పోల‌వరం చుట్టూ.. క‌మ‌లం ముళ్లు!

పోల‌వ‌రం ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన ప్రాజెక్టు.. జాతీయ‌స్థాయిలో దీని నిర్మాణం అనిత‌ర సాధ్య‌మంటూ ప్ర‌శంస‌లు వస్తున్నాయి. రికార్డు స్థాయిలో నిర్మాణం పూర్తిచేసిన ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు ఇవ్వాల‌నేది టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు సంక‌ల్పం. బ్రిటీష్ హ‌యాంలో త‌ట్టిన ఆలోచ‌న‌కు.. ఇప్ప‌టికైనా రూప‌క‌ల్ప‌న ఇవ్వ‌గ‌లిగితే.. త‌న పేరు చ‌రిత్ర ఉంటుంద‌నేది బాబు ఆలోచ‌న కావ‌చ్చు. పైగా ఇన్నేళ్ల రాజకీయ ప్ర‌స్థానంలో ఇది మైలురాయిగానే సీఎం బాబు భావిస్తున్నారు. కానీ.. దీనికి జులై గండం మోకాల‌డ్డుతుంది. కీల‌క‌మైన ఆదేశాలు కేంద్రం చేతిలో ఉండ‌టంతో ఇటు పాల‌కుల్లో.. అటు ఇంజ‌నీరింగ్ నిపుణుల్లోనూ టెన్ష‌న్ మొద‌లైంది.

ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కూ వేగంగా సాగుతూ వ‌చ్చిన ప‌నులు ఒక్క‌సారిగా ఆగినా ఇబ్బందే.. రాబోయేది వ‌ర్షాకాలం అగ‌స్టు నుంచి భారీవ‌ర్షాలు ఉంటాయి. మూడు నెల‌ల పాటు నిర్మాణం స‌జావుగా సాగుతుంద‌నేది అస‌లు స‌మ‌స్య. ఎందుకీ.. అడ్డంకి అంటే.. అస‌లు విష‌యంలోకి వెళ్లాల్సిందే.. అదేమిటంటే.. పోల‌వ‌రం నిర్మాణానికి ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తి చాలా కీల‌కం దీనికి కేంద్రం అట‌వీ ప‌ర్యావ‌ర‌ణ శాఖ ఏటా ఆ ఏడాది వ‌ర‌కూ మాత్ర‌మే అనుమ‌తి ఇస్తూ వ‌స్తుంది. దీన్నే స్టాప్ వ‌ర్కు ఉత్త‌ర్వుగా పేర్కొంటారు.  స్టే ఆర్డ‌ర్  జులై 2వ తేదీ క‌ల్లా ముగుస్తుంది. మ‌ళ్లీ ఎప్పుడు ఇస్తార‌నేదానిపై క్లారిటీ లేదు. గ‌తంలో మిత్ర‌పక్షం కాబ‌ట్టి సీఎం చంద్ర‌బాబు ఫోన్ చేసే స‌రిపోయేది.

కానీ.. ఇప్పుడు వైరివ‌ర్గాలు కారాలు మిరియాలు నూరుకుంటున్నాయి. పైగా ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌పై టీడీపీ కార్య‌క‌ర్త‌లు దాడికి పాల్ప‌డ్డారంటూ బీజేపీ రాద్దాంతం చేస్తుంది.  ఈ స‌మ‌యంలోనే ఏపీ స‌ర్కారు కేంద్రానికి ఓ విజ్ఞ‌ప్తి చేసింది. స్టాప్‌వ‌ర్క్ స్టే ఆర్డ‌ర్‌ను మ‌రో ఏడాది పెంచ‌మంటూ కోరింది. దీనిపై ఇప్ప‌టికీ ఎటువంటి నిర్ణ‌యాలు తీసుకోలేదు. వాస్త‌వానికి ఎప్ప‌టి నుంచో పోల‌వ‌రం నిర్మాణాన్ని చ‌త్తీస్‌ఘ‌డ్‌, ఒడిషా ప్ర‌భుత్వాలు వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్నాయి. రెండేళ్ల క్రితం నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ స్టాప్‌వ‌ర్క్ ఆదేశాలిచ్చింది. దీనిపై నాటి ప‌ర్యావ‌ర‌ణ మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేవ‌క‌ర్ గ‌తేడాది స్టే ఆర్డ‌రిచ్చారు. ఆయ‌నిచ్చిన స్టే ఆర్డ‌ర్‌ను రెండేళ్ల‌పాటు ఇవ్వాలంటూ ఆనాడే రాష్ట్ర ప్ర‌భుత్వం కోరింది. దీంతో రెండేళ్లు పొడిగిస్తూ.. జ‌వ‌దేవ‌క‌ర్ ఆర్డ‌ర్ ఇచ్చారు. కానీ ఇంత‌లో ఆయ‌న మంత్రివ‌ర్గం మార‌టంతో అదే ప‌ద‌విలోకి అనిల్‌ దవే వచ్చారు. పోల‌వ‌రం పై రెండేళ్ల స్టేపై అభ్యంత‌రం చెబుతూ దాన్ని ఏడాదికే ప‌రిమితం చేశారు. దీంతో 2018 జులై 2కు దాని గ‌డ‌వు ముగుస్తుంది. అదే.. రెండేళ్ల అలాగే కొన‌సాగించిన‌ట్ల‌యితే 2019 జులై 2 వ‌ర‌కూ పోల‌వ‌రం స‌జావుగా సాగేందుకు అవ‌కాశం ఇచ్చిన‌ట్ట‌య్యేది. కానీ ఇప్పుడు గ‌డ‌వు ముంచుకు వ‌స్తుండ‌టంతో  మ‌రో ఏడాది స్టే పొడ‌గించాలంటూ రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రానికి లేఖ రాసింది.  అయితే ఇటీవ‌లే ఒడిషా ముఖ్య‌మంత్రి ప‌ట్నాయ‌క్ పోల‌వ‌రం నిర్మాణంపై అభ్యంత‌రం వ్య‌క్తంచేస్తూ కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ‌కు లేఖ‌రాశారు.

ప్ర‌స్తుతం ఇది పెండింగ్ లో ఉంది. ప్ర‌స్తుతం కేంద్ర అట‌వీ ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ ఏపీ వైపు సానుకూలంగానే ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే.. ఫైలు మాత్రం.. కేంద్ర కార్య‌ద‌ర్శి ఝా వ‌ద్దకు వెళ్లాల్సి ఉంది. అయితే.. ఒడిషా సీఎం అభ్యంత‌రం చెబుతూ రాసిన లేఖ‌.. ఏపీ కోరిక రెండింటిపై  కేంద్రం ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌నేది స‌స్పెన్స్‌. ఈ విష‌యంలో పీఎం న‌రేంద్ర‌మోదీ ఎటువైపు ఉంటారు.. చంద్ర‌బాబుపై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తారా! జాతీయ ప్రాజెక్టు కావ‌టంతో పోల‌వ‌రం వైపు మొగ్గుచూపి త‌న పెద్ద‌రికం చాటుకుంటారా! అనేది తేలాలి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.