గంటా వైసీపీలోకి రావాలంటే ఒక కండీషన్ అంట!

మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతున్నారంటూ రోజుకో వార్త పుట్టుకొస్తోంది. గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడి వైసీపీలోకి వెళతరాని ఒకరంటుంటే.. లేదు ఆయన జనసేనలోకి వెళతారని మరొకరు అంటున్నారు. ఇదే విషయాన్ని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వద్ద ప్రస్తావిస్తే.. ‘గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వస్తున్నారా? నాకు ఆ విషయం తెలీదే!’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ తరువాత తేరుకుని పార్టీ విధివిధానాలు నచ్చి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామన్నారు. అయితే తమ పార్టీలోకి రావాలనుకునే వాళ్లు తమ పదవులకు రాజీనామా చేస్తేనే చేర్చుకుంటామని కండీషన్ పెట్టారు.

మరోవైపు గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీకి దూరం దూరంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ మీటింగ్‌కు గంటా డుమ్మా కొట్టడం కూడా ఆయన పార్టీకి దూరమవుతున్నారనే దానికి బలం చేకూరుస్తోంది. చంద్రబాబు నిర్వహించే ప్రతి సమావేశానికి తప్పకుండా హాజరయ్యే గంటా శ్రీనివాసరావు.. తాను పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్న సమయంలో గైర్హాజవడం అనుమానాలకు తావిస్తోంది. అయితే గంటా అనారోగ్యం కారణంగానే మంత్రి వర్గ సమావేశానికి హాజరుకాలేకపోయారని ఆయన వర్గీయులు చెబుతున్నప్పటికీ.. దాన్ని ఎవరూ నమ్మడం లేదు. పైగా వచ్చే నెల 15 తర్వాత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర విశాఖకు చేరుకుంటుంది. దీంతో వచ్చే నెలలో జగన్ సమక్షంలోనే గంటా వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. చూద్దాం.. ఏం జరుగుతుందో!.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.