సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే

తెలుగు రాష్ట్రాల్లో ఉనికిని కోల్పోయి బాధ పడుతోంది భారతీయ జనతా పార్టీ. విభజన హామీల విషయంలో ఏపీ ప్రజలను మోసం చేసిందనే కారణంతో ఆ రాష్ట్రంలో బీజేపీ పాతాలానికి పడిపోయే స్థితికి చేరుకోగా, తెలంగాణలో మాత్రం అంతంత మాత్రంగా ఉంది. అందుకే ఆ పార్టీ తెలంగాణపైనే ఎక్కువ దృష్టి సారించింది. అక్కడ వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. ఈ సారి మాత్రం ఒంటరిగా బరిలోకి దిగుతామని చెబుతోంది. ఈ ఎన్నికల్లో వీలైనన్ని అసెంబ్లీ స్థానాల పాటు, ఎంపీ స్థానాలను కూడా గెలుచుకోవాలని ఆ పార్టీ అనుకుంటుందట. దీని కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తుందట. అయితే, తాజాగా ఆ పార్టీకి చెందిన ఓ కీలక నేత గురించి బయటికి వచ్చిన వార్త కలకలం రేపుతోంది.

తెలంగాణలో బీజేపీ తరపున కీలక నేతగా ఉన్న ఆ పార్టీ శాసనసభా పక్ష నేత జి. కిషన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడంలేదట. అదేంటి.. తెలంగాణలోని బీజేపీలో ఉన్న ముఖ్య నేత కదా.. ఆయన పోటీ చేయకపోవడం ఏమిటి అనుకుంటున్నారా..? ఆయన పోటీ చేయనిది అసెంబ్లీకి మాత్రమే.. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని కిషన్‌రెడ్డి నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్‌గిరి నుంచి కానీ, సికింద్రాబాద్‌ నుంచి కానీ ఆయన ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేగా గెలిచినా ఉపయోగంలేదని, ఎంపీగా గెలిస్తే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవైన దక్కుతుందనే ఆలోచనతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

బీజేపీ అగ్రనేతల్లో ఒకరుగా, శాసనసభా పక్ష నేతగా ఉన్న జి. కిషన్‌రెడ్డి ఇప్పటి వరకు మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లోపాత హిమాయత్‌నగర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి కిషన్‌రెడ్డి విజయం సాధించారు. 2009లో జరిగిన నియోకజవర్గాల పునర్విభజనలో హిమాయత్‌నగర్‌ నియోజకవర్గం రద్దు అయ్యింది. కొత్తగా అంబర్‌పేట నియోజకవర్గం ఏర్పాటైంది. కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో అంబర్‌పేట నియోకవర్గం నుంచి విజయం సాధించి, నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు. అలాంటి నేత ఇప్పుడు ఎంపీగా పోటీ చేయబోతున్నారని తెలిసి ఆయన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.