బీజేపీ పుంజుకుంటోంది…

ప్రచారానికి ఇక ఒకరోజే మిగిలింది. ప్రచారం పరిసమాప్తం అవుతోంది. బీజేపీ జోరుగా ప్రచారం చేస్తుండగా.. కాంగ్రెస్ ఢీలా పడిపోయింది. రాహుల్ గాంధీ అనుకున్నంత మేర ప్రచారం చేయలేకపోతున్నారు. సోనియాగాంధీ ప్రచారం చేసినా గతంలో ఉన్న వాడి వేడి మాటలు లేవు. పైగా సోనియాగాంధీ ఎక్కువగా విశ్రాంతికే పరిమితం అవుతున్నారు. కనీసం 15 నిమిషాలు ఆపకుండా హిందీలో మాట్లాడండి చూద్దామని విసిరిన మోడీ సవాల్ కు సమాధానం చెప్పలేకపోయారు రాహుల్. ఫలితంగా రాహుల్ కు క్రేజ్ తగ్గుతోంది. ఇంకోవైపు సిద్దరామయ్య అవినీతి, అక్రమాలపై బీజేపీ ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది. లింగాయత్ లను తమవైపు తిప్పుకునేందుకు జోరుగా ప్రయత్నాలు చేస్తోంది. అందులోను వీర శైవులు జారకుండా జాగ్రత్తలు పడుతోంది. తెలుగు వారు ఉన్న 45 నియోజకవర్గాలపై దృష్టి సారించింది. మోడీ ఎంటరయ్యాక సీన్ మారుతోంది. నిన్నటి వరకు కాంగ్రెస్ కు సంపూర్ణ మెజార్టీ వస్తుందనే స్టేజ్ నుంచి బీజేపీకి బాగానే సీట్లు వస్తాయనే వరకు సర్వేలు వెళుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ చేరుకోకపోయినా గతం కంటే సీట్లు గణనీయంగా పెంచుకోనుంది బీజేపీ. గతంలో 40 సీట్లు రాగా.. ఈ సారి అవి 80కు పెరిగే వీలుంది. అదే జరిగితే కాంగ్రెస్ మేజిక్ ఫిగర్ 112 చేరుకోవడం అంత తేలిక కాదు. జేడిఎస్ కు 40 సీట్లు తక్కువ కాకుండా వచ్చే వీలుంది. కాబట్టి కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడక కాదని తెలుస్తోంది. ఎడ్యూరప్ప అవినీతి, గాలి జనార్దన్ రెడ్డి అక్రమాలు బీజేపీకి ఇబ్బంది కలిగించే అంశాలైనా వాటి ప్రభావం పడకుండా మోడీ పావులు కదుపుతున్నారు. 
స్థానిక భాషలో, స్థానికాంశాలను ప్రస్తావిస్తూ మోడీ ప్రసగింస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఫలితంగా బీజేపీ అంటే వ్యతిరేకత చూపే ఓటర్లు సైతం ఆలోచనలో పడ్డారు. ఫలితంగా కర్నాకటలో పోటీ నువ్వా-నేనా అన్నట్లుగా సాగుతోంది.  ఏపీకి హోదా ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు తెలుగు వారంతా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని పిలుపునిచ్చినా అది అంతగా పని చేసే అవకాశం లేదంటున్నారు. స్థానికంగా ఉన్న నేతలు, అక్కడి పరిస్థితులే ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.