భాజపా : నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు!

మొండివాడు రాజుకంటె బలవంతుడు అని సామెత. ఎవరి మాటను లక్ష్యపెట్టే అలవాటు లేని మొండివాడు.. తాను తలచిందే చేస్తాడు తప్ప.. ఇతరులు తనను చూసి నవ్వుతారేమో.. సిగ్గుపడాల్సి వస్తుందేమో అని ఖాతరు చేయడు. అలాంటిది మొండివాడే రాజు కూడా అయితే ఇక పరిస్థితి ఎలా ఉంటుంది? అచ్చంగా ప్రస్తుతం మన మోడీ సర్కారు లాగా ఉంటుంది… అని పలువురు భావిస్తున్నారు. తప్పు చేసేది వాళ్లే.. అయితే ఆ తప్పును కవర్ చేసుకుంటూ.. ప్రజలంతా తమను తప్ప ఇతరులను నిందించేలాగా.. తప్పుడు దీక్షలకు సిద్ధపడేదీ వాళ్లే అని ఢిల్లీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తమ చేష్టలు చూసి.. ప్రజలు వెటకారంగా నవ్వుకుంటారేమో అని వెరపు కూడా లేకుండా… భాజపా ప్రవర్తిస్తున్నదంటే.. ఎంతగా తెగించి ఉన్నదో కదా అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.

పార్లమెంటు దాదాపు గత నెలరోజులుగా స్తంభించిపోయి ఉన్నదంటే.. దానికి ప్రధాన పాపం అధికార పార్టీ భారతీయ జనతా పార్టీదే అని ఎవరైనా ఒప్పుకుంటారు. ఎందుకంటే.. సభను స్తంభింపజేస్తున్నది ఒకే ఒక్క పార్టీ. ఇలాంటి ఆందోళనలు సభా కార్యకలాపాలకు అడ్డు కలిగిస్తున్నప్పుడు సస్పెండ్ చేసి అయినా దేశ ప్రయోజనాల కోసం సభను సజావుగా నడిపించాల్సిన బాధ్యత స్పీకరుకు ఉంటుంది. అంతటి గురుతర బాధ్యత ఉంటుంది గనుకనే.. స్పీకరును పార్టీలతో నిమిత్తం ఉండని రాజ్యాంగబద్ధ పదవిగా గుర్తించడం జరిగింది.

అయితే అన్నా డీఎంకే ఆందోళనల పట్ల ఉపేక్ష ధోరణి అవలంబిస్తూ.. సజావుగా లేదనే నెపంతో సభను నెలరోజులుగా వాయిదాలే వేస్తూ.. చివరికి నిరవధిక వాయిదా వేసేశారు. తద్వారా అవిశ్వాస తీర్మానం తప్పించుకున్న పిరికితనాన్ని మాత్రమే కాదు, ప్రజా అంశాల పట్ల చిత్తశుద్ధి లేదని కూడా నిరూపించుకున్నారు.

అయితే ఇప్పుడు రివర్స్ గేర్ లో భాజపానే దీక్షలకు దిగుతుందిట. సభను ప్రతిపక్షాలు సజావుగా నడవనివ్వకుండా అడ్డు పడ్డాయి గనుక.. ఈనెల 12వ తేదీన నిరాహార దీక్షలు చేయబోతున్నట్లుగా కమలదళం ప్రకటించింది. ఇంత పనికిమాలిన ఉద్యమాలు కూడా ఉంటాయా అని ప్రజలు నివ్వెర పోతున్నారు.

సభా కార్యక్రమాలకు ఆద్యంతమూ అడ్డుపడింది… అన్నా డీఎంకే పార్టీ. భాజపాకు దమ్ముంటే వెళ్లి తమిళనాడులో ఆ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలు చేయాలి. కానీ.. అంత సత్తా వారికి లేదు. పైగా కావేరీ వివాదం… చెలరేగుతున్న సమయంలో తమిళనాడులో అడుగుపెట్టే సాహసం కూడా వారికి ఉండదు. పైగా అన్నాడీఎంకే తో వారే డ్రామా ఆడించి, వారిని తప్పు పట్టలేరు. కాబట్టి.. విపక్షాలు అన్నిటికీ నేరాన్ని ఆపాదించి.. తాము దీక్షలు చేసేసి డ్రామా చేయాలని చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కేంద్రంలో అధికార పార్టీది తెగించిన వ్యవహారంగా ఉన్నదని పలువురు అంటున్నారు.

3 Comments

  1. eesari tamilnadulo electionlu jarigithe BJP gani EPS,PANNEER gani address vundadu. DMK leka SASIKALA gelavadam khayam.

    • not only TN. In next LS polls also BJP gallanthe. Idantha swayakrutham..modi & shaa nirvakam. In fact struggle starts after defeat in Karnataka and repetetion in Rajasthan and MP state polls. There is no wonder if their own party MPs will vote against him. That is the reason they ran away from LS

  2. Ore modi neeku politics asalu Ravu. Veli tee ammuko. 130 Kotla prajalu verivalu anukunte nuvu pichodivi ani prajalu teerpu chepadaniki 2019 lo prajalu sidamga vunaru

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.