బీజేపీకి షాక్ !!టీడీపీలోకి కీలక నేత

ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ఇలాంటి సమయంలోనే వలసలు ఎక్కువగా ఉంటాయి. టీడీపీ నుంచి వైకాపాకు అలానే వైకాపా నుంచి టీడీపీకి చేరుతున్నారు నేతలు. ఇప్పుడు బీజేపీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు ఎక్కువగా ఉంటున్నాయి. ఏపీలో ఆ పరిస్థితి ఇంకాస్త ఎక్కువగా ఉంది. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి పెత్త ఎత్తున మిగతా పార్టీలకు వలస వెళ్లారు నేతలు. ఇప్పుడు ఆ పరిస్థితి బీజేపీకి వచ్చింది. అందుకే బీజేపీలో ఉండేందుకు నేతలు ఎవరూ ఇష్ట పడటం లేదు. కన్నా లక్ష్మీనారాయణ, కాటసాని రాంభూపాల్ రెడ్డి వంటి నేతలు పార్టీ మారేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పుడు కాకపోయినా కామినేని, విష్ణుకుమార్ రాజులాంటి నేతలు పార్టీ మారతారనే ప్రచారం సాగుతోంది. వారి సంగతి ఏమోగానీ తిరుపతిలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన కారుమంచి జయరామ్ ఇప్పుడు పార్టీ మారుతున్నారు. 
ఇది బీజేపీకి షాకింగ్ వార్తనే. 
 
తిరుపతిలో ధర్మ పోరాట సభ నిర్వహించనుంది టీడీపీ. ఈ సభలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు జయరామ్. కారుమంచి జయరామ్‌ ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ఫ్యాక్స్‌లో పంపారు. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లె, సూళ్లూరుపేట, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల నేతలతో జయరామ్ ముందుగా మాట్లాడారు. వారి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే తానుపార్టీ మారుతున్నట్లు ప్రకటించారు జయరామ్. ఏపీకి హోదా, విభజన హామీలను అమలు చేసే విషయంలో బీజేపీ అన్యాయంగా వ్యవహరిస్తోంది. అందుకే ఆ పార్టీ పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఇక ఆ పార్టీ నిమిషం పాటు ఉన్నా ఆ ప్రభావం తమ పై పడుతుందని భావిస్తున్నారు జయరామ్. అందుకే పార్టీ మారుతున్నారు.  
తిరుపతి నియోజకవర్గ సమస్యలను పార్టీ పెద్దలకు చెప్పినా పట్టించుకోలేదట. బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు మూడు గ్రూపులు, ఆరు ముఠాలుగా కొనసాగుతున్నాయి. నరేంద్ర మోదీ తిరుపతి బహిరంగ సభలో ఏడుకొండలుపైన, తిరునామం వైపు వేలెత్తిచూపుతూ ఢిల్లీని తలదన్నే రాజధానిని ఏపీలో నిర్మిస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. నేను దీనికి ప్రత్యక్ష సాక్షిని. అయినా సరే హామీ నెరవేర్చలేదన్నారు. అందుకే పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. ఇది బీజేపీకి చెంపపెట్టులాంటిది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.