కేంద్రంలో బీజేపీదే అధికారం. అక్కడ ప్రభుత్వం పాలన చేస్తున్న తెలుగు రాష్ట్రాల్లో తామే అధికారంలో ఉన్నామనే భావనలో ఉంటారు బీజేపీ నేతలు. కానీ ఇప్పుడు ఏపీలో బీజేపీ నేతల పరిస్థితి అలా లేదు. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. బీజేపీ పేరు చెబితేనే జనాలు తిడుతున్నారు. ఎంతలా అంటే బీజేపీ జెండాలు కనపడితే చాలు చిరాకుపడుతున్నారు. ఫలితంగా తాము బీజేపీ అని చెప్పుకునేందుకు సిగ్గుపడాల్సి వస్తుందని గుంటూరు జిల్లా బాపట్ల పట్టణ బీజేపీ అధ్యక్షుడు ఆవుల వెంకటేశ్వర్లు వంటి వారు అంటున్నారు. అందుకే ఆయన బీజేపీని వీడి టీడీపీలో చేరారు. ఏపీకి బీజేపీ అన్యాయం చేసింది. విభజన హామీలు నెరవేర్చలేదు. హోదాను పక్కన పెట్టింది. ప్యాకేజి సంగతి చూడలేదు. ఇలా ప్రతి విషయంలోను అన్యాయం జరిగింది. ఫలితంగా బీజేపీ నేతలు ప్రజల్లో తిరగలేకపోతున్నారు. అందుకే పార్టీ మారే ఆలోచన చేస్తునన్నారు వాళ్లు.
మంత్రి కామినేని శ్రీనివాసరావు మంత్రి పదవికి రాజీనామా చేశాక పత్తా లేకుండా పోయారు. బీజేపీని ఇంతగా టీడీపీ, మిగతా పక్షాలు టార్గెట్ చేస్తున్నా.. తనకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదంతా బీజేపీ మీద తనుకున్న అక్కుసుతోనే అంటున్నారు. ఎవరు ఎన్ని అంటే మాత్రం నాకేంటి. నేను త్వరలో టీడీపీలో చేరతాను. ఆ పార్టీ పక్షాన ఎమ్మెల్యేగా పోటీ చేస్తాననే ధీమాతో ఉన్నారట కామినేని. అందుకే తన సొంత పార్టీ బీజేపీని ఎవరు ఎన్ని అన్నా పట్టించుకోవడం లేదంటున్నారు. ఇక విష్ణు కుమార్ రాజుతో పాటు…. కీలక నేతలు చాలా మంది పార్టీ మారేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే వారిని తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీ గాలం వేస్తోందట. ఇన్నాళ్లు వైకాపా నేతలపై టీడీపీ గురి పెట్టింది. ఇప్పుడు వారితో పాటు.. బీజేపీ నేతలను పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని అధినేత చంద్రబాబు ఆదేశాలిచ్చారట. అందుకే టీడీపీ నేతలు రంగంలోకి దిగారంటున్నారు. రానున్న కాలంలో మరిన్ని చేరికలు టీడీపీలోకి ఉంటాయనే చర్చ ఆ పార్టీలో సాగుతోంది. మరోవైపు బీజేపీ స్థానిక నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం తప్ప ఏం చేయలేకపోతున్నారు.
బంద్ కు అంతా మద్దతునిస్తున్నా.. తాము ఏం చేయలేకపోతున్నారు. బంద్ లో పాల్గొనాలని ఉన్నా.. ఏం చేయలేకపోతున్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమం చేయలేక అలాయని ప్రజల ఆకాంక్షలకు దూరంగా ఉండలేక విలవిలలాడుతున్నారు. గతంలో ఎప్పుడు బీజేపీకి ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. కానీ ఇప్పుడు తప్పడం లేదు. ప్రధాని మోడీ, అమిత్ షాల పైనా ఎక్కువగా విరుచుకుపడుతున్నారు జనాలు. ఫలితంగా బీజేపీకి ఏపీలో సీట్లు రావడం కష్టమేనని చెప్పాలి.
తుపాను ఉత్తరాంధ్రలో సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ప్రజల జనజీవనం ఆగిపోయింది. పనికెళ్తే గాని పూట గడవని పేదలు ఉత్తరాంధ్రలో ఎక్కువ. వారి ఇళ్లను కూడా తుపాను కబళించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ మంత్రి లోకేష్ ఇద్దరూ ఉత్తరాంధ్రకు పయనమై పూర్తి స్థాయిలో సహాయక చర్యలను […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ముందు ఈ భేటీ ఉండటంతో సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. జగన్ పార్టీ కేవలం హామీలకే పరిమితమవగా.. తమది చేతల ప్రభుత్వమని నిరూపించేలా తెలుగుదేశం సర్కారు ప్రజలపై వరాల జల్లు కురిపించారు. మంత్రి మండలిలో తీసుకున్న నిర్ణయాలు […]
తిరుగులేని మెజారిటీతో గెలిచిన కేసీఆర్కు అభినందనల వెల్లువ వస్తోంది. భిన్నమైన పథకాలతో ప్రజలను ఆకట్టుకున్నారు కేసీఆర్. కాంగ్రెస్ కొన్ని ఎక్కువ హామీలిచ్చినా… ఉన్నవి బానే ఉన్నాయి కదా కేసీఆరే బెటర్ అని జనం భావించారు. మొత్తానికి విజయవిహారం చేశారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత […]
Be the first to comment