శివసేన దారిలోకి వస్తుందా…

శివసేన బుజ్జగించే పని ప్రారంభమైంది. ఆపరేషన్ గరుడను తిరిగి ప్రారంభించారు. కర్నాటకలో గరుడకు దెబ్బ తగిలిన త్వరలోనే అక్కడి ప్రభుత్వం కూలిపోతుందనే ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అంత తేలికగా పదవిని వదిలి పెట్టుకునేందుకు సిద్దంగా లేదు. అందుకే కుమారస్వామి ఊపిరి పీల్చుకునేందుకు కొద్దిగా సమయం ఇచ్చారంటున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టే ముందు మహారాష్ట్ర సంగతి తేల్చుకునేందుకు సిద్దమైంది కమల దళం. అందుకే శివసేన అధినేత ఉద్దవ్ థాకరేను కలిసేందుకు బీజేపీ నేతలు సిద్దమయ్యారు.

2019లో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నారు. తెర వెనుక సంఘ్ పరివార్ హస్తం ఉంది. ఇప్పటికే పలువురు కీలక నేతలతో సమావేశమై మద్దతు కోరుతున్నారు. రేపు ముంబైకి వెళ్లనున్న అమిత్ షా.. ఉద్ధవ్ థాకరే నివాసం ‘మాతోశ్రీ’లో సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని శివసేన ధృవీకరించింది. ‘ఉద్ధవ్ థాకరేను కలుసుకునేందుకు అమిత్‌షా సమయం కోరారు. అందుకే రేపు సాయంత్రం రావాల్సిందిగా ఆయనకు అపాయింట్‌మెంట్ ఇచ్చామని చెప్పింది. 2014 నుంచి మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాయి శివసేన, బీజేపీలు. పాల్ఘడ్ ఉపఎన్నికల తర్వాత విబేధాలు మరింతగా పెరిగాయి. శివసేన పై బీజేపీ గెలిచిన సంగతి తెలిసిందే. అయినా సరే ఆ గెలుపును పట్టించుకోవడం లేదు బీజేపీ. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు సమాలోచనలు చేశారు.

ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వెళ్లిన శివసేనను దారిలోకి తెచ్చుకునే పనిచేయాలని ఆలోచించారు. ఇప్పుడు అమలు చేస్తున్నారు. బీజేపీపై ప్రతిరోజూ మాటలదాడికి దిగుతున్న శివసేన లేకుండా 2019 ఎన్నికల్లో అధికారం దక్కించుకోలేమని కమలం నేతలు బలంగా నమ్ముతున్నారు. అందుకే శివసేనను దారిలోకి తెచ్చుకునే పని చేస్తున్నారు. వారికి ఏం కావాలో అది చేసేందుకు సిద్దమయ్యారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్టు శివసేన ఇప్పటికే ప్రకటించింది. ఫలితంగా అమిత్‌షా- ఉద్ధవ్ థాకరే సమావేశంపై ఆసక్తి నెలకొంది. ఒంటరిగా పోటీ చేస్తే మిగతా వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని బీజేపీ వాదిస్తోంది. అందుకే వారికి కావాల్సిన మేరకు తగ్గేందుకు సిద్దమైంది బీజేపీ. ఫలితంగా చర్చలు సానుకూలంగా జరుగుతాయా..లేక ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.