోవాల్సిన అవ‌సరం స్ప‌ష్టంగా తెలిసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.