వైసీపీ-బీజేపీ మధ్య జరిగిన ఒప్పందం ఇదేనా..?

ఏపీలో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. టీడీపీ ఇక్కడ మరోసారి అధికార పీటాన్ని దక్కించుకోవాలని చూస్తేంటే.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్ ఈ సారైనా గెలిచి ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. మరోపక్క ఏపీ రాజకీయాల్లో తమ మార్కును చూపించాలని బీజేపీ, జనసేన తీవ్రంగా శ్రమిస్తుండగా, విభజన కారణంగా ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఇన్ని పార్టీలు ఉన్నా 2019 ఎన్నికల్లో ప్రధాన పోటీ టీడీపీ-వైసీపీ మధ్యలోనే ఉండబోతుందనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ రెండు పార్టీలు ఎన్నికల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. అభివృద్ధే ప్రధాన ఆయుధంగా టీడీపీ.. ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మలచుకోవాలని వైసీపీ నిర్ణయించుకున్నాయి.

ఏపీలోని ప్రతి పార్టీ ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని వాడుకుని రాష్ట్రంలో తన మార్కును చూపించుకోవాలని చూస్తున్నాయి. ప్రధానంగా అధికారంలో ఉన్న టీడీపీ.. విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజలను మోసం చేసిందన్న కారణంతో ఎన్డీయే నుంచి బయటికి వచ్చేసింది. అప్పటి నుంచి టీడీపీ.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తోంది. అంతేకాదు ఏపీ ప్రజలను మోసం చేసిన బీజేపీ కుటిల రాజకీయాలను ప్రజలకు వివరించడంలో ఆ పార్టీ నేతలు సక్సెస్ అయ్యారు. మరోపక్క, ఇదే కారణంతో టీడీపీ కంటే ముందే వైసీపీ అధినేత జగన్.. తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించాడు. అయితే దానిని అనుకూలంగా మలచుకోవడంలో జగన్ విఫలమయ్యాడు. వాళ్ల రాజీనామాల వ్యవహారం గురించి తాజాగా ఓ వార్త కలకలం సృష్టిస్తోంది.

వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయించడానికి వెనుక కుటిల రాజకీయం ఉందనేది ఆ వార్త సారాంశం. ఎంపీలతో జగన్ రాజీనామా చేయించడానికి ముందే.. బీజేపీతో వైసీపీ ఒక ఒప్పందం కుదుర్చుకుందట. ‘‘2019లో జరిగే ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు వైసీపీలో చేరుతారట. వారిలోనే కొందరిని వైసీపీ తరపున అసెంబ్లీకి, ఇంకొందరిని పార్లమెంట్‌కు పోటీ చేయించాలట. అంతేకాదు కొన్ని చోట్ల వైసీపీ తరపున పోటీ చేసే అభ్యర్ధులుగా బీజేపీ చెప్పిన వారినే నిలబెట్టాలట. ఇందుకు గానూ జగన్‌పై ఉన్న కేసులన్నీ కొట్టి వేయాలట’’. ఇదే ఈ రెండు పార్టీల మధ్య జరిగిన ఒప్పందం అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ఒప్పందం కుదరడంలో ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి చక్రం తిప్పారని, పీఎంవో ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఈ వ్యవహారాన్ని నడిపించారని టాక్ కూడా వినిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.