ఓటమికి కారణం చెప్పి నవ్వుల పాలైన బీజేపీ!

అదో జాతీయ పార్టీ.. పైగా దేశంలో అధికారంలో ఉన్న పార్టీ. దేశ ప్రజలను ముందుండి నడిపించాల్సిన ఆ పార్టీ నేతలు మాట్లాడే తీరు ప్రజలకు నవ్వు తెప్పిస్తోంది. దేశ ప్రజలను మేల్కొల్పుతూ సక్రమమైన మార్గంలో నడిపించాల్సిన నేతలే నవ్వులపాలయ్యే మాటలు మాట్లాడటం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కమలం పార్టీ కకావికలం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమికి ఎలాంటి కారణాలు చూపాలో అర్థంకాలేదేమో పాపం! ఆ నెపాన్ని బాత్ రూమ్‌పై నెట్టేశారు. దీంతో ఇది చూసిన సాధారణ జనానికి దిమ్మతిరిగినంత పనైందట. సరిగ్గా పనిచేయకో, లేక చేసిన పనుల పట్ల ప్రజలకు అవగాహణ కల్పించలేకో ఓడిపోయామని చెప్పాలి గానీ ఇలా బాత్ రూమ్ సాకు చూపించటం ఆ పార్టీ నేతల తెలివితక్కువ తనానికి సూచకం అని చెప్పుకుంటున్నారు జనం.

హైదరాబాద్ లోని నాంపల్లిలో ఉన్న బీజేపీ కేంద్ర కార్యాలయంలో మూడో అంతస్తులో ఉన్న బాత్ రూమ్‌లో.. వాస్తు సరిగాలేదని అందువల్లే బీజేపీ ఓడిందని కారణం చూపుతున్నారు నేతలు. ఆ బాత్ రూమ్ నుంచి వింత శబ్ధాలు వెలువడుతున్నాయని, వాస్తు ప్రకారం అది అక్కడ ఉండరాదని అంటున్నారు. అంతేకాదు ఈ గదులను ధ్వంసం చేసి వాస్తు ప్రకారం సరిదిద్దితే తెలంగాణలో బీజేపీకి మహర్ధశ పట్టుకుంటుందని వాళ్లు చెబుతున్నారు. అయితే ఓటమికి బాధ్యతను తమపై వేసుకొని బేరీజు వేసుకోవాల్సిన నేతలు ఇలా బాత్ రూమ్ కథ అల్లుతూ.. కుంటిసాకులు వెతకడం ఆ పార్టీ శ్రేణులను కూడా నివ్వెరపరుస్తోందట.

జనరల్‌గా ఏ పార్టీ అయినా ఎన్నికలను ముందు వాటిని ఎలా ఎదుర్కోవాలని వ్యూహాలు రచించటం, ఒకవేళ అనుకున్నట్లుగా ఫలితం రాక ఓడిపోతే.. పార్టీపై చెడు ప్రభావం పడకుండా కాపాడుకునేందుకు ప్రయత్నియడం చేస్తుంటారు. కానీ దీనికి భిన్నంగా బీజేపీ నేతలు మాట్లాడుతున్న ఈ మూర్ఖత్వపు మాటలు.. వాళ్లనే నవ్వులపాలు చేస్తున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన నేతలు ఇలా బాత్ రూమ్ సాకు చూపటం నిజంగా సిగ్గుచేటే కదా మరి!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.