బీజేపీకి ఎదురుగాలి…

బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. గతంలో ఉన్న హవా ఇప్పుడు తగ్గుతోంది. ఇక తగ్గాల్సిందే. ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుని పాలన చేయాలని ప్రజలు హెచ్చరిస్తున్నారు. లేకపోతే ఇబ్బందినే. రెండు నెలల కిందట జరిగిన రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఉప ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ చేతిలో పరాజయం పాలైంది బీజేపీ. రెండు ఎంపీ స్థానాలు, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో క‌మ‌ల‌నాధుల‌కు చుక్క‌లు క‌నిపించాయి. ఒక్కో ఎంపీ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ ఏకంగా రెండు ల‌క్ష‌ల‌కుపైగా ఓట్ల తేడాతో గెలిచింది. తాజాగా పంజాబ్‌లోనూ బీజేపీకి క‌ల‌వ‌రం తెప్పించే ఫలితాలు వచ్చాయి. ఫలితంగా మోడీకి ఎదురు దెబ్బలు తగిలేలా ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో ఏమైనా జరగొచ్చని ముందుగానే చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. అది నిజమయ్యేలా ఉంది. 
పంజాబ్‌లోని లూథియానా మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ విజ‌య భేరి మోగించింది. బిజెపి, శిరోమణి అకాలీదళ్ కూట‌మి క‌లిసి పోటీ చేసినా ఓట‌మి త‌ప్ప‌లేదు. లూథియానాలోని 95 వార్డుల‌కు జ‌రిగిన పోటీలో కాంగ్రెస్‌ 61 వార్డుల్లో ఘన విజయం సాధించింది. అక్కడ శిరోమణి అకాలీదళ్ 11 వార్డులను, బిజెపి 10 వార్డులను గెలుచుకున్నాయి. ఎల్పీ, ఏఏపి కూటమి 8 వార్డుల్లో గెలిచాయి. నాలుగు వార్డుల్లో స్వతంత్రులు గెలిచారు. పంజాబ్‌లో అతి పెద్ద మునిసిపాలిటీ లూథియానా. అక్కడ కమలం జెండా ఎగురేసేందుకు నేతలు పెద్ద ప్రయత్నమే చేసింది. మొన్న గుజరాత్ లోనే గట్టిగా పోరాడింది. మోడీకి అప్పుడే చుక్కలు కనపడ్డాయి. కానీ ఇప్పుడు అది మరింత దగ్గరకు చేరువ అయిందనుకోవాలి. కెప్టెన్ అమరీందర్ సింగ్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ అమృత్ సర్, పాటియాలా, జలంధర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీని గెలుపు బాటపట్టించారు. 
దేశంలో బీజేపీకి ఎదురుగాలి వీయనుందనే సంకేతాలు ఈ ఫలితాల ద్వారా అర్థమవుతోంది. కర్నాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణలలో బీజేపీకి పెద్దగా సీట్లు రావని అర్థమవుతోంది. అధికారాన్ని చేజిక్కించుకునే పరిస్థితుల్లో ఆ పార్టీ లేదు. అందుకే ఉత్తరాదిపై మరోసారి దృష్టి సారించక తప్పదు. లేకపోతే 2019 ఎన్నికల్లో ఏదైనా జరిగే వీలుంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.