బీజేపీ స‌ర్కారు ఇంతగా దిగ‌జారిందంటారా!

1974 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నోసార్లు వ‌ర‌వ‌రరావు అరెస్ట‌య్యారు. ప‌లు కేసుల్లో విచార‌ణ   ఎదుర్కోన్నారు. మావోయిస్టుల ఎన్‌కౌంట‌ర్లు జ‌రిగిన ప్ర‌తిసారీ.. ఆయ‌న ఇంటిపై నిఘా పెంచేవారు. ఇంత జ‌రిగినా.. ఏ నాడు. పోలీసులు ఇంత అవ‌మానంగా ప్ర‌వ‌ర్తించ‌లేదంటూ సాక్షాత్తూ. వ‌ర‌వ‌రావు స‌తీమ‌ణి ఆవేద‌న వెలిబుచ్చారు.  ఎక్క‌డో ఆదివాసీ ఉద్య‌మాల‌తో ఏకంగా కేంద్ర‌స‌ర్కారు ఉలికిపాటుకు గురైంది. మ‌హారాష్ట్ర పోలీసులైతే.. ఏకంగా వ‌ర‌వ‌ర‌రావు.. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీను చంపేందుకు కుట్ర‌ప‌న్నారంటూ హుటాహుటిన హైద‌రాబాద్ చేరారు. వ‌ర‌వ‌ర‌రావుతో స‌హా క్రాంతి అనే జ‌ర్న‌లిస్టు.. మ‌రికొంద‌రు ఇళ్ల‌పై దాడులు నిర్వ‌హించి అరెస్టుచేసి.. పుణేకు త‌ర‌లించారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో బీజేపీ స‌ర్కార్‌కు కేసీఆర్ ప్ర‌భుత్వం పూర్తిగా స‌హ‌క‌రించింద‌నే ఆరోప‌ణ‌లు  వెల్లువెత్తుతున్నాయి. పైగా జ‌మిలీ అంటూ.. కేంద్రం.. ముంద‌స్తు అంటూ కేసీఆర్  ఎన్నిక‌ల ముచ్చ‌ట్ల‌కు కామ్రెడ్స్ అడ్డుప‌డ‌తార‌నే భ‌యం ఉంది.

అందుకే.. ఎమోష‌న‌ల్‌గా  ఉద్య‌మ‌కారుల‌ను బ‌ల‌హీన‌ప‌రిచేందుకు త‌మ జోలికి వ‌స్తే.. ఇదే ప‌రిస్థితి అంటూ హెచ్చ‌రిక‌గా చాటేందుకు ప్ర‌బుత్వాలు ఇలాంటి  ఎత్తులు వేశాయ‌నే విమ‌ర్శ‌లూ లేక‌పోలేదు.  ఇప్ప‌టికే కేర‌ళ వ‌ర‌ద‌బాధితుల‌కు  ఎన్‌డీఏ స‌ర్కారు స‌రైన ప్రాధాన్య‌త‌నివ్వ‌ట్లేదంటూ దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌సాగుతుంది. పైగా.. విదేశీ విరాళాలను వ‌ద్దంటూ త‌మ‌పై క‌క్ష సాధిస్తుందంటూ కేర‌ళ సీఎం ఆందోళ‌న వ్య‌క్తంచేశారు.మ‌రోవైపు ప‌శ్చిమ బెంగాల్‌లో వామ‌ప‌క్షాల‌పై క‌క్ష‌పూరితంగా బీజేపీ ఉందంటూ మండిప‌డుతున్నారు. ఓవ‌రాల్‌గా కాషాయం వర్సెస్  ఎర్ర‌జెండా అన్నంతంగా అంత‌ర్వుద్దం మొద‌లైంది.

ఇదే స‌మ‌యంలో ఏకంగా మోదీను హ‌త్య‌చేసేందుకు ప‌థ‌కం ప‌న్నారంటూ. వ‌ర‌వ‌ర‌రావును అరెస్ట్‌చేయ‌టం.. బెయిల్ పొందేందుకు వీల్లేని విధంగా సెక్ష‌న్స్ ఉంచ‌టం.. ఇవ‌న్నీ కేవ‌లం క‌క్ష‌పూర్వ‌కంగానే అనేది ప్ర‌జ‌ల్లోకి చేరుతుంది. ఇంత‌గా.. బీజేపీ దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు  తెర‌లేపితే.. 2019లో ప‌రిస్థితి మ‌రంత దారుణంగా ఉంటుంద‌నే ఆందోళ‌న క‌మ‌ల‌నాథుల్లో ఓ వ‌ర్గం నుంచి పెల్లుబుకుతోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.