జ‌గ‌న్‌ను ఇరికించావు క‌దా క‌న్న‌య్యా!

తెలుగుదేశం అధ్య‌క్షుడు ? – చంద్ర‌బాబు
వైసీపీ అధ్య‌క్షుడు ? – జ‌గ‌న్‌
కాంగ్రెస్ అధ్య‌క్షుడు ? – ర‌ఘువీరా
బీజేపీ అధ్య‌క్షుడు ? ….. క‌న్నా అనుకుంటానండీ..! ఇది ఏపీలో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ పాపులారిటీకి ఒక చిన్న ఎగ్జాంపుల్‌. క‌న్నాకు వ‌చ్చిన ఈ ద‌య‌నీయ ప‌రిస్థితికి బీజేపీ అంటే మోడీ చేసిన మోసాలు త‌ప్ప ఆ పార్టీకి చెందిన ఇంకేదీ గుర్తుకు రాక‌పోవ‌డం ఒక కార‌ణం అయితే, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ర్యాలీల‌కు స‌భ‌ల‌కు వ‌చ్చిన జ‌నం చూసి ఆ ఫొటోలు వేస్తే పాపం క‌న్నా ప‌రువు పోతుంద‌ని… క‌న్నా మాట్లాడిన‌ది మాత్ర‌మే వేస్తున్నార‌ట మీడియా వాళ్లు. ఇదేం బాగాలేద‌ని భావించిన క‌న్నా ర్యాలీలు వ‌ద్దు మీటింగులు పెట్టుకుందాం అపుడుపుడు ప్రెస్‌మీట్లు పెడ‌దాం అనుకున్నాడట‌.
ఈరోజు ఆయ‌న మాట్లాడుతూ చంద్ర‌బాబు అవినీతి గురించి మాట్లాడి జ‌గ‌న్‌ను ఇరికించాడు. ఆయ‌న ఏమ‌న్నారంటే… చంద్ర‌బాబు ఇల్లు చూస్తే తెలుల‌స్తుంది చంద్ర‌బాబు ఎంత అవినీతి ప‌రుడో అన్నాడు. చంద్ర‌బాబుకి ఉన్న ఇళ్ల‌న్నీ జ‌నాల‌కు తెలుసు. అవి ఎన్ని బెడ్‌రూములో కూడా జ‌నాల‌కు తెలుసు. అలాగే ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ గారి 80 బెడ్‌రూముల (హైద‌రాబాదు) ఇల్లు, బెంగుళూరులోని ల‌గ్జ‌రీ రాజ ప్ర‌సాద‌మూ తెలుసు. మ‌రి నాలుగైదు బెడ్ రూముల చంద్ర‌బాబు ఇల్లు ఆయ‌న అవినీతి గురించి అంత చెబితే… జ‌గ‌న్ ఇళ్లు బ‌ట్టి జ‌గ‌న్ చేసిన అవినీతి ఎంత ఉండొచ్చు క‌న్నా గారు… ఎదుటి వారి గురించి చెప్పినావు స‌రే. మ‌రి మీ మిత్రుడి గురించి కూడా చెప్పాలి కదా. గుంటూరు జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థులు భ‌రోసా ఇస్తే స‌రిపోతుందా…జ‌గ‌న్ గురించి కాస్త శ్ర‌ద్ధ పెట్టాలి క‌దా.
క‌న్నా వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో ఏమంటున్నారో తెలుసా… ఇల్లే ప్రామాణికం అయితే జ‌గ‌న్ చేసిన‌ అవినీతి ల‌క్ష కోట్లు కాదు అంత‌కంటే ఎక్కువే అయ్యింటుంది క‌న్నా అంటున్నారు.

1 Comment

  1. కన్నా వారి ఇల్లు ఏమీ తక్కువ కాదంటారు తెలిసిన వారు.H

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.