తెలంగాణ‌పై బీజేపీ న‌జ‌ర్‌

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైంది. దీంతో జాతీయ నేత‌ల దృష్టి ఇప్పుడు రాష్ట్రంపై ప‌డింది. ఏక‌చ‌త్రాభినయంగా పాల‌న చేస్తున్న టీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలు వస్తే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని పార్టీ నేతలతో అమిత్ షా స్వయంగా చెప్పినట్లు తెలుస్తోంది. డిసెంబరులో ఎన్నికలు జరిగే రాజస్థాన్.. మధ్యప్రదేశ్.. ఛత్తీస్ గఢ్.. రాష్ట్రాలకు బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు. కాబ‌ట్టి అక్క‌డ  ప్రచార బాధ్యతలుపై పెద్ద‌గా శ్ర‌ద్ద చూపించాల్సిన అవ‌స‌రం లేదు.
అంతే కాకుండా బీజేపీ ప‌టిష్టంగా ఉండ‌టంతో అమిత్ షా త‌న‌ స‌మ‌యాన్ని అధికంగా తెలంగాణ పై పెడ‌తార‌ట‌. తానే స్వయంగా రంగంలోకి దిగి ప్ర‌చార వ్య‌వ‌హారాలు ప‌రిశీలించ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల‌కు చెప్పార‌ట‌. దీంతో రాజ‌కీయంగా ఆస‌క్తి నెల‌కొంది. తెలంగాణలో పార్టీ విజయంపై షా ధీమాతో ఉన్నార‌ట‌. పార్టీ వ‌ర్గాల‌తో మాట్లాడుతూ ఎలాంటి క్యాడర్ లేని త్రిపురలోనే పక్కా వ్యూహంతో విజయం సాధించామని.. అలాంటప్పుడు బలమైన కేడర్ ఉన్న తెలంగాణలో విజయం ఎందుకు సాధ్యం కాదన్న మాటను షా సంధిస్తున్నట్లుగా చెబుతున్నారు. టీఆర్ఎస్ తో సీరియస్ ఫైట్ చేయనున్నామని.. వార్ మొదలైనట్లేనని.. పార్టీ నేతలు తమ వంతుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 90 రోజుల పాటు 119 నియోజకవర్గాల్లో సభలను ఏర్పాటు చేయాలని సూచించిన ఆయన, ఈ నెల 12 లేదంటే 15 నుంచి మహబూబ్ నగర్ లో ఎన్నికల సమర శంఖారావాన్ని పూరిద్దామని చెప్పినట్టు సమాచారం. మొత్తానికి రాష్ట్రంలో ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మార‌నున్నాయి. 

1 Comment

  1. They are trying to decide alliance in andhra based on the TS results.
    This used to be Congress game, now played by BJP.
    Does anyone know the difference between these 2.
    Bishop Mandell Creighton was correct “Power corrupts and absolute power corrupts absolutesly

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.