బీజేపీ ఎదురుదాడి.. నమ్మని జనాలు

ఏపీకి అన్ని ఇస్తున్నాం. కానీ టీడీపీ సర్కార్ సరిగా వినియోగించుకోలేక పోయిందనే ప్రచారం చేస్తోంది బీజేపీ. లెక్కలు చూపించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. అన్నీ అక్రమాలే అంటోంది. మరోవైపు పోలవరం లాంటి వాటిపై శ్వేత పత్రం ఇవ్వాలని విపక్షాలు అంటే కుదరదన్నారు చంద్రబాబు. ఆ విషయంలో చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కాదు. పనులు పారదర్శకంగా జరుగుతున్నప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. కానీ ఈ విషయంలో చంద్రబాబు దాటి వేత ధోరణితో అక్రమాలు చేస్తున్నారనే అనుమానం తీసుకువస్తున్నారు. ఫలితంగా పోలవరం విషయంలో ఆయన తప్పు చేస్తున్నారనే ప్రచారం చేస్తోంది బీజేపీ. పట్టిసీమ విషయంలోను కాగ్ తప్పు పట్టిన సంగతి తెలిసిందే. వందల కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయిని కాగ్ ఆరోపించింది. రెవిన్యూ లోటు 75 వేల కోట్ల రూపాయల నుంచి లక్ష కోట్లకు మారుతోంది.  
2014-15లో రూ. లక్ష 75 వేల కోట్ల అప్పులు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. 2015-16 లో అది కాస్త 2 లక్షల కోట్ల అప్పు దాటేసింది. ఎఫ్ఆర్బీఎం ప్రకారం 3 శాతానికి అప్పు మించరాదనే నిబంధన ఉండేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం అంతకు మించి అప్పు చేయడం పైనా బీజేపీ దృష్టిపెట్టింది. పైగా నాలుగేళ్లలో 75 వేల కోట్లు రెవెన్యూ లోటు. 2014-15లో రూ.21,779 వేల కోట్లు ఇచ్చింది కేంద్రం. 2015-16 కేంద్రం నుంచి రూ.21,927 కోట్ల నిధులు. 2017-18 రూ.23,346 వేల కోట్లు నిధులు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటికంటే ఎక్కువగానే కేంద్రం నిధులు వచ్చాయి. కాగ్ ఈ సంగతి బయట పెట్టింది. కేంద్రం నుంచి నిధులు రావడంలేదనేది నిజం కాదు. కావాలని బీజేపీపై నింద వేయడానికే ఇలాంటి పనులు చంద్రబాబు చేస్తున్నారని బీజేపీ చెప్పనుంది. హోదా విషయంలో బీజేపీ వెనక్కు తగ్గింది. అదే ఇప్పుడు బీజేపీకి బండగా మారింది. ప్రజల దృష్టిలో విలన్ అయింది. ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాక మల్లగుల్లాలు పడుతోంది. ప్రజలు పోరాటం చేస్తున్నారు. వారి ఆలోచనలకు విరుద్దంగా వ్యవహరిస్తే రేపు ఎన్నికల్లో ఓటమి తప్పదు. అందుకే దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. చంద్రబాబు చేసిన పనులపై విమర్శలు గుప్పిస్తోంది.
టార్గెట్.. చంద్రబాబు
గతంలో చంద్రబాబు పై ఉన్న కేసులను తిరిగి తోడేందుకు న్యాయ నిపుణులతో బీజేపీ నేతలు చర్చించారని తెలుస్తోంది. వీలున్నంత తొందరగా బాబు నోరు మూయించక పోతే తమకు ఇబ్బంది అని గ్రహిస్తున్నారు బీజేపీ పెద్దలు. అందుకే కట్టడి వ్యూహాన్ని సిద్దం చేస్తున్నారు. వ్యూహాత్మకంగా ఏపీ సీఎం చంద్ర‌బాబుపై బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తుంద‌ని టీడీపీ నేత‌లు న‌ల్ల బ్యాడ్జీలు క‌ట్టుకొని తిరుగుతున్నార‌ు. స్పీక‌ర్ కూడా న‌ల్ల‌బ్యాడ్జి ధ‌రించి నిర‌స‌న చేయోచ్చా అని బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు అంటున్నారు. స్పీకర్ రాజ్యంగబద్దమైన పదవిలో ఉన్నారు. అలాంటి వ్యక్తి నిరసన తెలపడం మంచిది కాదు. టీడీపీకి అనుకూలంగా మరో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఇప్పటికే స్పీకర్ కోడెల పై ఉన్నాయి. అలాంటి వ్యక్తి నల్ల బాడ్జీలు ధరించడం వివాదాన్ని రేపింది. పార్టీలో ఉంటే సరే. అలా లేరు కాబట్టి రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. 
ఏపీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తూ విజ‌య‌వాడ‌లో బీజేపీ నేత‌లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలుగువారి ఆత్మ‌గౌర‌వం, ఆత్మాభిమానం అని రెచ్చ‌గొడుతున్నారని అందులో ప్రస్తావించారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధుల‌పై క్లారిటీ ఇవ్వాల‌ని చంద్రబాబును వారు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల‌తో రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు. రాష్ట్రానికి ఉన్న అప్పులెంత‌, ఆస్తులంతా త‌దిత‌ర అంశాల‌పై శ్వేత ప‌త్రం విడుదల చేయాల‌ని ఆ ఫ్లెక్సీలో ఉంది. హోదా కోసం విద్యార్థులు, ఉద్యోగాలు కలిసి రావాలని చంద్రబాబు పిలుపునివ్వడం బీజేపీని ఆందోళనకు గురి చేస్తోంది. అందుకే చంద్రబాబు పై టార్గెట్ పెట్టిందని తెలుస్తోంది. 

1 Comment

  1. Ila adigevaru mundu kendram lo vunna BJP ni AP kosam enni nidhulu ketayincharu, vaatilo yenni nidhulu ichcharu kendranni sweta patram vidudala cheyamandi. Nijalu bayataku vastaayi.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.