బాబు చొరవతో భాజపాలో చీలిక!

పరిస్థితులు అంతా బాగున్నంత వరకూ ప్రతి అంశమూ  బాగా ఉన్నట్లే కనిపిస్తుంది. ఒక్కసారి తేడా వచ్చిందంటే.. మొత్తం కుప్పకూలిపోతుంది. ఇప్పుడు కేంద్రంలోని ఎన్డీయే వ్యవహారం.. కాదుకాదు, భాజపా పరిస్థితి కూడా అలాగే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీలో తిష్టవేసి ఏపీ సమస్యలను, విభజన చట్టం హామీలను నెరవేర్చడంలో కేంద్రం వంచనను అన్ని పార్టీల దృష్టికి తీసుకువెళ్లి మద్దతు కూడగట్టే ప్రయత్నాన్ని చేస్తున్నారు. బాబుకు మద్దతు ఇస్తున్న పార్టీల్లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే ముక్కలై ‘ఎన్డీయే (నారా)’ అంటూ కొత్త కూటమి ఏర్పడవచ్చుననే ఛలోక్తులు కూడా పార్లమెంటు సెంట్రల్ హాల్ లో వినిపించాయి. అందులో వింతేం లేదు. కానీ… విశ్లేషకులు భావిస్తున్న ప్రకారం.. భారతీయ జనతా పార్టీలో కూడా ఒక చీలిక పుట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని అంటున్నారు.

ఎన్డీయే భాగస్వామ్య పక్షాల్లో పలు పార్టీలకు చెందిన నేతలు సెంట్రల్ హాల్ కు  వచ్చిన చంద్రబాబునాయుడును కలిశారు. ఆయన వాదనకు మద్దతు తెలిపారు. కొందరు మాత్రం.. తాము ఇంకా ఎన్డీయే లో భాగస్వాములుగా ఉన్నాం గనుక.. ఇంతకుమించి కేంద్రాన్ని విమర్శించలేం అంటూ.. అసంతృప్తి ఉన్నా.. తమ నిస్సహాయ వైఖరిని బయటపెట్టారు. ఎన్డీయే పార్టీల నాయకులంతా చంద్రబాబు వద్దకు వచ్చి మాట్లాడడం, కేంద్రంలోని కొందరు మంత్రులు కూడా ఆయన వద్దకు వచ్చి మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లడం, యువ మంత్రులు కొందరు ఆయన వద్దకు వచ్చి ఫోటోలు దిగడానికి ఉత్సాహం చూపించడం గమనిస్తే.. బాబు ఎన్డీయే(నారా) ఏర్పాటు చేస్తారంటూ.. అక్కడే ఉన్న జాతీయ పాత్రికేయుడు రాజ్ దీప్ సర్దేశాయ్ వ్యాఖ్యానించడం విశేషం. ఇదొక ఎత్తు అయితే.. భాజపా నాయకుల మీద బాబు ప్రభావం గురించే ఢిల్లీలో అంతా చర్చించుకుంటున్నారు.

ఆయన సెంట్రల్ హాల్ లో ఉండగా.. పార్టీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి , ఆయన వద్దకు వచ్చి కలిశారు. పాత్రికేయులు ఈ కలయిక గురించి అడిగినప్పుడు మీరేమైనా అనుకోండి.. చంద్రబాబు మాకు పాతమిత్రుడు, గౌరవనీయ నాయకుడు అంటూ జోషి వ్యాఖ్యానించారు. మోడీ వచ్చాక.. జోషిని పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. జోషి, అద్వానీ తదితర సీనియర్లతో పాటూ బాజపాలోని వారి అనుచరగణాలు కూడా.. మోడీ వ్యవహార సరళి పట్ల ఆగ్రహంతో ఉన్నాయి. ఇలాంటి వారినందరినీ కూడగట్టి.. భాజపాలో ఒక చీలిక వర్గాన్ని తయారు చేయడం చంద్రబాబుకు చిటికెలో పని.. కానీ, ఆయన అందుకు పూనుకుంటారా లేదా అనే వ్యాఖ్యలు ఢిల్లీలో వినిపిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.