బీజేపీ తొండి మాటలు

అధికారానికి దూరమైన మాటలు తగ్గలేదు. వారు ఎందుకు సంబరాలు జరుపుకుంటున్నారో అర్థం కావడం లేదంటోంది బీజేపీ. అసలు మెజార్టీ మాకు వచ్చింది. ఫలితాలు మాకు అనుకూలంగా వచ్చాయిని వాదిస్తోంది. కర్నాటకలో ఉప ఎన్నికలు రావాని కోరుకుంటోంది బీజేపీ. ఫలితంగా కాంగ్రెస్, జేడీఎస్ ల కూటమి ఎక్కువ కాలం ఉండదనే సంగతి అర్థమవుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో సాధారణ మెజారిటీ(112 సీట్లు) రాకపోయనా బీజేపీ అధికారానికి వచ్చేందుకు ఎందుకు ప్రయత్నించిందనే విషయం పై బీజేపీ వద్ద సరైన సమాధానం లేదు. యడ్డురప్ప ఎందుకు విఫలమయ్యారనేది తేలలేదు. 
మళ్లీ ఎన్నికలకు వెళ్లే ఆలోచన బీజేపీకి రావడంతో ఎమ్మెల్యేల్లో కలవరం మొదలైంది. ఇప్పటికే ఆస్తులమ్మి మరీ ఎన్నికల్లో పోటీ చేశాం. చివరకు మధ్యలోనే ప్రభుత్వం పడిపోతే ఆ మేరకు ఇబ్బంది వస్తుందని భావిస్తున్నారు. ‘చాలా మంది అడుగుతున్నారు.. బలం లేకపోయినా మీరు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకెలా వచ్చారు? అని. నిజమే, మరి ఏ పార్టీకి బలం రాలేదు. అందుకే కర్ణాటకలో మళ్లీ ఎన్నికలకు వెళ్లాలా అని అమిత్ షా ప్రశ్నించారు. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌ వ్యతిరేక తీర్పు ఇచ్చారు. ప్రజా తీర్పును గౌరవించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చాం. ఎన్నికల్లో కాంగ్రెస్‌ మంత్రుల్లో చాలా మంది ఓడిపోయారు. ముఖ్యమంత్రి ఒక స్థానంలో ఓడిపోయారు. రెండో స్థానంలో బొటాబొటి మెజారిటీతో గెలిచారు. జేడీఎస్‌ కేవలం కాంగ్రెస్‌ వ్యతిరేక ప్రచారంతోనే 38 సీట్లు గెలుచుకుంది. ఫలితంగా కాంగ్రెస్ కు అసలు బలమే లేదనిచెప్పారాయన. అతిపెద్ద పార్టీగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంది. తప్పు లేదన్నారు. 
కాంగ్రెస్‌ వ్యతిరేక ఓటుతో గెలిచిన జేడీఎస్‌ ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవడం అపవిత్రచర్య అంటోంది బీజేపీ. అధికారం కోసం విలువలు, సిద్ధాంతాలు వదిలేసే వాళ్లం మేము కాదనిచెప్పారు అమిత్ షా. అపవిత్రపొత్తుతో జనం సంతోషంగాలేరు. యడ్యూరప్ప బలనిరూపణ కోసం ఏడు రోజులు గడువు అడిగారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ప్రయత్నిస్తున్నారని తీర్పును ప్రభావితం చేసేలా కోర్టుకు అబద్ధాలు చెప్పారు. అది మంచి పద్దతి కాదన్నారు. ఏం సాధించారని కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటోంది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినందుకా, దొంగ ఓట్లు, నకిలీ ఐడీకార్డులు సృష్టించినందుకా అని అడిగారు బీజేపీ అధినేత. కాంగ్రెస్ 122 సీట్ల నుంచి 78 సీట్లకు దిగజారింది. తమ పార్టీకి 40 స్థానాల నుంచి 107 స్థానాలకు ఎదిగామని చెప్పింది. కుమారస్వామి ముఖ్యమంత్రిగా జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వం ఈ నెల 23న కొలువుదీరనున్న నేపధ్యంలో అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 
కొంపదీసి కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మరో ప్రణాళిక సిద్దం చేసిందా అనే చర్చ సాగుతోంది. బీహార్ లో నితీష్ కుమార్, లాలూ కూటమి చీల్చినట్లు ఇక్కడ చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అసలు కర్నాటకలో బీజేపీనే చీల్చేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతుందన్న వాదనలేకపోలేదు.  
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.