జనాలకు ఏం చెప్పాలో అంటున్న బీజేపీ

ప్రజలంతా హోదా అడుగుతున్నారు. తాము అది ఇచ్చేది లేదని చెబుతున్నాం. కానీ వారి ఓట్లే కావాలి. ప్రజలను సంతృప్తి పరచకపోతే ఓట్లు రావు. ఏం చేయాలా అని మథనపడుతున్నారు ఏపీ బీజేపీ నేతలు. ఓవైపు పార్టీ సిద్ధాంతం. మరోవైపు రాష్ట్ర ప్రయోజనం. మొత్తంగా రాష్ట్ర బీజేపీ నేతలు ఇరకాటంలో పడ్డారు. ప్రజల ఆందోళనలు పట్టించుకోక పోతే వారు ఏం చేస్తారా బాగా తెలుసు. గతంలో కాంగ్రెస్ ఇలానే చేస్తే పాతర పెట్టేశారు. ఇప్పుడు బీజేపీకి అదే గతి పడుతుందనే భయం. వాటన్నింటినీ అధిగమించి ప్రజల్లోకి వెళ్లడం అంతే తేలిక కాదు. అందుకే ఇప్పుడు ఆ పార్టీ కోర్ కమిటీ భేటీ జరగనుంది. కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పటికే మంత్రులు కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆ పని చేస్తూనే సిఎం చంద్రబాబునాయుడు చాలా బాగా పరిపాలన చేశారని చెప్పారు కామినేని వంటి వారు. టీడీపీ పాలన బేష్ అంటూనే ఇప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తోంది. 
మేము అంతిచ్చాం. ఇంతిచ్చామని చెప్పాల్సి వచ్చింది. పురందేశ్వరి లాంటి నేతలైతే ఎదురుదాడి మొదలెట్టారు. పోలవరం ఖర్చులు సరిగా చూపించలేదని చెబుతున్నారు. అసలు మేమిచ్చే డబ్బులకు సరైన లెక్కలు చూపించడం లేదని విమర్శస్తున్నారు. చంద్రబాబు చేతలు ఇందుకు అనుమానం కలిగించేలా ఉన్నాయి. పోలవరం విషయంలో శ్వేత పత్రం ఇచ్చేది లేదనిచెబుతున్నారు. అలా ఇస్తే తప్పుడు లెక్కలు బయట పడతాయనే భయమే ఇందుకు కారణమనేది బీజేపీ చేస్తున్న విమర్శ. ఎన్ని విమర్శలు వచ్చినా తాను నీతి మంతుడు అని చెప్పుకునేందుకు ఉండే అవకాశాన్ని చంద్రబాబు మిస్ చేసుకుంటున్నారు. 
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అదే విషయం పై చంద్రబాబును ఒత్తిడి చేసినా ప్రయోజనం శూన్యమైంది. మీరు ఎన్ని అడిగినా ఇస్తాం. కానీ పోలవరం ప్రాజెక్టు విషయంలో శ్వేత పత్రం ఇచ్చేది లేదని చెబుతున్నారు. అదే ఇప్పుడు టీడీపీకి ఇబ్బంది కలిగిస్తోంది. బీజేపీ నేతలు విమర్శించేందుకు వరంగా మారింది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ తీరును అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, నేతలు తప్పు పట్టారు. అంతెందుకు బీజేపీ నేతలే అంతర్గత వేదికగా మా వాళ్లు తప్పు చేస్తున్నారని చెబుతున్నారు. కానీ పార్టీలో ఉన్నారు కదా..ఏం చేయాలో అర్థం కావడం లేదు వారికి. పైకి ఏం అనలేక అలాయని జనాల వాదనను కాదనలేక తల్లడిల్లుతున్నారు. 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.